Mollywood and Kollywood Directors Gautham Menon, SJ Surya, Samudrakani are now the most busiest actors in thier Industries. Here is the article about Actor Turned Directors.

క్రియేటివిటీని కాకుండా యాక్టింగ్ ని నమ్ముకుంటున్నారు పలువురు డైరెక్టర్లు. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన డైరెక్టర్లు తమలో దాగి ఉన్న కళలను బయటకు తీస్తున్నారు. తాము కూడా ఎవరికి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. మెగా ఫోన్ పక్కన పెట్టేసి, ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు.
Gautham Menon

కనులు కనులను దోచాయంటే, ట్రాన్స్ చిత్రాల్లో విలన్ గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు గౌతమ్ వాసుదేవ్ మీనన్. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన క్వీన్ లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో విలన్ రోల్స్ కోసం గౌతమ్ డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు.
Selva Raghavan

7 జీ బృందావనం, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే డైరెక్టర్ ఇప్పుడు క్రైమ్ డ్రామా చిత్రంలో నటించబోతున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సాని కాయిదం చిత్రంలో సెల్వ రాఘవన్ నటించబోతున్నారు.
S J Surya

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొంది ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టి మెగాఫోన్ పట్టడం పక్కన పెట్టేశారు ఎస్ జే సూర్య. తెలుగులో ఖుషి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన ఎస్ జే సూర్య.. మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రంలో సైకో విలన్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఎస్ జే సూర్య ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ విలన్ గా సెటిలైపోయారు.
SamudraKani

శంభో శివ శంభో లాంటి చిత్రాలు తెరకెక్కించిన సముద్రఖని ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్ గా మారిపోయారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
K.S. Ravi Kumar

రజనీకాంత్ తో ముత్తు లాంటి హిట్ సినిమాలు చేసిన కే ఎస్ రవికుమార్ ఇప్పుడు తెలుగులో బాలకృష్టతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మేకప్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన కూడా కోలీవుడ్ లో బిజీ యాక్టర్ అయిపోయారు.
V V Vinayak

తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు డైరెక్ట్ చేసిన వి వి వినాయక్ ఇప్పుడు హీరోగా శీనయ్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అదే విధంగా తెలుగులో పలు డైరెక్టర్లు అప్పుడప్పుడు తమ సినిమాల్లో ఓ చిన్న పాత్రలో అలా కనిపించి మెప్పిస్తారు. టాలీవుడ్ లో ఎంత మంది డైరెక్టర్లు యాక్టర్లుగా మారతారో చూడాలి మరి.
Like our Facebook Page ChuduBabai
Chiru 150 Sentiment repeated for Acharya- Read Here
1,303 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022