Situation of Job Holders who lost Job in Lock Down

కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టి మన మీదే పడుతోంది. చదువుకుంటున్న వాళ్ల సమస్య ఒకటైతే.. చదువు పూర్తయ్యి జాబ్ లేని వాళ్ల సమస్య మరొకటి. ఇక జాబ్ చేస్తూ లాక్డౌన్ అని ఇంటికి వచ్చిన వారి కష్టాలు పగ వాడికి కూడా రాకూడదు.

Situation of Every Job Holder who lost Job in Lock Down


ఏరా అబ్బాయ్ ఏంటి పరీక్ష లేకుండానే పాస్ అయిపోయావంట..
కరోనా కల్లోలం సృష్టిస్తుండడంతో స్కూల్స్, కాలేజీలకు ఎప్పుడు లేని అన్ని సెలవులు వచ్చేసాయి. ఇక ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం కష్టమంటూ ప్రభుత్వాలు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసేశాయి. దీంతో ఇప్పుడు అందరూ ప్రభుత్వాలకు ధ్యాంక్స్ చెప్తూ లైఫ్ ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. కనీసం పాస్ మార్కులు కూడా రావు అన్న మాకు అలాంటిది ఇప్పుడు పాస్ అయిపోయాం అంటూ ఎగిరి గంతేస్తున్నారు టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్. ఏ వాళ్లేనా స్టూటెండ్స్ మేము కాదా అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్. వాళ్లకి పరీక్షలు రద్దు చేసినట్టు మాకు కూడా రద్దు చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు.


నీకింకా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉందేంట్రా…
చదువు పూర్తవ్వగానే అందరి నోటా వినిపించే మాట.. ఏం చేస్తున్నావ్.. ఏం చేస్తున్నావ్… మా అమ్మాయి/ అబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరిపోయింది/ చేరిపోయాడు. నీకింకా ఉద్యోగం రాలేదా అని సూటిపోటి మాటలతో దొబ్బే బీరకాయ చుట్టాలు ఎక్కువైపోతారు. ఇక ఈ టైంలో పాపం వాళ్ల గోల అసలు అర్థం కావడం లేదు. మనకి ఉద్యోగం లేదు అన్న బాధ మనకన్నా పాపం వాళ్లకే ఎక్కువ ఉన్నట్టుంది.
ఏం లేదు బాబాయ్ నీ కొడుక్కి టైం వచ్చింది ఉద్యోగానికి పోయాడు.. నాకు టైం వస్తుంది… నిన్న రాలేదు ఈ రోజు వస్తుంది అనుకున్నా… రాలేదు రేపు లేదా ఎల్లుండి ఏదొక రోజు నాకు ఉద్యోగం రాకపోతుందా చెప్పు.. నాకన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది..
ఇప్పుడు కరోనా కారణంగా ఉన్న వాళ్లకే జాబులు తీసేస్తున్నారట.. నీకు ఏదైనా దొరుకుతుంది అంటావా అంటూ పాపం బాధపడుతున్నారు.


బాబాయ్ ముందు నువ్వు ఆ వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ లు చూడడం మానేసేయ్..
ఉరేయ్ అబ్బాయ్.. ఏంటి మన సుబ్బారావు కొడుకు ఉద్యోగం పోయిందంటా.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్లందరినీ పంపేస్తున్నారంట.. అంటే వీడి ఉద్యోగం కూడా పోతుందంటావా.. నాకు ముందే తెలుసురా.. ఆ ట్రంప్ గురించి. అనుకున్నంత మంచోడు కాదేహే.. ఏదో మొన్న మన దేశానికి వచ్చి పొగిడేశాడు కానీ పొగ పెడతాడని. పాపం ఆ సుబ్బారావు.. లక్షలు ఖర్చు పెట్టి కొడుకుని చదివించుకుని అమెరికా పంపాడు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.. వాడిని చూస్తుంటే జాలి వేస్తోందిరా…
ఇంతకీ బాబాయ్ వాడి ఉద్యోగం పోయినట్టు ఎవరు చెప్పారు..
అదేరా ఇందాకా వాట్సాప్ లో ఎవరో పంపారు.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులను పంపేస్తున్నారని.. అంటే వీడి ఉద్యోగం కూడా పోయినట్టే కదా..
బాబాయ్.. నువ్వు ముందు ఆ వాట్సాప్ మెసేజ్ లు చూడడం మానేసేయ్.. అదంతా ఫేక్ బాబాయ్… అందరి ఉద్యోగాలు పోవు.. అయినా వాడేమి చిన్నా చితకా కంపెనీలో పని చేయడంలేదు.. వాడి పొజిషన్ కూడా పెద్ది ఆఫీస్ లో అంత తొందరగా వాడి ఉద్యోగం పోదు.. ఒకవేళ అక్కడ నుంచి పంపేసినా.. ఇక్కడ చేసుకోవచ్చు..

ఏరా నీ ఉద్యోగం ఉంటుందంటావా…
నా ఉద్యోగం ఉందో లేదో నాకే తెలీదు.. తెలిసిన వెంటవే ఫస్ట్ నీకే చెప్తా ఓకేనా..
దేశంలో వైరస్ విజృంభించకుండా మొదట్లో పెట్టిన లాక్ డౌన్ తో ఇంటికి వచ్చేసిన వాళ్ల సమస్యలు వర్ణనాతీతం. ఎందుకంటే కొంత మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నా కొంత మందికి ఆ అవకాశం లేకపోవడంతో ఇప్పుడు జాబ్ ఉందో లేదో తెలియని పరిస్థితి. జనతా కర్ఫ్యూ ముందు రోజే చాలా మంది ఇంటికి వచ్చేశారు. బ్రతికుంటే బలుసాకు తినొచ్చులే అని.. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసినా వర్క్ ప్లేస్ కి వెళ్లాలంటేనే భయమేస్తోంది. అక్కడ కేసులు పెరుగుతుండడంతో ఇంట్లో వాళ్లు కూడా జాబ్ కి పంపడానికి భయపడుతున్నారు. దీంతో వాళ్ల జాబ్ లు ఉన్నాయా లేవా అనే డౌట్ ఉంది చాలా మందికి. అక్కడికి వెళ్లలేం.. అలా అని ఇక్కడ ఖాళీగా ఉంటూ ఖాళీ బాటిల్స్ లో నీళ్లు నింపలేం.. ఒక్కోసారి భయం వేస్తోంది.. ఇప్పటికే నాలుగు నెలలు దాటింది.. మనం చేసే పని అయిన గుర్తుంటుందా అని…

మీకు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఉంటే మాతో పంచుకోండి..

Like our Facebook page chudubabai

Know about Palakol Famous Dibbarotte

 3,176 Total Views,  1 Total Views Today

Comment Your Views