చిక్కుల్లో బిగ్ బాస్ సరయు

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది స్టార్స్ అయిపోయారు. కొందరు అమ్మాయిలు పాజిటివ్ గా పేరు సంపాదించుకుంటే.. మరికొందరు నెగిటివ్‌గా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో యూట్యూబర్ సరయు ఒకరు. ఎదుటివారు ఏం అనుకుంటారో అలోచించకుండా.. తాను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘7ఆర్ట్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా పరిచయమైన ఆమె… బోల్డ్ డైలాగ్స్‌తో కొత్త ట్రెండ్‌కు తెరదీసింది. గతంలో యూట్యూబర్ సరయు మాట్లాడే భాషపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెలువెత్తాయి. అయినప్పటికీ తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.

‘7ఆర్ట్స్’ పేరుతో సరయు, ఆమె బృందం ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రమోషన్‌లో భాగంగా సరయు ఓ షార్ట్ ఫిల్మ్‌ను తీశారు. ఈ వీడియోను గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని సరయుపై విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఆ వీడియో హైదరాబాద్‌లో చిత్రీకరించినట్లు తేలడంతో.. కేసును బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. సరయు, ఆమె బృందం గణపతి బప్పా బొరియా అని రాసి ఉన్న రిబ్బన్లు తలకు కట్టుకుని 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ లోపలికి వెళ్తారు. వీడియోలో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని సరయుపై, షార్ట్ ఫిల్మ్ బృందంపై విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్‌ సిరిసిల్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ సీన్‌లో మద్యం సేవించి హోటల్‌కు వస్తారన్న ప్రచారం సైతం జరుగుతోందని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సిరిసిల్ల పోలీసులు.. ఫిలింనగర్‌లో వీడియోను తీసినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. సరయుతో పాటు ‘7 ఆర్ట్స్’ బృందంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సరయుకు సీఆర్పీఎస్ నోటీసు అందించిన బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ ఐ అర్ నమోదు చేసి కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా సరయు ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ అమ్మడు.. బిగ్ బాస్‌లో కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. ఆమె ఎలిమినేషన్ వల్ల చాలా మంది నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో ఆమె ఎలిమినేషన్‌పై అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంత్‌లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. షణ్ముఖ్‏కి దమ్ముంటే మగాడిలా ఆడాలని.. లేదంటే గాజులేసుకుని కూర్చోవాలని వ్యాఖ్యానించింది. అలాగే సిరి మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ సరయు విమర్శించింది.

Read our another article on Fish Attack on Fisherman

Like Our Facebook Page ChuduBabai

 834 Total Views,  1 Total Views Today

Comment Your Views