పబ్ జీ.. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీడియో గేమ్. మొదట్లో పీసీ వెర్షన్ వచ్చినా అంత ప్రాముఖ్యం పొందని ఈ గేమ్ చైనా కు చెందిన టెన్సంట్ గేమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుని మొబైల్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. దీంతో ఈ వీడియో గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.
గేమ్ సైజ్ పెద్దది అయినా కూడా ఈ గేమ్ కు బానిసలు అవడంతో ఏ అప్డేట్ వచ్చినా వెంటనే డౌన్లోడ్ చేసేంతగా పాపులర్ అయింది. ఇక ఈ గేమ్ భారత్ లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతలా అంటే ఇంట్లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్న కొంచెం టైం దొరికితే చాలు ఈ గేమ్ ఆడేంతగా. సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసే వారి కన్నా పబ్ జీలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు.
భారత్ చైనా సరిహద్దుల వివాదం కారణంగా భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన అన్ని యాప్ లను భారత్ లో బ్యాన్ చేసింది. మొదటి లిస్ట్ లో పబ్ జీ పేరు లేకపోవడంతో యూజర్లు అందరూ సంబర పడ్డారు. విడతల వారీగా చైనా యాప్ లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఈ గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించడంతో చివరి సారిగా ఒక్కసారి ఆడాలని చాలా మంది ఆరాటపడ్డారు.
ఈ గేమ్ పై బ్యాన్ ప్రకటించిన వెంటనే ప్లే స్టోర్ లో మాయమైంది. కానీ గేమ్ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా కొన్ని రోజుల పాటు వచ్చింది. అయితే ఒక్కసారిగా గేమ్ ఓపెన్ అవ్వకపోవడంతో యువత నిరాశకు గురయ్యారు. పబ్ జీ బ్యాన్ అవ్వడంతో భారత్ కు చెందిన కొన్ని వీడియో గేమ్ సంస్లలు కొత్త రకం వీడియో గేమ్ లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ఫౌజీ పేరుతో కొత్త వీడియో గేమ్ త్వరలోనే విడుదల కానుంది.
ఇలాంటి నేపధ్యంలో ఈ సంస్థ ఒక సంచలన ప్రకటన చేసింది. పబ్ జీ ఇండియా పేరుతో త్వరలోనే ముందుకు రాబోతున్నాం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. www.pubgmobile.in పేరుతో ఓ వెబ్ సైట్ ను కూడా ఓపెన్ చేసింది. భారత్ లో ఉండాల్సిన టెర్మ్స్ అండ్ కండీషన్స్ ఆధారంగా గేమ్ ను రూపొందిస్తున్నారు. గతంలో ఈ గేమ్ హింసాత్మకంగా ఉందని బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గేమ్ ను డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే త్వరలో పబ్ జీ ఇండియా విడుదల చేస్తామంటూ ఓ విడియోను విడుదల చేశారు.
అతి కొద్ది రోజుల్లోనే పబ్ జీ ఇండియాలో విడుదల కానుంది. దీనికి ఒక కారణం ఉంది. తాజాగా PUBG INDIA అఫిషియల్ వెబ్ సైట్ లో డౌన్లోడ్ ఆప్షన్ దర్శనమిచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ లింక్ తో పాటుగా APK డౌన్లోడ్ బటన్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చింది. కానీ గూగుల్ ప్లే స్టోర్ బటన్ మీద క్లిక్ చేయగానే PUBG Mobile India coming soon అనే పేజీ ఓపెన్ కాగా, డైరెక్ట్ APK బటన్ మీద క్లిక్ చేయగానే పబ్ జీ మొబైల్ ఫేస్ బుక్ పేజీకి రీడైరెక్ట్ అయింది.
దీన్ని బట్టి అతి త్వరలోనే పబ్ జీ ఇండియాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకసారి బ్యాన్ అయిన గేమ్ మళ్లీ విడుదల కావడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరి పబ్ జీ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. ఈసారి గేమ్ కు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
Like our Facebook Page Chudu Babai
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను వైట్ హౌస్ నుంచి గెంటేస్తారా- Read Here
2,449 Total Views, 3 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022