అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎ను వైట్ హౌస్ నుంచి గెంటేస్తారా?

అమెరికా అధ్యక్షుడు

అమెరికా ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఉత్కంఠ పోరులో ట్రంప్ పై జోబైడెన్ విజయం సాధించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడు జనవరి 20న వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ మెట్లపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు నుంచి కొత్త అధ్యక్షుడి పదవీకాలం మొదలవుతుంది.

కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన అధికారిక నివాసమైన వైట్ హౌస్‎కు చేరుకోనున్నారు. అయితే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో తనకు ఎదురైన ఓటమిని ట్రంప్ అంగీకరించడం లేదు. అందువల్ల ట్రంప్ వైట్ హౌస్ ను విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తే జరిగే పరిణామాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది.

అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఎన్నికైన అధ్యక్షులు వైట్ హౌస్ విడిచి వెళ్లేందుకు నిరాకరించిన సందర్భాలు లేవు అయితే ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో జో బైడెన్ గెలుపుపై డోనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు సరైనా ఆధారాలు లేవు. ట్రంప్ ఈ ఎన్నికలపై న్యాయస్థానాలకు వెళ్లినా సరైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్షుడి పదవీకాలం జనవరి 20తో ముగిసిపోతుంది. దీంతో ట్రంప్ వైట్ హౌస్ విడిచి వెళ్లాలి. ఎన్నికల్లో అవసరమైన మెజార్టీతో బైడెన్ విజయం సాధించడంతో ఆయన నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ట్రంప్ పదవి నుంచి తప్పుకోకపోతే ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎన్నికల ముందు ఈ అంశంపై జో బైడెన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్ విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తే సైన్యం పంపించి వేస్తుందని ఆశిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. ఆనవాయితీ ప్రకారం ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు హాజరవుతారు. ఆ కార్యక్రమం అనంతరం కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్‎కు చేరుకుంటారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది పాత అధ్యక్షుడికి సంబంధించిన సామాన్లను ప్యాక్ చేసి కొత్త అధ్యక్షుడి సమాన్లను ఏర్పాటు చేస్తారు. ఇక పాత అధ్యక్షుడికి జీవితాంతం సీక్రెట్ సర్వీసెస్ భద్రత కల్పిస్తారు. అదే విధంగా పెన్షన్ తో పాటుగా మెడికల్, ప్రయాణ ఖర్చులతో పాటు సిబ్బంది ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.

జో బైడెన్ ఎన్నికల్లో లీడింగ్‎లో ఉన్న సమయం నుంచి అమెరికా అధ్యక్షుడికి కల్పించాల్సిన భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్ విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తే సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్ ను బయటకు తీసుకువెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సైనిక బలగాల సాయంతో ట్రంప్ అధికార నివాసంలో ఉండేందుకు అవకాశాలున్నా అలాంటి పరిస్థితి అమెరికా లాంటి దేశాల్లో ఉండే అవకాశం లేదు. పెద్దన్నలా వ్యవహరించే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగలేరు.

జనవరి 20 తర్వాత ట్రంప్ ఓటమిని నిరాకరిస్తే అక్కడ హింస చెలరేగే అవకాశాలున్నాయి. మరి ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వరకు వేచి ఉండాల్సిందే..

 

Like Our Facebook Page- Chudu Babai

 

చరిత్ర మరవని రోజు దివిసీమ ఉప్పెన @ 43 ఏళ్లు-  Click Here

 2,735 Total Views,  1 Total Views Today

Comment Your Views