NTR 30 – Sequel for Aravinda Sametha?

Here is the Interesting news about NTR 30. Ntr and trivikram srinivas planning to start the shooting soon. Some rumors are spreading about this combination.

NTR 30

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అరవింద సమేతతో ఫుల్ మీల్స్ తినిపించారు. అరవింద సమేత వీర రాఘవ రెడ్డిగా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆయన భాష, యాసలోను మార్పు చూపించారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”తో ఎన్టీఆర్ బిజీ అయిపోయారు, ఇక “ఆర్ఆర్ఆర్” తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. తన తర్వాత సినిమా కూడా త్రివిక్రమ్ తో చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.

“ఆర్ఆర్ఆర్” తర్వాత మళ్లీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ చిత్రం కావడంతో కాస్త జాగ్రత్తగా కథలు సెలెక్ట్ చేసుకున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాకి “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ఖరారైందని తెలుస్తోంది. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన మరో గాసిప్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఈ సినిమా రాజకీయ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం అరవింద సమేతకు సీక్వెల్ కావడంతోనే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేశాడట. అరవింద సమేత కూడా రాజకీయ నేపధ్యంలో సాగే చిత్రం క్లైమాక్స్ లో ఎన్టీఆర్ బసిరెడ్డి భార్యను  ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటిస్తారు. ఇక అదే సినిమాలో తండ్రి చనిపోయిన తర్వాత హైకమాండ్ కి కూడా వార్నింగ్ ఇస్తాడు ఎన్టీఆర్. బసిరెడ్డి భార్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ కథ తయారు చేశారట త్రివిక్రమ్.

అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడం, దానికి సిక్వెల్ గా మరో కథను తయారు చేయడం వల్లే మళ్లీ త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి ఎన్టీఆర్ కి వినిపించగానే ఎన్టీఆర్ కి కథ చాలా నచ్చి సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేయమని అడిగారట.

Follow our Facebook Page ChuduBabai

Is there any chance for Russia Covid Vaccine in India- Read Here

 2,090 Total Views,  3 Total Views Today

Comment Your Views