Most awaited Mega Star’s Acharya First look released today on the ocaassion of Chiranjeevi’s Birthday. But the team followed same sentiment.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఖైదీ నెం. 150 సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
పదేళ్ల పాటు చిత్రసీమకు దూరమైనా చిరంజీవి తన స్థానాన్ని పదిలంగా నిలుపుకున్నారు. ఆయన కం బ్యాక్ చిత్రం కావడం, పైగా ఆ చిత్రం ఆయన కెరీర్లో 150వ చిత్రం కావడంతో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
150 చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు ఎంతో మంది దర్శకులు పోటీ పడ్డా.. ఆ అవకాశం వీవీ వినాయక్ కు లభించింది. దీంతో చిరు 150వ చిత్రంగా తమిళ సినిమాను రీమేక్ చేశారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు నచ్చే విధంగా తెరకెక్కించి, బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఆ సినిమాలో చిరు డైలాగ్స్, డ్యాన్స్ లో గ్రేస్ మాత్రం ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. ఖైదీ నెం.150 చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటించారు చిరంజీవి. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
సైరా సినిమాను రాయలసీమ ప్రాంతానికి చెందిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చేసిన ఫైట్లకు అభిమానులే కాక తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ధియేటర్లలో చప్పట్ల మోత మోగించారు. ఖైదీ నెం. 150, సైరా చిత్రాలతో చిరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివతో చేస్తున్నారని వార్తలు నిజమయ్యాయి. సోషల్ ఎలిమెంట్స్ తీసుకుని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తు ఉంటారు.ఇక చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
ఓ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. మాటల మధ్యలో కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ ఆయన ప్రకటించేశారు. టైటిల్ కన్ఫార్మ్ చేయడంతో చిరు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురు చూశారు. ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఖైదీ నెం. 150, సైరా చిత్రాలలో మాదిరిగా చిరంజీవి ఫస్ట్ లుక్ ఉండడం విశేషం. ఆ మూడు ఫస్ట్ లుక్ పోస్టర్లలో చిరు ఫ్రెంట్ వ్యూ కాకుండా శత్రువులతో పోరాడుతూ ఉన్నట్టు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో మళ్లీ సేమ్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.

Like Our Facebook Page Chudubabai
Revenge Tthriller Aakanksha Second Episode Released- Read Here
1,038 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022