కరోనా వైరస్.. దీనికి మందు లేదు. అగ్రరాజ్యం అమెరికా అయినా చిన్న దేశాలైన పాకిస్తాన్ అయినా దీని బారిన పడితే అంతే సంగతులు. కేవలం జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి తప్పించుకుంటాం తప్ప అంతకు మించి మనం చేసేదేం లేదు. ప్రభుత్వాలు సైతం ప్రజలే దీనిని ఎదుర్కోవాలని.. సామాజిక దూరం పాటించి.. ఇంటి నుంచి బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప దీనికి ఎలాంటి చికిత్స లేదని స్పష్టం చేస్తున్నారు.
చైనాలో మొదలైన ఈ వైరస్.. నెమ్మది నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరించింది. అన్ని దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తుండడంతో భారత్ దేశం నుంచి ఇతర దేశాలకు చదువు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన వాళ్లందరూ కరోనా వైరస్ భయంతో భారత్ కు చేరుకున్నారు. అప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం వారందరినీ క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించింది. దీంతో అప్పుడప్పుడే కరోనా వైరస్ భారత్ లో పడగ విప్పుతోంది. ఇక క్వారంటైన్ అయిన వారందరూ కూడా స్వచ్ఛందంగా తమకు లక్షణాలుండడంతో ప్రభుత్వాధికారులకు సమాచారం అందించడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించడంతో కరోనాను కొంత మేర అరికట్టారు.
అతి పెద్ద దేశమైన భారత్ లో కరోనా నెమ్మది నెమ్మదిగా పడగ విప్పింది. ఢిల్లీలో జరిగిన ఒక ప్రార్ధనా సమావేశాలకు వెళ్లిన వారికి కరోనా సోకడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆ సమావేశాలకు వెళ్లిన వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించారు. వారిలో చాలా మందికి కరోనా సోకడం కలవరపాటుకు గురి చేసింది. ఇక వెళ్లిన వారిలో లక్షణాలు లేనప్పటికీ వారికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఢిల్లీలో మతపరమైన సమావేశాలకు హాజరైన వారికి కరోనా సోకడంతో ఇప్పుడు భారత్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు భారత్ లో కేసులు పెరుగుతున్నాయి. ఆ సమావేశాలకు హాజరైన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారిపై అధికారులు నిఘా పెట్టారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు..
భారత్ లో కరోనా పడగ విప్పుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పాజిటివ్ రావడంతోనే ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి జనతా కర్ఫ్యూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక కరోనా కోరలు చాస్తున్న సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ మీ జీవితంలో రెండు మూడు వారాలు కేటాయించండని ముందుగానే చెప్పేశారు. ఆయన చెప్పినట్టుగానే మూడు వారాల లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పుడు భారత్ దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతోనే లోకల్ ట్రాన్స్మిషన్ తగ్గింది. ఒకవేళ ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించకుండా ఉండి ఉంటే ఇప్పుడు భారత్ కూడా మరో ఇటలీలా మారేది.
మరి ఇప్పుడు ఈ లాక్ డౌన్ కొనసాగుతుందా?
ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో మూడు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరూ క్వారంటైన్ లో ఉండడం.. కరోనా సోకిన వారందరికీ ఐసోలేషన్ లో చికిత్స అందించడంతో లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అందరూ భావించారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ మతపరమైన సమావేశాల్లో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్ రావడంతో భారత్ లో కేసులు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. దీంతో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి రాష్ట్రాలు.
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి సోకడంతో 21 రోజుల లాక్ డౌన్ ను అమలు చేయాలని కేంద్ర భావించింది. ఇప్పుడు ఢిల్లీ సమావేశాల్లో పాల్గొన్నవారికి సోకడంతో వారిలో చాలా మంది బయటకు రాకపోవడం.. ఇప్పుడు వారిలో చాలా మందికి పాజిటివ్ రావడం.. వారి కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
ఇక దేశంలో అనేక మంది లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నారు. భారత్ తో పాటు అనేక దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. లోకల్ ట్రాన్స్ మిషన్ ను అరికట్టాలంటే కేవలం లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గం కావడంతో ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కేవలం అత్యవసర సేవలు మినహా రవాణా మొత్తం స్తంభించింది.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అదే విధంగా రోడ్డు పక్కన నివాసం ఉండేవారికి, యాచకులను అదుకునేందుకు లక్షలాది మంది ముందుకు వస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లోనే మనిషికి మనిషే తోడు అన్న మాట నిజం చేస్తున్నారు అనేక మంది దాతలు. తమకు తోచినంతలో సాయం అందిస్తున్నారు.
కరోనాకు అడ్డుకట్ట లేదా..?
ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనికోసమే ఎదురు చూస్తోంది. అన్ని దేశాలు కరోననాను ఎదుర్కొవడానికి మందును కనుక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు క్లీనికల్ ట్రయిల్స్ కూడా ప్రారంభించాయి. అయినా కరోనా మందు బయటకు రావడానికి మినిమమ్ నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది గరిష్టంగా 18 నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ లో విదేశాల నుంచి వచ్చినవారికీ, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే సోకుతున్న కరోనా వైరస్… వారి నుంచి ఇతరులకు సోకకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ ను దేశ ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తుండడంతో లోకల్ ట్రాన్స్ మిషన్ లేదనే చెప్పవచ్చు. ఇదే పరిస్థితి దేశంలో కొన్ని రోజులు కొనసాగితే కరోనాను అతి త్వరగా తరిమికొట్టిన దేశం భారత్ అవుతుంది. దీనికి ప్రభుత్వాలు చేసేదానికనన్నా ప్రజల నుంచి మాత్రమే స్పందన రావాలి. స్వచ్ఛందంగా వారందరూ సహకరిస్తే కరోనాను ఎదుర్కోవచ్చు.
1,046 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022