ఫేస్ బుక్ పనైపోయిందా..?

ఫేస్ బుక్.. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు.. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి సాధారణ గృహిణి వరకు అందరికీ ఇందులో అకౌంట్ ఉంది. అందర్నీ అలా అడిక్ట్ అయ్యేలా చేసింది.

ఈ యాప్ వచ్చిన కొత్తలో ఒక ఊపు ఊపేసింది. స్మార్ట్ ఫోన్ యూసేజ్ కూడా అప్పటి నుంచే ఎక్కువైంది అనడంలో కూడా అతిశయోక్తి కాదు. అంతలా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. తెలిసీ తెలియని వాళ్లకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేయడం.. అప్పట్లో అందరికీ అలా ఉండేది డెడికేషన్.. అయితే రాను రాను దీని ప్రభావం తగ్గిపోయింది. గతంలో లేచివెంటనే ఫేస్‌బుక్ చూస్తే కానీ కొంత మందికి తెల్లవారేది కాదు.. ఇక నిద్రపోయే ముందు కూడా ఒకసారి చూసే నిద్రపోయేవారు..

ఆలాంటి ఫేస్ బుక్ ఇప్పుడు కష్టాలపాలయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 లక్షల కోట్ల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. దీని మార్కెట్ వాల్యూ ఒకేసారి 18 లక్షలకోట్లకు పైగా పడిపోవడంతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న మార్క్ జుకర్ బర్గ్ సంపద కూడా ఆవిరైపోయింది. దీంతో రాత్రికి రాత్రి.. అంబానీ, ఆదానీ మార్క్ జుకర్ బర్గ్‌ను దాటి శ్రీమంతులుగా మారిపోయారు.

ఫేస్ బుక్

ఫేస్ బుక్ పతనానికి కారణమేంటి?

గతకొన్ని రోజులుగా ఫేస్ బుక్ ఇతర యాప్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. దీనిని ఆ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా అంగీకరిస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చిన టిక్ టాక్ తీవ్ర పోటీనిస్తోంది. అదే విధంగా ఈ యాప్‌కు గట్టిపోటీ ఇస్తోన్న మరో యాప్ యూట్యూబ్.. తక్కువ డ్యూరేషన్‌తో ఉన్న వీడియోలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ బాగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందరూ ఈ యాప్‌ను వీడి టిక్ టాక్, యూట్యూబ్ లాంటి యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు.

మరో వైపు మెటా వర్చువల్ రియాలిటీ పేరుతో కొత్త టెక్నాలిజీ అభివృద్ధి చేస్తోంది. దీనికోసం ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇక రోజూవారీ యూజర్ల సంఖ్య సైతం 930 బిలియన్ నుంచి 1.95 బిలియన్‌కు పడిపోవడం ఈ సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. యూజర్లు సైతం.. తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్‌లో ఫేస్ బుక్ షేర్ల విలువ ఒక్కరోజే 26 శాతం పడిపోయాయి. ఇంతపెద్ద మొత్తంలో షేర్ వాల్యు కోల్పోయిన సంస్థగా ఫేస్ బుక్ రికార్డులకెక్కింది. 215 బిలియన్ డాలర్లు ఈ సంస్థ కోల్పోయింది. ఇండియన్ కరెన్సీలో 18 లక్షల 500 కోట్లకు పైమాటే..

ఇతర యాప్‌ల నుంచి గట్టిపోటీ వస్తుండడంతో ఇప్పుడు ఈ సంస్ధ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది. తమకు గట్టిపోటీ వస్తోన్న టిక్ టాక్, యూట్యూబ్‌కు ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది.

Read our another article on Fish Attack on Fisherman

Like Our Facebook Page ChuduBabai

 597 Total Views,  2 Total Views Today

Comment Your Views