Aakanksha Episode 1

బస్సులో నుంచి దిగి.. అలా బీచ్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆకాష్. చేతిలో ఒక బ్యాగ్, భుజానికి ఒక బ్యాక్ ప్యాక్ తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొద్ది సేపు బీచ్ లో తిరిగిన  తర్వాత బయటకి రాగానే ఒక ఆటో వచ్చి ఆకాష్ ముందు ఆగింది. ఎక్కడికి వెళ్లాలి సార్ అని ఆటోవాలా అడిగాడు. భయ్యా నేను ఈ ఊరికి కొత్త కొంచెం ఇక్కడ ఇల్లు అద్దెకు దొరికే వరకు నన్ను నువ్వే తిప్పాలి.. మీటర్ ఎంతైనా నేను పే చేస్తా అన్నాడు ఆకాష్. ఓకే సార్ నో ప్రాబ్లం ఈ దగ్గరలోనే కొన్ని TOLET బోర్డులు ఉంటాయి.. అక్కడ ట్రై చేయండి సార్ అని ఒక ఏరియాకు తీసుకెళ్లాడు.

Aakanksha Episode 1
Aakanksha Episode 1

ఆకాష్ ఆటో దిగి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. గేట్ లోపల ఒక కార్,, స్కూటీ పక్క నుంచి వెళ్తూ.. డోర్ ని కొడదామని చెయ్యి లేపి పక్కనే  ఉన్న కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. మళ్లీ ప్రెస్ చేసే లోపే వినీత ఫార్మల్ డ్రెస్ లో డోర్ ఓపెన్ చేసి ఎవరూ కావాలి అని అడిగింది. బయట TOLET బోర్డు చూశా.. ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని వచ్చా అని అన్నాడు ఆకాష్. ఆగండి మా ఫాదర్ ని పిలుస్తా అని నాన్న ఇల్లు అద్దెకు కావాలని ఎవరో వచ్చారు చూడండి అని వినీత లోపలికి వెళ్లిపోయింది.

          ఆకాష్ బయట వెయిట్ చేస్తుండగా ఒక పెద్దాయన వచ్చి పైది PENT HOUSE.. బాబు ఇంతకీ నీది ఏ ఊరు బాబు అంటే.. సార్ నాది చెన్నై ఇక్కడి కంపెనీలో ప్రమోషన్ కారణంగా ట్రాన్స్ ఫర్ అయ్యింది.. రేపే జాయినింగ్ ఇల్లు దొరుకుతుందేమోనని చూస్తుండగా TOLET బోర్డు చూసి వచ్చా అని చెప్పాడు. సరే బాబు తర్వాత నీ ఐడీ కార్డు అవి ఇవ్వాల్సి ఉంటుంది అని పైకి వెళ్లి రూమ్ చూసుకో మ్యాక్స్ అన్ని FACILITIES ఉన్నాయి అని పైకి తీసుకెళ్లాడు ఇంటి ఓనర్. ఆకాష్ రూమ్ మొత్తం చూసుకుని నాకు రూమ్ ఓకే అంకుల్.. రెంట్ అది చెప్తే అని  అడిగాడు ఆకాష్. సరేనని ఆకాష్ అడ్వాన్స్ ఇచ్చి కిందకి వెళ్లి ఆటో వాడికి ధ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చి పైకి వెళ్లిపోయాడు. మార్నింగ్ నుంచి బీచ్ లో తిరగడంతో ఆకలిగా ఉండి ఆకాష్ తినడానికి బయటకి వెళ్లాడు.

సాయంత్రం రూమ్ కి వచ్చి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి ఆటోలో వెళ్లాడు. ఆఫీస్ లో అందరినీ పరిచయం చేసుకుని తన సిస్టమ్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ లోపు వాళ్ల టీమ్ మేట్స్ లంచ్ కి పిలిస్తే వాళ్లతో వెళ్లి తినేసి వచ్చి ఫోన్ చూసుకుంటూ సిస్టమ్ లో వర్క్ చేసుకుంటూ కూర్చొన్నాడు. మళ్లీ సాయంత్రం ఆఫీస్ అవ్వగానే రూమ్ కి వెళ్లేందుకు ఆటోలో బయల్దేరాడు. దారి మధ్యలో బీచ్ కనపడడంతో ఆటోని అక్కడ ఆపమని దిగి నడుచుకుంటూ బీచ్ లోకి వెళ్లి అలా ఒంటరిగా కూర్చొన్నాడు. రాత్రి 8 అవుతుండడంతో రూమ్ కి నడుచుకుంటూ వెళ్లాడు. గేట్ తీస్తుండగా ఓనర్ పిలిచి అదేంటి బాబు ఆఫీస్ నుంచి ఇప్పుడు వస్తున్నావా అంటే లేదు అంకుల్ అలా బీచ్ కి వెళ్లా అని చెప్పాడు ఆకాష్.. బాబు రూమ్ కి  ఫ్రెండ్స్ ని తీసుకురాకూడదు అలానే మందు లాంటివి రూంలో తాగకూడదు నిన్న చెప్పడం మర్చిపోయాను అని అన్నాడు ఓనర్, నో ప్రాబ్లమ్ అంకుల్ నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు అలాగే నాకు మందు తాగే అలవాటు కూడా లేదు.. అంకుల్ నేను వెళ్తాను అని ఆకాష్ పైకి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత.. ఆకాష్, వినీత ఇద్దరు ఇంట్లోంచి ఒకేసారి బయటకు వచ్చారు. వినీత తన కార్ తీసుకుని ఆఫీస్ కి బయల్దేరుతోంది. ఆకాష్ ఇంటి బయట ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆటో రాగానే ఎక్కి ఆకాష్ వెళ్లిపోయాడు. వినీత కూడా సేమ్ అదే రూట్ లో వెళ్తోంది. ఆకాష్ వినీత పని చేసే కంపెనీ దగ్గర దిగడం చూసి.. ఓహ్ తను మా కంపెనీ ఏమో అనుకుని తను వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఆకాష్ కి కేఫ్ దగ్గర  వినీత కనిపించింది. దీంతో తనని చూసి చిన్న నవ్వు నవ్వి.. సైలెంట్ గా తన ఫుడ్ తింటూ కూర్చొన్నాడు ఆకాష్. వినీత ఆకాష్ దగ్గరకి వచ్చి మీరు కూడా ఇదే కంపెనీ ఆ అని అడిగింది..  అవును.. రీసెంట్ గా ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయింది.. అని చెప్పాడు ఆకాష్. ఓహ్ అవునా బైది వే నా పేరు వినీత అని పరిచయం చేసుకుంది. THIS IS ASHOK బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పగానే అవునా నేను ఇప్పుడు అదే ప్రాజెక్ట్ కు చేంజ్ అవుతున్నా.. మే బీ వన్ వీక్ పట్టొచ్చు ఏమో అని చెప్పి ఓకే ఐ విల్ లీవ్ నౌ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఆకాష్ ఆటో కోసం వెయిట్ చేస్తుండడంతో వినీత కార్ ఆపి రండి నా కార్ లో వెళ్దాం అంటే లేదు అండి చిన్న పని  ఉంది అది చూసుకుని వస్తా అని చెప్పడంతో వినీత వెళ్లిపోయింది. ఎప్పటిలాగే ఆకాష్ బీచ్ దగ్గర దిగిపోయి బీచ్ లో కూర్చుని రూమ్ కు నడుచుకుంటూ వెళ్లాడు. ఆకాష్ వెనక్కి తిరిగి గేట్ వేస్తుండగా మీ పనులు అయిపోయాయా అని వినీత అడగడంతో అవునండి అని చెప్పి పైకి వెళ్తుండగా వినీత ఆకాష్ అని పిలిచి రేపు ఆటోలో వెళ్లిపోకండి నా కార్ లో వెళ్దాం అని చెప్పడంతో ఆకాష్ ఏం అనాలో తెలియక సరేనండి అని పైకి వెళ్లిపోయాడు. అప్పటికే ఆకాష్ తన  కంపెనీలోనే  పని చేస్తున్నాడని వినీత వాళ్ల నాన్నకి చెప్పడంతో ఇంటి ఓనర్ అయితే అతను ప్రతీ రోజు ఆటోల కోసం వెయిట్ చేయడం ఎందుకు నీ కార్ లో వెళ్లిపోవచ్చు కదా అని చెప్పడంతో వినీత ఆకాష్ ని కార్ లో వెళ్దాం అని అడగింది.

నెక్స్ట్ డే మార్నింగ్ ఆకాష్ కిందకి దిగుతుండడంతో వినీత ఇంట్లోంచి వస్తూ వెళ్దామా అని  అడిగింది. సరే అని ఆకాష్ కార్ ఎక్కాడు. ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళారు.. అదే రోజు వినీత కూడా ఆకాష్ ప్రాజెక్ట్  లోకి జాయిన్ అయింది. ఆ రోజు సాయంత్రం వెళ్దామా ఆకాష్ అని వినీత అడిగింది. లేదండి నాకు పని ఉంది మీరు వెళ్లిపోండి అని చెప్పడంతో వినీత సరేనని తన కార్ తీసుకుని వినీత వెళ్లిపోయింది. ఎప్పటిలాగే ఆకాష్ సాయంత్రం ఆటోలో బీచ్ దాకా వెళ్లి చీకటి పడ్డాకా కాసేపు ఉండి.. రూమ్ కి బయల్దేరాడు.

ఒక వీకెండ్ వినీత కొత్తగా టీంలో చేరడంతో కొలీగ్స్ అందరికీ జాయినింగ్ పార్టీ ఇద్దామని ప్లాన్ చేసింది. ఎక్కడ పార్టీ అని అందరూ డిస్కస్ చేసుకుంటుండగా వినీత బీచ్ వ్యూ రెస్టారెంట్ లో ఈ రోజు సాయంత్రం పార్టీకి వెళ్దాం అని ప్లేస్ కన్ఫార్మ్ చేసింది. రోజూ సాయంత్రం బీచ్ కి వెళ్లే… ఆకాష్ ఈ రోజు పార్టీ అనడంతో రెస్టారెంట్ కి వెళ్లాడు.  కానీ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. సరే బై నాకు కొంచెం అన్ ఈజీగా ఉంది నేను వెళ్తా అని బయల్దేరాడు ఆకాష్. అప్పటికే అందరూ ఫినిష్ చేసి వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యారు. వినీత కూడా బిల్ పే చేసి ఆకాష్ వెనకే వెళ్తోంది. కానీ ఆకాష్ ఆటో ఎక్కి వెళ్లిపోవడంతో ఏంటీ ప్రతీ రోజు సాయంత్రం కాగానే పని అని చెప్పి వెళ్లిపోతున్నాడు అని డౌట్ వచ్చి ఆకాష్ ని ఫాలో అయింది వినీత. ఆకాష్ బీచ్ దగ్గరకి రాగానే దిగి బీచ్ లోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. వినీత కూడా ఆకాష్ వెనకే బీచ్ లో ఆకాష్ ని వెతుక్కుంటూ చీకట్లోకి వెళ్లింది.

Let us know in comments how is Aakanksha Episode 1

Read About Palakollu Famous Dibba Rotti

Like Our Facebook Page ChuduBabai

 2,813 Total Views,  2 Total Views Today

Comment Your Views