మోడీ డబ్బులు ఇచ్చారనుకుని ఇల్లు కట్టాడు.. నిజం తెలిసి షాకయ్యాడు

మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.లక్షల్లో డబ్బులు పడితే మీరు ఏం చేస్తారు..? కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే.. ఎందుకు అంత మొత్తంలో డబ్బులు పడ్డాయని బ్యాంకుకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి జాగ్రత పడతారు. అయితే ఎలాంటి అక్షర జ్ఞానం లేని ఓ రైతు బ్యాంక్ ఖాతాల్లో పడితే ఆయన ఏం చేస్తాడు. డబ్బులు జమ అయ్యాయని ఎగిరి గంతేశాడు. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.

అవును.. మీరు చదివింది నిజమే.. ఆయన ఓ రైతు. రోజువారీ కూలీతో జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక రోజు అకౌంట్‌ నుంచి డబ్బు తెచ్చుకుందామని వెళ్లాడు. అయితే తన అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ వేశారు అనుకుని రూ.9 లక్షలు ఖర్చు చేసి ఇంటిని నిర్మించాడు. మిగతా రూ.6 లక్షలు అకౌంట్‌లో ఉన్నాయి. అప్పుడే ఆ డబ్బు ఆయనది కాదని.. వెంటనే వాటిని తిరిగి కట్టాలని పిడుగులాంటి వార్త అందింది. దీంతో రైతు లబోదిబోమంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్దన్ ఔటే రైతు.. గతేడాది ఆగస్టు 17న జన్‌ధన్ ఖాతా చెక్ చేసుకుంటే రూ.15 లక్షలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పౌరుడికి ప్రధాని మోదీనే రూ. 15 లక్షలు జమ చేశారని ధ్యానేశ్వర్ సంబరపడిపోయాడు. ఎందుకైనా మంచిదని గ్రామంలోని పలువురి రైతులను అడిగాడు. మిగతా రైతులెవరూ రాలేదని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఊళ్లోని మిగతా రైతులు కూడా ధ్యానేశ్వర్‌ను అభినందించారు. తెలిసిన వాళ్ల సహయంతో రైతు ధ్యానేశ్వర్.. డబ్బులు పంపినందుకుగానూ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ-మెయిల్ కూడా పంపారు.

డబ్బులు

తన అకౌంట్‌లో డబ్బులు పడి కొన్ని నెలలు అయినప్పటికీ… బ్యాంకు అధికారులు సంప్రదించలేదు. దీంతో ఒక ఇల్లు కట్టాలని భావించాడు. రూ.9 లక్షలు డ్రా చేసి ఇంటి కోసం ఖర్చు పెట్టాడు. మిగిలిన వాటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఆయనకు పిడుగులాంటి వార్త అందింది. దాదాపు ఐదు నెలల తర్వాత నోటీసులు రావడంతో ధ్యానేశ్వర్ ఉలిక్కిపడ్డాడు.

పిపల్వాడి గ్రామపంచాయితీ కార్యాలయం నుంచి రైతు ధ్యానేశ్వర్ కు నోటీసులు వచ్చాయి. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులు తెలిపారు. ఆ లేఖ చదివిన ధ్యానేశ్వర్‌.. ఇల్లు కట్టడానికి ఖర్చయిన రూ.9 లక్షలు పోగా… ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలను వెంటనే చెల్లించాడు. అయితే మిగతా డబ్బంతా తిరిగి ఇవ్వాల్సిందేనని రైతుపై అధికారులు ఒత్తిడి పెంచారు. ఇంత మొత్తం నగదు ఎక్కడి నుంచి తీసుకుని రావాలని రైతు ధ్యానేశ్వర్ తల్లడిల్లుతున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వమే తనపై దయ చూపాలని వేడుకుంటున్నాడు.

అయితే గతంలో కూడా ఇలాగే పలువురి రైతుల ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

Read Our Special Article on Megastar Chiranjeevi Click here

Like our Insta Page Chudubabai

 1,129 Total Views,  5 Total Views Today

Comment Your Views