When Will Cinemas Hits Screens in Andhra Pradesh?

Cinema Theaters

Cinema Theaters

కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 22 నుంచి భారత్ లో లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ ప్రభావంతో సినిమా ఇండస్ట్రీలో కూడా షూటింగ్ లు ఆగిపోయాయి. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియతో షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. అన్ లాక్ 5.0 వరకు ధియేటర్లకు అనుమతులు లభించకపోవడంతో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.

కేంద్రం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో కొన్ని సినిమాలను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఏపీలో థియేటర్లు తెరుచుకోవడంతో సందిగ్ధత ఏర్పడింది. థియేటర్లు ఓపెన్ కావడంతో ఆ ఎక్సపీరియన్స్ ను ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు ఇంకొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని థియేటర్ యజమానులు కోరుతున్నారు. గతంలో ఇదే విషయంపై సినీ పెద్దలు సీఎం జగన్ ను కలిసినప్పుడు సానుకూలంగా స్పందించారని కానీ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో విద్యుత్ బకాయిలు అలాగే ఉండిపోయాయి. లాక్ డౌన్ లో థియేటర్లు తెరవకపోయినా కనీస ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆ ఛార్జీలు కూడా లక్షల్లో ఉండడంతో వాటిని కూడా రద్దు చేసి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రస్తుతం థియేటర్లు తెరిచిన 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలతో థియేటర్లు తెరిచినా వచ్చిన ఆదాయం నిర్వహణకు కూడా సరిపోదని థియేటర్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేకపోతే తాము థియేటర్లు తెరవలేమని అంటున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నానితో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలమైతే త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయి.

TRP Ratings Scam in India- Read Here

 

Like our Facebook Page ChuduBabai

 1,369 Total Views,  1 Total Views Today

Comment Your Views