
Aakanksha Episode 3
Aakanksha Episode 3
వివేకానంద అనాథాశ్రమంలో అప్పుడే అన్నం తిని ప్లేట్ కడుక్కుంటున్న ఆకాష్ మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్న ఆకాంక్షని చూసి దగ్గరకి వెళ్లాడు. ఏమైంది ఆకాంక్ష ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగడంతో తన చెల్లిని ఎవరో దత్తత తీసుకున్నారని చెప్తూ ఎడిచింది ఆకాంక్ష. బాధ పడకు ఆకాంక్ష తను అయినా మంచి పొజిషన్ లో ఉంటుంది కదా.. ఇకపై నువ్వు ఏడవొద్దు… మనం ఫ్రెండ్స్ అంటూ తనని ఓదార్చాడు. ఆకాంక్ష ఏమి తినకపోవడంతో ఆకాష్ తనకు ఫుడ్ తీసుకెళ్లి పెట్టాడు. అలా చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే అనాథాశ్రమంలో పెరిగి బాగా చదువుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉండడంతో కొంత మంది సహాయంతో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ సంపాదించారు. చెన్నైలో జాబ్ కావడంతో ఇద్దరూ చెన్నై షిఫ్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. ఒక నైట్ ఆకాంక్షకు ఆఫీస్ లో లేట్ అవ్వడంతో బస్టాండ్ లో వెయిట్ చేస్తున్నా అని ఆకాష్ కు కాల్ చేసింది. అప్పటికే వర్షం పడేలా ఉండడంతో ఆకాంక్ష తన ఫోన్ లో సెల్ఫీ తీసుకుంటోంది. అదే టైంలో బాగా డ్రింక్ చేసి ఉన్న విశాల్.. ఆకాంక్షను చూసి కార్ ఆపాడు. విశాల్ కి ఆన్ సైట్ ఓకే అవడంతో ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అదే టైంలో ఆకాంక్ష రోడ్డుపై కనపడడంతో తనని ఇష్టపడతాడు. అప్పటికే డ్రింక్ చేసి ఉండడంతో కార్ దిగి ఫోటోలు తీసుకుంటున్న ఆకాంక్ష దగ్గరకు వెళ్లాడు. ఆకాంక్షను వెనక నుంచి హగ్ చేసుకోవాలని చూస్తుండడంతో గట్టిగా విశాల్ ను చెంప దెబ్బ కొట్టి ఎవరు మీరు ఏంటి మిస్ బిహేవియర్ అని గట్టిగా అరుస్తుంది. దీంతో ఆకాంక్ష నోరు మూసేసిన విశాల్ బీచ్ లోకి లాక్కెళ్లాడు. విశాల్ నుంచి తప్పించుకునేందుకు ఆకాంక్ష ప్రతిదాడి చేయడం మొదలుపెట్టింది. కోపంతో రెచ్చిపోయిన విశాల్ బీచ్ లో దొరికిన బీర్ బాటిల్ పెంకులతో ఆకాంక్ష చేతిపై కోసి అక్కడి నుంచి లేచి పరిగెత్తాడు.
ఆకాంక్ష బ్యాగ్ రోడ్ మీద చూసిన ఆకాష్ వెతుక్కుంటూ బీచ్ లోకి వెళ్లాడు. ఈ లోపు చీకట్లోంచి ఒక వ్యక్తి అక్కడి నుంచి రావడం గమనించి.. ఆకాంక్షను వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న ఆకాంక్షను చూసి ఆకాష్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒడిలోకి తీసుకున్నాడు. ఆకాష్ అడుగుతుండగా ప్లీజ్ నువ్వు నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపు నేను చనిపోతా.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో ప్లీజ్ అని ప్రామిస్ చేయించుకుంది ఆకాంక్ష. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి.. చిన్నప్పుడు ఎక్కడికో వెళ్లిపోయిన నా చెల్లిని కలవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఆ కోరిక నెరవేరడం లేదు. నువ్వు నా చెల్లిని కలిసి జరిగింది చెప్పు, దానిని నువ్వు గుర్తు పట్టడం ఈజీనే మేమిద్దరం ట్విన్స్ కాబట్టి నువ్వు కనుక్కోవడం ఈజీగానే ఉంటుంది ప్లీజ్ అంటూ ఆకాష్ చేతిలో ప్రాణాలు విడిచింది. ఆకాంక్షను వదిలి వెళ్లలేక అక్కడి నుంచి బయటకు వస్తుండగా, ఆకాష్ కాళ్లకి బ్యాగ్, ఫోన్ తగిలాయి. వాటిని తీసుకుని అక్కడి నుంచి ఆకాష్ ఇంటికి బయల్దేరాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ కి వెళ్లిన ఆకాష్ వినీత డెడ్ బాడీని మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లడం చూసి బాధపడి, వాళ్ల దగ్గరకి వెళ్లి ఏమైంది అని అడిగాడు. లవ్ ఫెయిల్యూర్ ఏమో బాబు సూసైడ్ చేసుకుంది అని వాళ్లు చెప్పడంతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులపాటు ఆఫీస్ కు లీవ్ పెట్టి బీచ్ లో ఆకాంక్ష చనిపోయిన ప్లేస్ లో కూర్చుని ఫోన్ లో ఫోటో చూస్తూ బాధపడేవాడు. సడెన్ గా ఆకాంక్ష ఫోన్ వెతికితే ఏదైనా దొరకవచ్చు అనుకుని ఇంటికి వెళ్లి ఆకాంక్ష ఫోన్ ఆన్ చేయడానికి చూసాడు. అప్పటికే ఫోన్ స్క్రీన్ పాడైపోవడంతో షాప్ కు తీసుకెళ్లి ఫోన్ రిపేర్ కి ఇచ్చాడు. ఫోన్ స్క్రీన్ ప్రెజెంట్ లేదు ఒక 2 డేస్ లో చేసి ఇస్తా అని చెప్పడంతో ఫోన్ షాప్ లో ఇచ్చేసి.. భయ్యా అందులో డేటా చాలా ఇంపార్టెంట్ అది పోకుండా చూడండి అని చెప్పి ఆకాష్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆఫీస్ లో అందరూ కూడా ఆకాంక్ష సూసైడ్ చేసుకుంది అని మాట్లాడుకుంటుండడంతో మరింత కృంగిపోయిన ఆకాష్ ఆఫీస్ లో డల్ గానే ఉంటున్నాడు.
ఆకాష్ డల్ గా ఉండడం.. ఆఫీస్ లో పెర్ఫర్మెన్స్ కూడా బాగా లేకపోవడంతో ఆకాష్ ప్లేస్ మారితే కొంచెం మారతాడేమోనని అక్కడి మేనేజర్ ఆకాష్ ను ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏం చెప్పాలో తెలియక ఆకాష్ కూడా ఓకే అని చెప్పి మేనేజర్ రూంలోంచి బయటకి వచ్చేశాడు. ఆఫీస్ నుంచి బయటకి వచ్చి ఆకాష్ ఆకాంక్ష ఫోన్ కోసం షాప్ కి వెళ్లి.. ఆకాంక్ష ఫోన్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేసి ఆ రోజు ఏం జరిగిందా అని చూస్తే విశాల్ ఆకాంక్షతో మిస్ బిహేవ్ చేసిన వీడియో చూసి విశాల్ కోసం ఎంక్వైరి చేయడం మొదలుపెట్టాడు ఆకాష్. అప్పటికే విశాల్ ఆన్ సైట్ ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోవడంతో ఆకాష్ వైజాగ్ స్టార్ట్ అయ్యాడు.
Follow our Facebook Page ChuduBabai
Read our new story series Aakanksha Episode 2
1,967 Total Views, 2 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022