ఒకప్పుడు సూపర్ మార్కెట్, రెస్టారెంట్‌లకు వెళ్తే.. క్యాష్ లేదా ఏటీఎం కార్డులు తీసుకెళ్లేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్లినా ఏ వస్తువు కొన్నా వాటికి కేవలం ఫోన్ నెంబర్ సహాయంతో డబ్బులు చెల్లించవచ్చు. ప్రస్తుత కాలంలో ఏదైనా బిల్లులను లిక్విడ్ క్యాష్ రూపంలో కంటే.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తుంటాం.
టీ పాయింట్, కిరాణ షాపు దగ్గరి నుంచి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్ల వరకు ఇలా ఎక్కడైనా సరే.. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే బిల్లులను కడుతున్నాము. వీటన్నింటికీ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లను వాడుతుంటాము. అయితే ఇలాంటి పేమెంట్ యాప్‌లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా ఆదాయం ఎలా పొందుతున్నాయని మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా..?
రూపాయి నుంచి రూ.లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సదుపాయలు అందిస్తున్నా.. యూజర్ల నుంచి ఈ పేమెంట్ యాప్‌లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. యూపీఐ పేమెంట్స్ వల్ల యాప్‌లకు ఎలాంటి ఆదాయం ఉండదు. ఈ యాప్స్ పేమెంట్స్ మాత్రమే కాకుండా పలు రకాల సర్వీసులు అంటే మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించే సౌకర్యాలు ఉంటాయి. ఈ పేమెంట్ యాప్స్ నుంచి ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఆయా టెలికాం కంపెనీలు ప్రతి ట్రాన్సాక్షన్‌పై కమీషన్ ఇస్తుంటాయి. అలాగే ఆయా యాప్‌లు అందించే ఇతర సేవలకూ కమిషన్ రూపంలో ఇన్‌కమ్ వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ యాప్‌లు వస్తు, సేవల ప్రమోషన్, పలు రకాల యాప్‌ల గురించి ప్రచారం నిర్వహిస్తుంటాయి. అంటే ఫోన్‌పేలో ఇన్సూరెన్స్, గ్రాసరీస్, ఫుడ్ వంటి సేవలను ప్రమోట్ చేయడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది.
ఫోన్ పే, గూగుల్ పే ఇచ్చే రివార్డుల నుంచి కూడా వీటికి ఆదాయం వస్తుంది. రివార్డులో పలు కంపెనీలకు సంబంధించి కూపన్స్ ఉంటాయి. అంటే ఒక రకంగా ఆయా కంపెనీలను ప్రమోట్ చేసినట్టే. ఇలా ప్రమోషన్ ద్వారా కూడా యాప్స్ కొంత లాభం వస్తుంది. ఇక రివార్డుల రూపంలో ఇచ్చిన కంపెనీ కూపన్స్ వాడి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా సరే యాప్స్‌కు కొంత కమీషన్ ఉంటుంది. మరోవైపు లోన్స్, ఇన్సూరెన్స్ సర్వీసుల భాగ్యస్వామ్యంతో కూడా ఆదాయం వస్తుంది. వారి సర్వీసులను ప్రమోట్ చేస్తే కమీషన్ వస్తుంది. అలాగే యాప్ యూజర్లు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది.
ఈ డిజిటల్ పేమెంట్ యాప్‌లలో వినియోగదారులు చేసే ట్రాన్సాక్షన్స్ డేటా స్టోర్ అవుతోంది. దీంతో సదరు వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు ఏంటో తెలుస్తోంది. ఈ డేటాను పలు కంపెనీలు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఫలితంగా పేమెంట్ యాప్‌లకు ఆదాయం చేకూరుతోంది. యూజర్ల డేటాను కొనుగోలు చేసిన ఆయా కంపెనీలు.. వినియోగదారుడి అలవాట్లు, అవసరాలకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు వినియోగించుకుంటాయి. ఇలా పలు రకాల సేవలను అందిస్తూ డిజిటల్ పేమెంట్ యాప్‌లు భారీ మొత్తంలో ఆదాయాలను పొందుతున్నాయి.
Read Our Article on AP Airports Issue Click Here
Like Our Facebook Page ChuduBabai
1,248 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022