ఆయ్.. అందరికీ నమస్కారమండి. గోదావరి జిల్లాలంటే అందరికీ గుర్తొచ్చేవి గలగలపారే గోదావరి నది, అందమైన కోనసీమ, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు.. అంతే అంటారా అబ్బే అలా కాదండి గోదావరి జిల్లాలంటే ఎన్నో అందాలు, ఎన్నో ఆప్యాయతలు.. ఇలా గోదావరి జిల్లాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయ్ అండి..
కోనసీమ స్పెషల్ పూతరేకులు గురించి వినే ఉంటారు కదండి… దాని గురించి ప్రత్యేకంగా సెప్పాలా అంటారా.. సర్లేండి మరి కాకినాడ గొట్టం కాజా.. తాపేశ్వరం మడత కాజా గురించి కూడా సానా మంది సెప్పే ఉంటారు. మరి ఇప్పుడు చాలా మందికి తెలియని ఫేమస్ టిఫిన్ గురించి చెప్పాలని ఇలా మీ ముందుకు వచ్చేసానండి.
పంచారామ క్షేత్రాలు తెలుసుకదండి.. అదేనండి బాబు అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం.. ఇవన్నీ శివాలయాలకు ఫేమస్ అయితే మన పాలకొల్లు శివుడితో పాటు మరో వంటకానికి కూడా ఫేమస్ అండి బాబు. ఎప్పుడైనా పాలకొల్లు దిబ్బరొట్టే గురించి విన్నారా.. మీలో కొంత మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ల కోసం సెప్పాలనిపించిందండి..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బస్టాండ్ లో బస్సు దిగగానే దగ్గరలోనే మారుతి ధియేటర్ అని ఒక సినిమా హాల్ ఉందండి.. అక్కడే మన ఫేమస్ దిబ్బరొట్టెలు దొరికేది. బస్టాండ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఏంటి అక్కడ అంత మంది జనం గుమిగూడారు ఏదైనా జరిగిందనుకుంటారేమో.. అలాంటిదేమి కాదండి బాబు అక్కడ ఉదయాన్నే టిఫిన్ కోసం నుంచున్న జనం వాళ్లు. ఇక ఊళ్లో వాళ్లే టిఫిన్ కోసం ఎగబడి వస్తారు అనుకోకండి ఆయ్… ఇంటికి వచ్చిన సుట్టాలు కూడా మారుతి ధియేటర్ దిబ్బరొట్టె కోసం ఆశగా ఎదురుచూస్తారు.
ఇదేదో ఇప్పుడొచ్చిన యాపారం అనుకుంటారేమో ఎప్పటినుంచో ఫేమస్ ఈ దిబ్బరొట్టె. దిబ్బరొట్టె గురించి ఇంతలా సెప్పాలా మాకు తెలియదా అని చటుక్కున ఓ మాట వదిలేయకండి ఓపాలి మా దిబ్బరొట్టే లటక్కున నోట్లో ఎట్టుకుంటే.. అలా జున్నుముక్కలా కరిగి గొంతులోకి జారిపోద్దండి ఆయ్.. మరేటనుకున్నారు..
నల్లగా ఉండే మూకుడిలో అలా కాసింత నూనె పోసి.. మెత్తగా తెల్లగా రుబ్బిన మినపప్పుని వేసి మూతెట్టేత్తారు. ఏవండోయ్.. ఇదేదో పెద్ద హోటల్ అనుకునేరు.. ఇక్కడ దిబ్బరొట్టెలు అన్ని కూడా బొగ్గుల కుంపటి మీదే వేస్తారంటే నమ్మండి. కింద కుంపటి మంట సెగ తగులుతుంటే మూకుడు పైన పెట్టిన మూతమీద కూడా అలా ఎర్రగా కాలుతున్న బొగ్గులు వేస్తారు. అప్పుడే కదా పైనా కింద రొట్టె సరిగ్గా కాలేది . దళసరిగా ఒకవైపు… నునుపుగా మరోవైపు కాలిన రొట్టె మూకుడు లోంచి బయటకు వస్తుంటే ఆ వాసన ఉంటాదండి అబ్బబ్బా.. రొట్టే తినడమే కాదండి.. రొట్టె కాలే విధానం కూడా ఓపాలి సూసేయ్యాలి అంతే..
అలా మూకుడు లోంచి బయటపడ్డ రొట్టె ముక్క మీదే అనుకుంటే పెద్ద పొరపాటే.. మీకన్నా అక్కడ పెద్ద చాంతాడంత లైనుంటాదండి ఆ రొట్టె కోసం.. మన ముందు నుంచి ఆ రొట్టె వేరే వాళ్లకి వెళ్తుంటే చూస్తూ ఉండలేక.. బాబాయ్ నా రొట్టె ఎప్పుడు అని ఆశగా అడిగేయ్యాలనిపిస్తాది. ఈ హోటల్లో రొట్టె ఒకటే కాదండోయ్ ఇడ్లీలు, దోశెలు, పూరీలు కూడా దొరుకుతాయ్ కానీ.. తాత వేసే దిబ్బరొట్టెలకే అంత పేరు వచ్చింది.
ఎప్పటినుంచో ఆయనకు తెలిసిన విద్య దిబ్బ రొట్టెలు వెయ్యడం ఒకటే. దీంతో ఆ దిబ్బరొట్టెలు వేస్తూనే ఉన్నాడు. దాని టేస్ట్ ఇంక దేనికి రాదు అంటారు ఆ హోటల్ లో తినే వాళ్లు. ఫేమస్ అంటున్నారు రేటు ఎక్కువ అనుకుంటారేమో.. అందరికీ అందుబాటులో ఉండే ధరేనండి బాబు.. ఒక రొట్టె 30 రూపాయలు అంతే.. ఇలా ఓపాలి మా గోదావరి జిల్లాకు వచ్చారంటే మా పాలకొల్లు వచ్చి ఆ దిబ్బరొట్టే రుచి చూసి ఎల్లండి.. బాగుంటాదండి బాబు నన్ను నమ్మండి.

Satyam garu a 72 years old who is famous for dibba rotti
అన్నట్టు సెప్పడం మర్చిపోయానండి… మన దిబ్బరొట్టె ఎంత ఫేమస్ అంటే.. పాపులర్ చెఫ్ వికాస్ ఖన్నా గారు కూడా యూట్యూబ్ లో దిబ్బరొట్టే వేయడం నేర్చుకున్నాను దయచేసి ఈయన ఎక్కడున్నారో కొంత వెతకండి అంటూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేయడం అది బాగా పాపులర్ అవ్వడంతో మన సత్యంగారిని ఆయన ఈజీగా సంప్రదించగలిగారండి.. ఇక ఇప్పుడు కరోనా వైరస్ రావడంతో లాక్ డౌన్ కూడా ఎట్టేసారు కదండి అందుకని ఈ పెద్దాయన కోసం ఆయన గురుదక్షిణ కూడా సమర్పించారండి ఆయ్.. అంత ఫేమస్ అండి బాబు ఈ దిబ్బరొట్టె.. అన్నట్టు ఈ దిబ్బరొట్టెలోకి బెల్లంపానకం వేసుకుని తింటే ఉంటాదండి ఆ రుచే వేరండి ఆయ్…
This is our Article about Palakollu Famous Dibba Rotti. If you have any experiences then feel free comment below
Like us at Facebook ChuduBabai
Read Our article about Farmers
3,469 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022