
అవును.. ఏపీ సీఎం జగన్ కంటున్న కలలు నిజమైతే ఏపీ మరో అమెరికాగా రూపాంతరం చెందుతుంది. ఇది జగన్ మీద అభిమానంతోనే.. లేదా వెటకారంగానో చెప్తున్న మాట కాదు..
ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జిల్లాకో ఎయిర్ పోర్ట్ నిర్మించేలా.. అందులోనూ బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా.. రన్ వే నిర్మించాలంటూ.. దానికి తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక జిల్లాకో ఎయిర్ పోర్టు వార్తలపై సోషల్ మీడియాలో మీమ్ లు తెగ వైరల్ అయిపోతున్నాయి.
రోడ్లు సరిగ్గా లేవు.. ముందు రోడ్లు వేయండి.. ఆ తర్వాత ఎయిర్ పోర్టుల గురించి ఆలోచించవచ్చు.. అంటూ ప్రతిపక్షాల నుంచి సామాన్య పౌరుల వరకు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం వేరే ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. కరోనా వచ్చిన సమయంలో అందరూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఎందుకో ఆయన మాటలు చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండేవి.. నవ్వు తెప్పించేవి.. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ పెట్టిన ప్రెస్ మీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా అనేది నిరంతర ప్రాసెస్ అని.. దానితో మనం సహజీవనం చెయ్యాలని.. పారాసెటిమల్ తప్ప మరే వైద్యం లేదంటూ జగన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. అప్పుడు అందరూ జగన్ ను చూసి నవ్వారు. ఇలా ఎలా మాట్లాడుతారు అంటూ విమర్శించారు.
ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. అదే నిజమైంది. గత మూడేళ్లుగా అందరూ కరోనాతో సహజీవనం చేస్తున్నారు. కొంత మందికి సీరియస్ అయితే మరికొంత మందికి వచ్చి పోయింది. ఇక కొంత మంది టెస్టులు చేయించుకోకుండా ఇంట్లో కూర్చుని పారాసెటిమల్ టాబ్లెట్ ఏ వాడుతున్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ లోనూ అదే పరిస్థితి.. అందరూ కరోనాతో కలిసి జీవిస్తున్నారు. సగటున ప్రతీ ఇంట్లోనూ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు ఉన్నారు. వాళ్లందరూ వాడేది.. డోలో 650 (పారాసెటిమల్) టాబ్లెట్ వాడుతున్నారు. పొరపాటును టెస్ట్ చేయిస్తే ఎక్కడ పాజిటివ్ వస్తుందేమోనని.. ఇంట్లోనే ఉండి తెలిసిన వైద్యం తమకు తామే చేసుకుంటున్నారు.
ఇప్పుడు సీఎం జగన్ ఎయిర్ పోర్టులపై చేసిన వ్యాఖ్యలు ఫ్యూచర్‌లో నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అగ్ర రాజ్యం అమెరికాను ఉదాహరణగా తీసుకుందాం. అమెరికాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఎక్కువగా విమానాలనే ఉపయోగిస్తారు. వేగంగా, సుఖంగా ప్రయాణం చేయొచ్చనే ఆలోచన. అక్కడ రోడ్ ట్రాఫిక్ కన్నా.. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వైశాల్యంలో చూసుకుంటే అమెరికా వైశాల్యం 99, 520 km2 కాగా.. ఆంధ్ర ప్రదేశ్ వైశాల్యం 1, 60,205 km2. వైశాల్యంలో ఏపీ కన్నా చిన్నదైన అగ్రరాజ్యం అమెరికా అంతలా డెవలప్ అయితే.. ఏపీ మరెంత అభివృద్ధి చెందాలి.. అలాంటి రాష్ట్రాలు ఉన్న మన దేశం ఇంకెంత అభివృద్ధి చెందాలి. ఇప్పుడు జిల్లాకో ఎయిర్ పోర్ట్ పెట్టాలనేది తప్పుడు ఆలోచన కాదు. ఏపీలో రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ పోర్టులపై కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్సలు బాలేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఖజానా దగ్గర సొమ్ములు లేవు.
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. రోడ్లు వేయట్లేదు అన్నప్పుడు.. అలాంటి సమయంలో ఎయిర్ పోర్టులు అవసరమా.. అనే ప్రశ్న తలెత్తక మానదు. ఇప్పటికిప్పుడు ఎయిర్ పోర్టులు నిర్మించాలని సీఎం జగన్ ఆదేశాలివ్వలేదు.. ఎయిర్పోర్టుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నారు. అప్పట్లో చంద్రబాబు కృషి కారణంగా.. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచనగరాల జాబితాలో నిలిచింది. ఒక ఆలోచన రూపుదాల్చాలంటే కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. అదే గనుక జరిగితే ఏపీ చాలా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అమరావతి కల.. ఇప్పుడు జగన్ ఎయిర్ పోర్టుల కల సాకారమైతే.. ఏపీ దేశంలో తిరుగులేని రాష్ట్రంగా అవతరిస్తుంది. అయితే ఇక్కడొచ్చిన సమస్య నిధుల లేమి. కొత్త రాష్ట్రం.. 8 ఏళ్ల వయస్సు.. ఉన్న రాష్ట్రం.. అభివృద్ధి లేదు.. సంక్షేమం తప్ప.. రాష్ట్ర విభజన సమయంలో హామీలిచ్చిన జాతీయ పార్టీలు అవి నెరవేరకపోవడంతో ఇప్పుడు ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కానీ రాష్ట్ర పరిస్థితి ఎప్పటికీ ఇలా ఉండిపోదు.. జగన్, చంద్రబాబుల కలలు నిజమైతే.. ఏపీ మరో అమెరికాగా మారుతుంది అనేది మాత్రం పచ్చి నిజం.
Read our another article on Fish Attack on Fisherman
Like Our Facebook Page ChuduBabai
862 Total Views, 2 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022