పాకిస్తాన్‌ ను నాశనం చేసిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్-నాశనం
పాకిస్తాన్-నాశనం

ఎప్పుడూ పక్క దేశం మీద పడి ఏడవడం.. ఉగ్రవాదులు దాడులు చేసినా మాకు సంబంధం లేదని తేల్చి చెప్పడం పాకిస్తాన్ కు పరిపాటే..

ఆర్ధికంగా వెనుకబడుతున్న పాకిస్తాన్

ఉన్నదాంతో సంతృప్తి చెందక.. పక్కవాడ్ని చూసి ఏడిస్తే మిగిలేది కన్నీళ్లే తప్ప.. కొత్తగా దొరికేది ఏది ఉండదు. ఇప్పుడు ఈ సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. కాశ్మీర్ ను చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్.. ఆర్ధికంగా చితికిపోతున్న దేశాన్ని కాపాడుకోవాలని కించిత్ ఆలోచన కూడా లేకుండా పోతోంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. అక్కడ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి ఊతమివ్వడం తప్ప సొంత దేశాన్ని కాపాడుకునేందుక ఇమ్రాన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

పాకిస్తాన్ కు దిగుమతులు అధికమవడంతో కరెన్సీ మారకం విలువ పూర్తిగా పడిపోతోంది. అదే విధంగా ఎగుమతులు వృద్ధి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆహార పదార్థాలు, చమురు ఉత్పత్తులు, వాహనాలు, మెషినరీ వస్తువుల దిగుమతులు భారీగా పెరిగాయి. కేవలం ఆగష్టులోనే పాక్ ప్రభుత్వం 917 మెట్రిక్ టన్నుల చక్కెరను దిగుమతి చేసుకుంది. గోధుమలు, పామాయిల్, పామాయిస్, పప్పు ధాన్యాల దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి. ఇక చమురు ఉత్పత్తుల దిగుమతులు 128 పెరిగితే వాహనాల దిగుమతులు 200 శాతం పెరిగింది.

ఆర్ధిక లోటుకు కారణాలేంటి?

దిగుమతుల పెరుగుదులతో వాణిజ్య లోటు పెరిగిపోయింది. దీంతో పాక్ లో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశముంది. డాలరు మారకం విలువతో ప్రస్తుతం దేశీయ కరెన్సీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దిగుమతులు అధికం కావడం, డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

ఆహారం, చమురు, వాహన ఉత్పత్తులను అధికంగా వాడుతుండడంతో వీటి దిగుమతులు అనివార్యమవుతున్నాయి. డిమాండ్ మేరకు అక్కడ వనరులు లేకపోవడంతో దిగుమతులు అధికమయ్యాయి. మరోవైపు దిగుమతులకు తగ్గట్టు.. ఎగుమతులు లేకపోవడంతో వాణిజ్య లోటు ఏర్పడుతోంది. పాక్ సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిందని ముందే గ్రహించిన సౌదీ ప్రభుత్వం తాము ఇచ్చిన అప్పును తిరిగి కట్టాలని ఆదేశించింది.

పాకిస్తాన్ లో వాణిజ్య లోటు అధికంగా ఉన్నా.. బయట దేశాల నుంచి ఆర్ధిక సహాయం అందుతుండడంతో లబ్ది కలుగుతోంది. ప్రస్తుతం అక్కడ నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల ఆదాయం పెరగనప్పటికీ.. వ్యయం మాత్రం బాగా పెరిగింది. దీంతో అక్కడి ప్రజలు ఆర్ధిక లోటుతో అల్లాడుతున్నారు. ప్రజల ఆదాయం పడిపోవడంతో అక్కడ పేదరికం భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ కొంత మంది మిడతలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ప్రస్తుతం వాణిజ్య లోటును తగ్గించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో త్వరలోనే ఆ దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల అక్కడి ప్రజలు ఆకలి కేకలు వేసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. పేదరికం పెరగడంతో పాటు పాకిస్తాన్ నుంచి వలసలు ప్రారంభయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంది.

Follow our Instagaram Chudubabai

Most Viewed Story on Our Chudubabai Tholiprema

 799 Total Views,  1 Total Views Today

Comment Your Views