ఇప్పుడు మీరు చదివేది ఆషామాషీ ప్రేమ పెళ్లి గురించి.. కాదు.. ఒక జిల్లా కలెక్టర్ తను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తూ.. తమ పెళ్లికి ఆహ్వానిస్తూ రాసిన ఒక ప్రేమ కథా చిత్రమ్
ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుంది అని చెప్పలేము. కొందరికి తొలి చూపులోనే ప్రేమ పుడుతుంది. మరికొందరికి స్నేహం తర్వాత.. అది ప్రేమగా మారుతుంది. ఒకరిని మనస్పూర్తిగా ఇష్టపడితే వారితో జీవితాంతం బ్రతికేయాలనిపిస్తుంది. వారినే జీవిత భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తుంటారు. ప్రేమించిన వారిని పొందాలని పరితపిస్తుంటారు. ఇక ఇష్టపడిన వ్యక్తి తమ జీవితంలోకి వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.
ఓ గ్రామంలో బాగా చదువుకున్న అబ్బాయి ఉండేవాడు. అప్పటికే సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా అందమైన అమ్మాయి కనిపించింది. అంతే అబ్బాయి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆ అపురూప సౌందర్యరాశినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ యువతితో పరిచయం పెంచుకోవాలని పరితపించిపోయాడు. దీంతో ఆమెను ప్రతిరోజూ ఫాలో అయ్యాడు. మనసులో మాటలు బయటకు చెప్పలేకపోయినా.. భావం ఇద్దరికీ అర్థమైంది. అలా మొదలైన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ రియల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో హీరో ట్రైనీ కలెక్టర్, హీరోయిన్ టీచర్.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌ది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. రాహుల్ సివిల్స్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో… బస్సులో కనిపించిన మనీషాపై మనసు పారేసుకున్నాడు. ప్రతి రోజు రాహుల్ మనీషాను ఫాలో అవుతున్నాడు. స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మనీషా.. రాహుల్ ఫాలో అవుతున్న విషయాన్ని గమనించింది. ఆమె కూడా రాహుల్‌ను ఇష్టపడింది. కానీ, బయపడలేదు. అలా కొన్ని రోజులు గడిచాక ఇద్దరి చూపులు కలిశాయి. అలా మొదలైన పరిచయంతో బస్సు ప్రయాణానికి గుడ్ బై చెప్పి… బుల్లెట్ బండెక్కి షికార్లు తిరిగారు. అయినా ఎక్కడో తెలియని మోహమాట పడేవారు. వన్ ఫైన్ డే ఓ ఆలయంలో తన ప్రేమ విషయాన్ని రాహుల్ మనీషాకు వివరించాడు. ఆమెకు ఇష్టం ఉండడంతో ఒకే చెప్పింది.
రాహుల్, మనీషా ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. కులాలు, మతాలు వేరు అయినా ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించారు. దీంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాహుల్, మనీషాల వివాహం ఈనెల 10వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి లవ్ స్టోరీ సక్సెస్ అయింది.. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా..? తన లవ్ స్టోరీని ఓ వీడియో రూపంలో చిత్రికరించిన తీరే అందరినీ ఆకట్టుకుంటోంది.
తాను ప్రేమించిన యువతిపై తనకున్న లవ్‌ను ఎలా వ్యక్తం చేశాడో.. కవితల రూపంలో వర్ణిస్తూ యానిమేషన్‌లో తన వాయిస్‌ను జోడిస్తూ రాహుల్ ఇన్విటేషన్‌ను రూపొందించాడు. వీడియో రూపంలో ఉన్న వెడ్డింగ్ కార్డును బంధుమిత్రులకు, స్నేహితులకు పంపి ఆహ్వానించాడు. తన ప్రేమను వ్యక్తం చేసిన తీరు, పెళ్లికి ఆహ్వానించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. వెడ్డింగ్ కార్డు ఇస్తే కేవలం పెళ్లి అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ వీడియోలో వారి మధ్య పెనవెసుకున్న బంధం.. తమ పెళ్లి ఎలా కుదిరింది గురించి వివరించారు. ప్రస్తుతం యువ ఐఏఎస్ లవ్ స్టోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Our Special Article on Megastar Chiranjeevi Click here
Like our Insta Page Chudubabai
1,838 Total Views, 3 Total Views Today
- మేడారం జాతర వెనుక అసలు కథ - February 18, 2022
- కలెక్టర్ గారి ప్రేమ కథా చిత్రమ్ - February 17, 2022
- సినీ తారలు.. విడాకులు - February 17, 2022