కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో భారత్ లో రెండు వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కేంద్రం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలి అని చూస్తోంది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. మరి సామాన్యులకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుంది.
అసలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం అవసరమా?
కరోనా విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొంచెం తగ్గినా కరోనా మాత్రం పూర్తిగా పోలేదు అనేది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. భారత్ లో కరోనా వేవ్ ప్రారంభం కాగానే లాక్ డౌన్ లు అమలు చేసినా కేసులు అమాంతం పెరిగి పోయాయి. దీంతో భారత ప్రజానికం స్తంభించిపోయింది. దశల వారీగా కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. ఇప్పుడు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు సైతం సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ఆయా దేశాల్లో మరోసారి కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా స్ట్రెయిన్ కూడా విజృంభిస్తోంది. మరి ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఒక ఉపశమనంగా ఉపయోగపడుతుంది.
వ్యాక్సిన్ ఎవరెవరికి ఇస్తారు?
ప్రపంచం వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కు డిమాండ్ అధికంగా ఉంది. భారత్ లోని సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేశాయి. ప్రస్తుతం భారత్ లో కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రోటోకాల్ ప్రకారం మొదటిదశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అందించాలని కేంద్రం నిర్ణయించింది. హెల్త్ వర్కర్స్ తో, పారా మిలటరీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వీరందరూ సుమారు 3 కోట్ల మంది ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇక రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరూ సుమారు 27 కోట్ల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 30 కోట్ల మందికి జూలై నెలాఖరు నాటికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీకాలు వేసేందుకు దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.
సామాన్యులకు టీకా ఎలా?
భారత్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లతో పాటుగా మరికొన్ని వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. వాటి తయారీ పూర్తి అయి అందుబాటులోకి వస్తే మరింత మందికి టీకాను అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కోవిన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. క్లౌడ్ ఆధారితంగా పని చేయనున్న యాప్ ను ప్లేస్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులో లేదు. అయితే ఆ పేరుతో కొన్ని నకిలీ యాప్స్ ఉన్నాయని వాటిని ఉపయోగించవద్దని కేంద్రం హెచ్చరించింది.
కోవిన్ అధికారిక వెబ్ సైట్ లో కోవిడ్ 19 పై విజయం అనే అర్ధం వచ్చేలా Co-Win: Winning Over Covid 19 అని పెట్టారు. కోవిన్ యాప్ ను అధికారికంగా విడుదల చేసిన అనంతరం యాప్ స్టోర్, ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు తీసుకునేవారిని ట్రాక్ చేసేందుకు ఈ యాప్ దోహదపడనుంది. ప్రస్తుతానికి సామాన్యులకు అందుబాటులో లేకపోయినా, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చాకా మూడు విధాలుగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.
సెల్ఫ్ రిజిస్ట్రేషన్- ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం
మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్- యాప్ ను ఉపయోగిస్తున్న వ్యక్తి మరొకరికి టీకా రిజిస్ట్రేషన్ కోసం
బల్క్ రిజిస్ట్రేషన్- ఒకే ప్రాంతంలో ఉన్న చాలా మందికి రిజిస్ట్రేషన్ కోసం
రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డ గుర్తింపు కార్డును అవసరం కానుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ కేవైసీ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లాంటి 12 రకాల గుర్తింపు కార్డులు, పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు అందుతాయి. వాటితో పాటు వ్యాక్సిన్ వేసే తేదీ, సమయం, ప్రదేశం లాంటి సమాచారం కూడా అందిస్తారు.
Like Our Facebook Page Chudubabai
Read Our New Story Series Aakanksha Episode-2
1,804 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022