Plasma Therapy.. The New Way of Corona Treatment

Plasma Therapy

కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో ఇప్పుడు ప్లాస్మా దానంపై విరివిగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకును సైతం ఏర్పాటు చేశారు. అదే విధంగా దేశంలో పలు చోట్ల ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ప్లాస్మా అంటే ఏంటి? ప్లాస్మాను ఎలా సేకరిస్తారు? కోవిడ్ రోగులకు ఎలా ఎక్కిస్తారు?

          కరోనా వైరస్ సోకగానే వ్యక్తి శరీరంలోని రోగనిరోధక కణాలు  (తెల్ల రక్త కణాలు) వైరస్ పై దాడి చేసి నాశనం చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో వైరస్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ రోగ నిరోధక కణాలు తక్కువగా ఉన్న వారిపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే ప్లాస్మా థెరపీని అందిస్తారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను వైరస్ తో బాధ పడేవారి శరీరంలోకి ఎక్కిస్తారు.

Plasma Therapy

          ప్లాస్మా దానం చేసే వ్యక్తి వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే దానం చేయాలి. ఆ వ్యక్తికి పలుసార్లు టెస్టులు చేసి అనంతరమే ప్లాస్మాను సేకరిస్తారు. ఆ వ్యక్తి శరీరంలో తెల్ల రక్త కణాలు సరైన మోతాదులో ఉన్నాయని నిర్ధారించుకునేందుకు ఎలీసా పరీక్ష చేస్తారు. రక్త కణాలు సరైనా మోతాదులో ఉండి దాత ప్లాస్మా ఇచ్చేందుకు అర్హుడని తేలిన అనంతరం ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. దీని ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి మిగిలిన రక్తాన్ని దాత శరీరంలోకి ఎక్కిస్తారు.

          ప్లాస్మాలో రోగ నిరోధక కణాలు అధికంగా ఉండడంతో ఆ విధానం ద్వారా కరోనా బారిన పడిన రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. తక్కువ లక్షణాలతో బాధపడుతున్న వారికి, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారికి ఈ ప్లాస్మా విధానం అవసరం లేదంటున్నారు వైద్యులు. కరోనా బారిన పడి ప్రాణాపాయం ఉన్నవారికి మాత్రమే ప్లాస్మా చికిత్స చేస్తున్నారు.

Plasma Therapy

          దాత నుంచి 800ML ప్లాస్మాను సేకరించి ప్రాణాపాయం ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్నారు. 200మిలీ గా విభజించి దానిని నలుగురు రోగులకు అందిస్తున్నారు. దాని ద్వారా రోగి శరీరంలో రోగ నిరోధక కణాలు పెరిగి వైరస్ ను నాశనం చేసేందుకు తోడ్పడతాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి 14 నుంచి 28 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్లాస్మాను సేకరిస్తారు. అలా సేకరించిన ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలా ప్లాస్మా చికిత్స తీసుకున్న 2 నుంచి 3 రోజుల్లో కోలుకునే అవకాశముంది. ఇప్పటికే దేశంలో కొన్ని లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడంతో వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మాను దానం చేయాలని కోరుతున్నారు.  

Like our Facebook page Chudu Babai

The Supply Chain of Covid Vaccine Read Here

 1,533 Total Views,  3 Total Views Today

Comment Your Views