సిల్వర్ స్క్రీన్‌పై అద్భుత నటనతో అలరిస్తున్న సినీ నటలు.. తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. తమకున్న టాలెంట్లతో పాపులర్ అయ్యే సెలబ్రిటీలు పర్సనల్ విషయాల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, విడాకులు కామన్ అయిపోయాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సినీ తారలు.. కొన్నాళ్లకే దూరం అవుతున్నారు. తమకు పిల్లలు ఉన్నా సరే జీవిత భాగస్వామితో అడ్జెస్ట్ అవ్వలేక డివోర్స్ తీసుకుంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు.. కొందరు మాత్రమే వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రమే కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇటీవల వరుసగా చాలా మంది సినీ సెలబ్రిటీలు డివోర్స్ తీసుకుంటున్నారు. ఏ మాయ చేసావే సినిమాలో నటిస్తూ ప్రేమలో పడిన నాగ చైతన్య, సమంత.. ఇరు కుటుం సభ్యులను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహా వార్షికోత్సవానికి నాలుగేళ్లు పూర్తి కావొస్తోన్న సమయంలో ఆక్టోబర్ 2న విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి మరువక ముందే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, కూతుళ్లైన ధనుశ్, ఐశ్యర్య విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హీరో ధనుష్, రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక వాలంటైన్స్ డే రోజున భర్త రితేష్‌కు విడాకులు ఇస్తున్నట్లు బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రకటించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె.. తన ‘నీరు బేడా’ ను స్క్రీన్ కోసం రాఖీ సావంత్‌గా మార్చుకుంది. ఆ తర్వాత స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా సత్తా చాటింది. నటిగా, డాన్సర్‌గా రాఖీ సావంత్… హిందీ, తమిళం, తెలుగు, ఒడియా, మరాఠీ సహా పలు భాషల్లో నటించారు. బిగ్ బాస్ 15 రియాల్టీ షో వేదికగా.. తన భర్తను ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా భర్తతో తన ఏడేళ్ల బంధాన్ని స్వస్తి చెప్పింది.
ఇలా లైఫ్ పార్ట్నర్స్‌కు విడాకులు ఇచ్చిన వారిలో సినీ సెలబిట్రీలు చాలా ఉన్నారు. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అనంతరం రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమెతో డివోర్స్ తీసుకున్నారు. 2013లో రష్యాకు చెందిన నటి అన్నా లెజ్నావెని పెళ్లి చేసుకున్నాడు.
నాగ చైతన్య, సమంతలాగే నాగార్జున మొదటి భార్య లక్ష్మితో విడిపోయారు. లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను వివాహం చేసుకున్నారు. హిరో సుమంత్, నటి కీర్తి రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ, కొంత కాలంగే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైన మూడేళ్లకే విడిపోయారు.
నటుడు ప్రకాష్ రాజు లలితా కుమారిని పెళ్లి చేసుకుని.. 15 ఏళ్ల తర్వాత 2009లో విడాకులు ఇచ్చారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. సింగర్ సునీత తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత రామ్ వీరపనేనిని గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇలా తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న నటులు… పర్సనల్ విషయాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Read Our Special Article on Megastar Chiranjeevi Click here
Like our Insta Page Chudubabai
2,183 Total Views, 2 Total Views Today
- మేడారం జాతర వెనుక అసలు కథ - February 18, 2022
- కలెక్టర్ గారి ప్రేమ కథా చిత్రమ్ - February 17, 2022
- సినీ తారలు.. విడాకులు - February 17, 2022