Is Bigg Boss 4 Telugu Host Confirmed?

Bigg Boss 4 Telugu Host
Bigg Boss 4 Telugu Host Cofirmed?

బిగ్ బాస్.. తెలుగులో అన్ని రియాలిటీ షోస్ కన్నా బాగా పాపులర్ అయిన షో.. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధమైపోతోంది. కరోనా ఎక్కువగా ఉండడంతో ఈసారి బిగ్ బాస్ లేనట్టేనని అందరూ అనుకున్నారు. కానీ వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 4 పై అఫిషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేసింది…


ఇప్పటికే కంటెస్టెంట్స్ సెలక్షన్లు పూర్తి చేసిన బిగ్ బాస్ టీం.. హోస్ట్ ని కూడా కన్ఫార్మ్ చేసేసింది. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్, సెకెండ్ సీజన్ నాని, ధర్డ్ సీజన్ నాగార్జున హోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. తాను ఈ సీజన్ హోస్ట్ చేయాలంటే కొన్ని షరతులు పెట్టారంట నాగార్జున. కరోనా కట్టడి కాకపోవడంతో.. ఈసారి ఆడియన్స్ లేకుండానే నాగార్జున హోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో బిగ్ బాస్ టీం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Bigg Boss 4 Telugu Contestants list


ఈసారి తక్కువ మంది కంటెస్టెంట్స్ తో తక్కువ రోజులే షో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4ని కొద్ది రోజుల్లోనే ప్రారంభించాలని భావిస్తోంది స్టార్ మా. ఆగష్టు 1 లేదా ఆగష్టు 8 నుంచి షో ప్రారంభించాలని నిర్ణయించారట. హౌస్ లోకి వెళ్లేముందు సెలెక్టడ్ కంటెస్టెంట్స్ అందరికీ.. కోవిడ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాతే వాళ్లందరినీ హౌస్ లోకి పంపుతారట. అదే విధంగా వారం వారం ఎలిమినేట్ అయిన వారికి కూడా కోవిడ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే ఇంటికి పంపుతారు.. చూద్దాం ఈ సీజన్ లో ఎవరూ సెలబ్రెటీస్ అవుతారు.. ఎవరూ టైటిల్ గెలుస్తారో..

Like Our Facebook Page Chudubabai

 2,703 Total Views,  1 Total Views Today

Comment Your Views