Aakanksha Episode 2

Aakanksha Episode 2
Aakanksha Episode 2

ఎపిసోడ్ 2

అశోక్ ను వెతుక్కుంటూ బీచ్ లోకి వెళ్లిన  వినీతకి ఏవో మాటలు వినిపించి అశోక్ రావడం గమనించి వెనక్కి వచ్చేసింది. అశోక్ వినీతని  చూడకుండా వెళ్లిపోయాడు. తర్వాతి రోజు ఉదయం అశోక్, వినీత కలిసి ఆఫీస్ కి బయల్దేరి వెళ్లారు. ఒకే టీం కావడంతో ఆఫీస్ లో లంచ్ కూడా కలిసే చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఆకాష్ ఆఫీస్ లో వర్క్ చేస్తుండగా.. వినీత వచ్చి ఆకాష్ వెళ్దామా అని  అడిగింది. ఎప్పటిలా  బీచ్ కి వెళ్లే అలవాటు ఉన్న ఆకాష్ వినీతతో కాస్త వర్క్ ఉంది నువ్వు వెళ్లిపో నేను వస్తా అని చెప్పి వర్క్ చేసుకుంటాడు. దీంతో వినీత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆకాష్ ఆటోలో వెళ్తుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ వినీత స్కూటీ కనిపించి ఆటో దిగి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి వినీతని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. డాక్టర్ పిలిచి బ్లడ్ ఎక్కువగా పోయింది అని చెప్పడంతో వినీతకు ఆకాష్ బ్లడ్ డోనేట్ చేశాడు.

పని ఉందని చెప్పిన ఆకాష్ తనను హాస్పిటల్ కు తీసుకెళ్లడం.. బ్లడ్ ఇవ్వడంతో వినీత ఆకాష్ పై ఇష్టం పెంచుకుంది. కానీ ఆకాష్ కు ఆ విషయం చెప్పలేదు. ఆ తర్వాతి రోజు వినీత బర్త్ డే కావడంతో ఆకాష్ ను ఇంట్లో లంచ్ కు ఇన్వైట్ చేయడానికి వినీత పైకి వెళ్లింది. అప్పటికే లేచి బుక్ చదువుకుంటున్న ఆకాష్ వినీతని చూసి లోపలికి పిలిచాడు. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావ్ అని ఆకాష్ అడుగుతుండగానే ఈ రోజు నా బర్త్ డే లంచ్ కి ఇన్వైట్ చేద్దాం అని వచ్చా.. అది విన్న ఆకాష్ కనీసం విష్ కూడా చేయకుండా ఫ్రెష్ అయి వస్తా అని చెప్పడంతో వినీత హర్ట్ అయ్యి కిందకి వెళ్లిపోతుంది.

కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లిన ఆకాష్ ను చూసి వినీత వాళ్ల అమ్మగారు రా బాబు లోపలికి అని తీసుకువెళ్ళింది. హాల్ లో కూర్చొన్న ఆకాష్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద గణపతి సచ్చిదానంద స్వామి బుక్ కనిపిస్తే చదువుతూ కూర్చొన్నాడు. ఈ లోపు ఇంటి ఓనర్ వచ్చి ఆకాష్ తో ఆఫీస్ ఎలా ఉంది… ఇంట్లో ఎడ్జెస్ట్ అవుతున్నావా.. ఎమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంటి ఓనర్ మాటలు వింటున్న ఆకాష్ గోడపై ఉన్న ఫోటోను తదేకంగా చూస్తున్నాడు.

ఇంతలో వినీత వాళ్ల అమ్మ లంచ్ కి పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆకాష్. అది చూసిన ఇంటి ఓనర్.. అది మా ఫ్యామిలీ ఫోటో బాబు.. అందులో ఆ చివరిన ఉన్న అబ్బాయి మా మేనల్లుడు… మా వినీతకి వాడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం అని ఓనర్ చెప్పడంతో ఆకాష్ ఒక్కసారిగా వినీత వైపు చూశాడు. ఆకాష్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చూసి వినీత షాక్ అవుతుంది. ఏంటి ఆకాష్ నావైపు అలా చూశాడు అని.. లంచ్ పూర్తయ్యాకా… ఆకాష్ వినీతని విష్ చేసి రూంకి వెళ్లిపోయాడు. సాయంత్రం గేట్ తీసిన చప్పుడు అవడంతో బయటకి వచ్చిన వినీత ఆకాష్ ని పిలిచి ఎక్కడికి సార్ అని అడిగింది. ఏం లేదు అలా కాసేపు బీచ్ కి వెళ్దామని బయల్దేరుతున్నా అని నడుచుకుంటూ బీచ్ కి వెళ్లి ఎవరూ లేని చోట ఒంటరిగా కూర్చుని ఫోన్ గ్యాలరీ చూస్తూ గతంలోకి వెళ్తాడు..

Follow our Facebook Page ChuduBabai

Aakanksha Episode 1- Read Here

 1,762 Total Views,  2 Total Views Today

Comment Your Views