Aakanksha Episode 4

Aakanksha Episode 4

Aakanksha Episdoe 4

ఆకాంక్షను చంపిన విశాల్ ఆచూకీ దొరకడంతో ఆకాష్ కొంచెం సంతోషపడతాడు. తనను చేసుకోబోయే అమ్మాయిని విశాల్ చంపేయడంతో.. ఆకాష్ కూడా విశాల్ చేసుకోబోయే అమ్మాయిని చంపేయాలి అనే కక్షతో ఉన్న ఆకాష్, కానీ ఆ అమ్మాయి వినీత అవ్వడంతో బాధపడ్డాడు. ఆకాష్ ఏం చేయాలా అని ఆలోచించే టైంలో వినీత అక్కడికి వచ్చి వెనుక నుంచి ఆకాష్ భుజంపైన చేయి వేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అదేంటి ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావ్ అని అడిగితే ఏం లేదు మామూలుగానే  వచ్చా అని చెప్పాడు అకాష్. ఏమో లంచ్ చేస్తున్న టైంలో నువ్వు ఎందుకో డల్ గా ఉండడం గమనించా ఏమైంది అసలు అని అడిగింది వినీత. అబ్బే అలాంటిదేమీ లేదు.. రాత్రి బుక్ చదువుతూ లేట్ గా పడుకొన్నా అందుకే కొంచెం అలసటగా అనిపించింది అంతే అని ఆకాష్ చెప్పడంతో రాత్రి నిద్రపోని వాడివి ఈ నైట్ ఇక్కడేం చేస్తున్నావ్ అని  అడిగింది వినీత.

సరే నా సంగతి వదిలేయ్… ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడూ. మీ బావ ఎక్కడ ఉంటాడు అని అడిగాడు ఆకాష్.. ఏం పెళ్లి ఏంటో.. అసలు నాకు ఈ పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. మా బావకి నేను అంటే ఇష్టం ఎప్పుడు నా వెంటే పడేవాడు. ఒకరోజు వాళ్లింట్లో వాళ్లు మా నాన్నని అడిగారు ఇలా వినీతని విశాల్ కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం అని దానికి మా నాన్న ఓకే చెప్పేశారు. వాడు ఆస్ట్రేలియా నుంచి రాగానే పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు. కానీ నీకో విషయం చెప్పాలి.. అని ఆగిపోయింది వినీత. ఏంటో చెప్పు వినీత ఎందుకు ఆగిపోయావ్ అని అడిగాడు ఆకాష్.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఆకాష్.. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డా.. ఐ లవ్ యూ అని సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడాలో అర్ధం కానీ ఆకాష్ వినీత వైపు చూసి అక్కడి నుంచి లేచి.. రూంకి వెళ్లిపోయాడు..

ఆ తర్వాత రోజు నుంచి ఆకాష్ వినీతతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఆఫీస్ కి కూడా మొదట్లోలా ఆటోలో వెళ్లిపోయేవాడు. ఆఫీస్ లో వినీతని చూసి చిన్నగా నవ్వేవాడు తప్ప మాట్లాడేవాడు కాదు. అనవసరంగా ఆకాష్ కి తనంటే ఇష్టం అని చెప్పి చేసి తప్పు చేశానా అంటూ వినీత బాధపడింది.

కొన్ని రోజుల తర్వాత..

ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆకాష్ బీచ్ లో ఒంటరిగా కూర్చుని పడి లేస్తున్న కెరటాలపై ఆ చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తూ కూర్చొన్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన వినీత ఆకాష్ ని చూసి దగ్గరకి వెళ్లి ఏమైంది ఆకాష్ .. సారీ నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు ఐ యామ్ సారి అని చెప్పి.. నువ్ ఇంట్రోవర్ట్ అని తెలుసు.. కానీ పరిచయం ఉండి ఇన్నాళ్లు నాతో బాగానే మాట్లాడిన నువ్వే ఇప్పుడు మళ్లీ ఇలా ఉండడం బాగాలేదు. చెప్పడం మర్చిపోయా… మా బావ ఇండియా వచ్చేశాడు. త్వరలోనే ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారు. అని ఆకాష్ కు చెప్పింది వినీత. ఇంత మంచి అమ్మాయి ఒక హంతకుడిని పెళ్లి చేసుకుంటోందా అని.. ఆకాష్ తనలో  తాను ఆలోచించుకుంటుండగా  వినీత పిలిచి ఏమైంది ఆకాష్ అలా డల్ గా ఉన్నావ్ అసలు ఏమైంది.. ఎప్పుడూ చూసినా బీచ్ లోనే కూర్చుని ఉంటావ్ ఇప్పుడు చెప్తావా లేదా అని గట్టిగా అడిగింది.

నేను వైజాగ్ వచ్చిన రోజు ఇల్లు వెతుక్కుంటున్న టైంలో కాసేపు వచ్చి బీచ్ లో కూర్చొన్నా.. అదే టైంలో ఒక సాధువు వచ్చి ఈ రోజు రాత్రి నువ్వు ఇదే ప్లేస్ కి రా నువ్వు ఈ ఊరు వచ్చిన  రహస్యం తెలుసుకుంటావు అని వెళ్లిపోయాడు. ఏం చెప్తాడా అని ఆ సాయంత్రం అక్కడికి వెళ్లా ఆ మనిషి కనిపించలేదు.. కానీ నువ్వు ఈ ఊరు రావడానికి ఒక కారణం ఉంది అది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పి మాయం అయిపోయాడు. ఎవడో పిచ్చోడు అయ్యి ఉంటాడు అని నేను లైట్ తీసుకున్నా… నేను పిచ్చోడినే కావొచ్చు.. నువ్వొక కార్యం తలపెట్టడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పాడు. అదేంటో తెలుసుకోవడానికి నీ అంతట నీవే ఇక్కడికి వస్తావు అనే చెప్పాడు. అందుకోసమే నేను ప్రతీ రోజు ఇక్కడికి వస్తున్నా.. అని విశాల్ చెప్పడంతో అంతేనా మరి ఆ సాధువు ఇంకేం చెప్పలేదా అంటే హా చెప్పాడు.. ఒక పౌర్ణమి రోజు ఒక కన్య వల్ల నువ్వు చేయబోయే కార్యం ఏంటో తెలుస్తుంది అని చెప్పి మాయమయ్యాడు అని ఆకాష్ చెప్పాడు. సర్లే లేట్ అవుతోంది పద ఇంటికి వెళ్దాం అని వినీత చెప్పడంతో ఇద్దరు ఇంటికి బయల్దేరారు.

నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి వస్తున్నావా అని అడగడానికి పైకి వెళ్లిన వినీత ఆకాష్ ని చూసి షాక్ అయ్యింది. ఇంకా పడుకునే ఉన్న ఆకాష్ ని చూసి ఏంటి ఆఫీస్ కి రావట్లేదా అని అడిగితే లేదు కొంచెం ఒంట్లో బాగా లేదు అందుకే సిక్ లీవ్ పెట్టా అని చెప్పాడు ఆకాష్.  సరే పద హాస్పిటల్ కి వెళ్దాం అని వినీత చెప్పడంతో పర్లేదు నేను వెళ్తా.. నువ్ ఆఫీస్ కి వెళ్లు అని ఆకాష్ అనగానే నేను లీవ్ పెడతాలేకానీ పద ముందు హాస్పిటల్ కి అని ఆకాష్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లింది వినీత.

హాస్పిటల్ కి వెళ్లగానే ఆకాష్ కు డాక్టర్ ఆకాంక్ష సింగ్ అనే నేమ్ బోర్డ్ కనిపించగానే మళ్లీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆకాంక్ష వాళ్ల చెల్లి ఎవరో తెలుసుకోవాలి ముందు అని ఆలోచిస్తూ ఉన్నాడు. డాక్టర్ అడిగిన దేనికి రెస్పాండ్ అవ్వకపోవడంతో.. డాక్టర్ వినీతని పిలచి… ఆయనకి ప్రాబ్లం ఏం లేదు.. కానీ ఆయన ఎందుకో డిప్రెషన్ లో ఉన్నాడు.. ఏం అడిగినా రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పడంతో వినీత ఆకాష్ ను తీసుకుని తన కార్ లో స్టార్ట్ అయ్యింది. ఇంటికి కాకుండా ఎక్కడికి వెళ్తున్నాం అని ఆకాష్ అడుగుతుండడంతో మాట్లాడకు నేను తీసుకెళ్లిన చోటకి రా.. అని ఒక క్లీనిక్ కి తీసుకువెళ్లి ఆకాష్ ను కార్ లో ఉండమని… తను లోపలికి వెళ్లింది.

లోపలికి వెళ్లిన వినీత నీరజను చూసి హాయ్ ఎలా ఉన్నావ్ అని అడగడంతో… నేను బాగానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నావ్.. ఏంటి సడెన్ గా ఇలా వచ్చావ్ ఏమైంది అని అడిగింది నీరజ.. ఏం లేదు.. మా ఇంటిపైన ఒకతను రెంట్ కి వచ్చాడు. కొన్ని రోజులకు తెలిసింది తను మా ఆఫీస్ అని డైలీ మార్నింగ్ నాతో ఆఫీస్ కి వచ్చేవాడు… కానీ సాయంత్రం నాతో రాకుండా.. రాత్రి వరకు బీచ్ లోనే కూర్చొనేవాడు. నా బర్త్ డే రోజున నాకు మా బావకు పెళ్లి అని తెలియగానే ఎందుకో నాతో మాట్లాడడం లేదు.. గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉంటున్నాడు… అందుకోసమే నీ దగ్గరకు తీసుకువచ్చా.. అని చెప్పింది వినీత. సరే నువ్వు బయటకు వెళ్లి అతనని లోపలికి పంపు నీరజ చెప్పడంతో వినీత బయటకు వెళ్లి..  ఆకాష్ ను లోపలికి వెళ్లమని చెబుతుంది. కానీ ఎందుకో రీజన్ చెప్పు  అని ఆకాష్ అడగడంతో తర్వాత చెప్తా ముందు నువ్వు లోపలికి వెళ్లు అని చెప్పడంతో ఇంకేమీ మాట్లాడకుండా ఆకాష్ లోపలికి వెళ్లాడు.

లోపలికి వెళ్లిన ఆకాష్ డాక్టర్ ను చూసి షాక్ అయ్యాడు. ఆ డాక్టర్  ఆకాంక్ష చెల్లి అని తెలుసుకుని హమ్మయ్య ఒక పని పూర్తైంది అని మనసులో అనుకుంటుండగా.. హాయ్ నా పేరు నీరజ మీ పేరు అని అడగడంతో ఆకాష్ అని చెప్పాడు. ఇప్పుడే వినీత మీ గురించి చెప్పింది. అని ఇంజక్షన్ చేసేందుకు లేచింది నీరజ.. వెయిట్ ఇంజెక్షన్ ఏం అవసరం లేదు అని ఆకాష్ చెప్పడంతో అదేంటి అంటే.. అది అంతే మీరు అడగండి ఏం కావాలో అని అన్నాడు ఆకాష్.. సాధువు ఎవరో కనిపిస్తున్నారు అని చెప్తున్నారు అంట ఏమైంది అని అడిగింది నీరజ..  యాక్చువల్ గా నేనొక అనాథ.. చిన్న్పప్పటి నుంచి నెల్లూరులోని వివేకానంద ఆనాధ ఆశ్రమంలో పెరిగా అక్కడే ఆకాంక్ష పరిచయం అయ్యింది అని చెప్తుండగా.. నర్స్ వచ్చి మేడమ్ మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ఆకాష్ నేను మీతో చాలా మాట్లాడాలి ఇది నా విజిటింగ్ కార్డ్ ఈవెనింగ్ కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సాయంత్రం వినీతకి కాల్ చేసి.. వినీత ఆకాష్ కి కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉంది.. తనకి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చా.. ఈ సారి తన ఒక్కడిని మాత్రమే రమ్మను అని చెప్పింది నీరజ. ఈసారి వాళ్లిద్దరు కలుసుకునేందుకు ఒక కేఫ్ లో మీటింగ్ ఎరేంజ్ చేసుకున్నారు. ఆకాంక్ష గురించి తెలుసుకోవాలనే ఆత్రుతతో నీరజ ముందే అక్కడికి వెళ్లి ఆకాష్ కోసం వెయిట్ చేస్తోంది.

 

Follow our Facebook Page ChuduBabai

Read our New story Series Aakanksha Episode 3

 

 1,447 Total Views,  1 Total Views Today

Comment Your Views