కశ్మీర్ లో భూతల స్వర్గాన్ని తలపిస్తూ భారత రైల్వే ఓ కొత్త బ్రిడ్జి నిర్మిస్తోంది.
మేఘాలలో తేలియాడుతూ వెళ్లాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే.. ఆ అనుభూతిని ఆస్వాదించాలంటే విమాన ప్రయాణం చేయాల్సిందే.. కానీ విమానంలో కాకుండా ట్రైన్ లో వెళ్తే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. అల్లంత ఎత్తులో.. పాల నురగల్లాంటి మేఘాల్లో తేలిపోతూ రైలు ప్రయాణానికి భారతీయ రైల్వే ఓ వంతెనను కడుతోంది.
జమ్ము కశ్మీర్ లోని రియాసీలో చినాబ్ నదిపై రెండు కొండలను కలుపుతూ భారతీయ రైల్వే వంతెన నిర్మాణం చేపడుతోంది. మేఘాల మధ్య తేలియాడుతూ ఉండే ఈ వంతెన నిర్మాణాన్ని భారత రైల్వే ట్విట్టర్‌లో పంచుకుంది. 2002లో ప్రారంభమైన వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. రెండు కొండలను కలిపే ఈ వంతెనకు ఆర్చ్ బ్రిడ్జిగా నామకరణం చేశారు. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం జరుపుతున్నట్టు రైల్వే తెలిపింది. జమ్ము కశ్మీర్ లోని ఈ ఆర్చ్ బ్రిడ్జి ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తు ఉండనుంది. రియాసీలోని బక్కల్, కౌరీ ప్రాంతాల మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.
కశ్మీర్ లోయకు ఇతర ప్రాంతాలను అనుసంధానించడంలో ఈ వంతెనది కీలకపాత్ర అని రైల్వే అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లో భాగమైన ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లకు లింక్ చేసే కత్రా, బనిహల్ మధ్య 111 కిలో మీటర్ల స్ట్రెచ్‌ను ఈ రైల్వే ఆర్చ్ బ్రిడ్జి అనుసంధానిస్తోంది. ఈ వంతెనను 1,135 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.
ఈ ఆర్చ్‌పై రైల్వే ట్రాక్ నిలబడేలా 17 ఇనుప పిల్లర్లతో రైల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆర్చ్ పొడవు 476 మీటర్లు ఉంటుంది. గంటకు 266 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతగా నమోదైన భూకంపాలను సైతం ఈ ఆర్చ్ బ్రిడ్జి తట్టుకునేలా నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఆర్చ్ బ్రిడ్జి ఫోటోలను రైల్వే శాఖ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమంటూ ప్రతీ ఒక్కరూ కొనియాడుతున్నారు. కశ్మీర్‌ను భూతల స్వర్గం అనే మాటను ఈ ఫోటోలు నిజం చేస్తున్నాయి.
Read Our Article on AP Airports Issue Click Here
Like Our Facebook Page ChuduBabai
1,316 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022