Aakanksha Episode 5

Aakanksha Episode 5

Aakanksha Episode 5
ఆకాష్ వస్తుండడంతోనే.. మా అక్క ఎక్కడ ఉంది ఆకాష్ అని అడిగిన నీరజను చూసి అసలు మీ అక్క ఉందా అని అడగాలి నీరజ అని చెప్పిన ఆకాష్ ను చూసి ఏం మాట్లాడుతున్నావ్ ఆకాష్ అసలు ఏమైంది చెప్పు అని షాక్ లో ఉంది నీరజ. నువ్వు ఆశ్రమం నుంచి వెళ్లిపోయాకా మీ అక్క చాలా ఒంటరిగా అయిపోయింది. అదే టైంలో నేను మీ అక్కని కలిశా.. ఎప్పుడూ నీ గురించే ఆలోచించేది. మా ఇద్దరికీ చెన్నైలో జాబ్ రావడంతో చెన్నైలో సెటిల్ అయ్యాం.. ఒక రోజు ఆఫీస్ నుంచి వస్తూ లేట్ అవడంతో నన్ను పికప్ చేసుకోమని కాల్ చేసింది. నేను వెళ్లేలోపు ఎవడో మీ అక్కని దారుణంగా చంపేశాడు. దానిని మళ్లీ సూసైడ్ గా చిత్రీకరించాడు అని చెప్పడంతో అంటే మా అక్క ఇప్పుడు లేదా అని అడిగింది నీరజ. హా మీ అక్కని చంపిన వాడిపై పగ తీర్చుకుందామనే ఇప్పుడు ఇక్కడికి వచ్చా అని అన్నాడు ఆకాష్. అంటే వాళ్లేవరో నీకు తెలుసా.. తెలిసి కూడా నువ్వు ఎందుకు ఊరుకున్నావ్ అని సీరియస్ అయ్యింది నీరజ. కూల్ కూల్ చెప్తా.. ఆ పని మీదే ఇక్కడికి వచ్చా.. కొద్ది రోజుల్లోనే.. మీ అక్కని చంపిన వాడు మనదగ్గరకి రాబోతున్నాడు. వాడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎలా చంపాడో వాడు చేసుకోబోయే అమ్మాయిని అలా చంపుదామనుకుంటున్నా అని ఆకాష్ చెప్పడంతో వద్దు ఆకాష్ నువ్వు ఎవరినీ చంపొద్దు.. చనిపోయేలాగ మనం చేద్దాం అని అంది నీరజ. నీకు మీ అక్క ముఖ్యమా.. లేక వాళ్లని కాపాడడమా అని అడిగాడు ఆకాష్. నాకు మా అక్క ఇంపార్టెంట్ ఇప్పుడేం చేద్దాం అంది నీరజ. ఆకాష్ చెప్పేలోగా నీరజకి కాల్ రావడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.

నీరజ ఆకాంక్ష చెల్లి అని తెలియడంతో ఆకాష్ కొంచెం ఫ్రీ అయ్యాడు. వినీతతో ఎప్పటిలాగే మాట్లాడుతున్నాడు. దీంతో వినీత నీరజకు కాల్ చేసి ఆకాష్ మామూలుగా అయిపోయాడు.. నీ ట్రీట్మెంట్ బాగా వర్క్ అయింది అని చెప్పగానే.. హా వినీత కానీ ఆకాష్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి అతనికి ఆల్రేడీ చెప్పా తనకి చెప్పిన చోటకి రమ్మను అని ఫోన్ పెట్టేసింది. నీరజ ఫోన్ చేసి కలుద్దామని చెప్పడంతో ఆకాష్ నీరజను కలవడానికి వెళ్లాడు.

అదేంటి ఆ రోజు మాట్లాడుతుండగా అలా వెళ్లిపోయావ్.. అని ఆడిగాడు ఆకాష్. అదేం లేదు.. నాకొక క్లయింట్ ఉన్నారు వాళ్లబ్బాయి పారానార్మల్ కథలు ఎక్కువ చదువుతాడు.. అలాంటి సినిమాలు ఎక్కువ చూస్తాడు… అప్పటి నుంచి దెయ్యాలు కనిపిస్తున్నాయి.. వాటితో మాట్లాడుతున్నాను అంటున్నాడు. సో ట్రీట్మెంట్ కోసం వచ్చారు అంది నీరజ. అది విని వెంటనే గట్టిగా నవ్వాడు ఆకాష్.. ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం లేదు వాడు కూడా నాలాగే నటిస్తున్నాడేమో చూసుకో అన్నాడు ఆకాష్.. నటించడం ఏంటి అర్ధం కాలేదు అని అడిగింది నీరజ. సేమ్ నేను కూడా నీ ఫ్రెండ్ వినీత దగ్గర సాధువు కనిపిస్తున్నాడు అని నటిస్తేనే నువ్వు నాకు పరిచయం అయ్యావ్ అన్నాడు ఆకాష్.. ఆగు ఆగు అంటే ఇప్పుడు నువ్వు చంపాలనుకునేది వినీతనా అని షాక్ అయ్యింది నీరజ. అవును మీ అక్కని చంపింది ఎవరో కాదు వినీతని పెళ్లి చేసుకోబోయే విశాల్.. మీ అక్క ఫోన్ లో వాడి ఫోటోలు మొత్తం అన్ని ఉన్నాయి. ఆ రోజే వాడిని పట్టుకుందాం అనుకుంటే వాడు ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

మరి వినీతని ఎలా చంపాలి అనుకుంటున్నావ్ అడిగింది నీరజ. మళ్లీ సాధువు నాటకం ఆడి చంపుతా.. అదేంటి కొంచెం క్లారిటీగా చెప్పు అని అడిగింది నీరజ. ఏం లేదు నాకు ఒక సాధువు కనిపిస్తున్నాడు అని ఆల్రెడీ వినీతను నమ్మించా.. ఒక రోజు నేను అరకు దగ్గరలోని కొండపైకి వెళ్తా.. నువ్వు తనని అక్కడికి పంపిస్తే చాలు నేను తనని అంతం చేస్తా నువ్వు ఈ హెల్ప్ చేస్తే మీ అక్క ఆత్మకి శాంతి చేకూర్చిన వాళ్లు అవుతామని ఆకాష్ చెప్పడంతో… ఓకే కానీ మనకి ఎలాంటి ప్రాబ్లెం లేకుండా చెయ్యాలి అని నీరజ చెప్పగానే సరే అని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు ఆకాష్. ఆ సాయంత్రం ఆకాష్ బీచ్ కి వెళ్తి ఎలా చంపాలా అని ఆలోచిస్తూ కూర్చొంటాడు.

Follow our Facebook Page ChuduBabai

Read our New story Series Aakanksha Episode 4

 

 1,808 Total Views,  1 Total Views Today

Comment Your Views