రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..?

రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..?

ప్రపంచంలో అతిపెద్ద, అతి పురాతనమైన రవాణా వ్యవస్థ ఉందంటే అది రైల్వే మాత్రమే.. ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో చాలా దేశాల్లో ఫాస్ట్ రైళ్ల నుంచి బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రైల్వే నెట్‌వర్క్ చరిత్ర గ్రీస్‌ దేశంతో ముడిపడి ఉంది. 6వ శతాబ్దం నుంచి రైలు నెట్‌వర్క్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఇక ప్రపంచంలోని వందలాది దేశాలలో రైల్వే నెట్‌వర్క్ అత్యంత ఆదరణ పొందిన రవాణా వ్యవస్థ. ఇంత ఘనత ఉన్నప్పటికీ చాలా దేశాల్లో ఇప్పటికీ రైల్వే నెట్‌వర్క్ లేని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అండోరా

అండోరా.. జనాభా పరంగా ప్రపంచంలో 11వ అతి చిన్న దేశం విస్తీర్ణం పరంగా 16వ స్థానంలో ఉన్న ఈ దేశంలో రైల్వే నెట్‌వర్క్ లేదు. సమీప రైల్వే స్టేషన్ ఫ్రాన్స్‌ దేశంలో ఉంది. ఫ్రాన్స్ నుంచి అండోరా చేరుకోవడానికి బస్ సౌకర్యం మాత్రమే ఉంది.

భూటాన్

భూటాన్ దక్షిణాసియాలోని అతి చిన్న దేశం. ఇప్పటివరకు ఈ దేశంలో రైల్వే నెట్‌వర్క్ లేదు. ఈ దేశంలో దక్షిణ భాగాన్ని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. నేపాల్ లోని టోరిబరీని  పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాతో కనెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సైప్రస్

ఈ దేశంలో 1905 నుంచి 1951 వరకు రైల్వే నెట్‌వర్క్ ఉన్నా ప్రస్తుతం ఎలాంటి రైలు రవాణా లేదు. గతంలో 76 కిలో మీటర్ల మేర ఉన్న రైల్వే లైన్.. 39 స్టేషన్ల గుండా ప్రయాణించేంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో రైలు రవాణాను నిలిపివేశారు.

తూర్పు తైమూర్

ఈ దేశంలో రవాణా సౌకర్యంతో పాటు.. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించాలి అంటే అది కేవలం రహదారిపైనే ఉంటుంది. పైగా ఈ దేశంలో రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉంటాయి.

గినియా-బిస్సౌ

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఈ దేశంలోనూ రైల్వే నెట్ వర్క్ లేదు. 1998లో పోర్చుగల్‌తో ఈ దేశం ఒప్పందు కుదుర్చుంది. ఈ దేశంలో రైలు రవాణాకు సంబంధించి చేసుకున్న ఈ ఒప్పందం ఇప్పటి వరకు కార్యారూపం దాల్చలేదు.

ఐస్లాండ్

ఈ దేశంలో మూడు రైల్వే నెట్‌వర్క్‌లు ఉన్నా.. పబ్లిక్ రైల్వే నెట్‌వర్క్ లేదు. 1900ల ప్రారంభంలో ఈ దేశంలో రైల్వే నెట్‌వర్క్ కోసం ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేసినా.. అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. 2000వ సంవత్సరంలో దేశ రాజధానిలో రైలు ట్రాక్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కువైట్

ప్రపంచంలో చమురు నిల్వలు అధికంగా ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ రైల్వే నెట్‌వర్క్ లేదు అంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం ఈ దేశంలో అనేక రైల్వే ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. కువైట్ సిటీ – ఒమన్ మధ్య 1200 మైళ్ల పొడవైన గల్ఫ్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రణాళిక రూపొందించారు.

లిబియా

లిబియాలో అంతర్యుద్ధం సమయంలో ఈ దేశంలో ఉన్న అన్ని రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. దీంతో 1965 నుంచి ఈ దేశంలో రైలు రవాణా నిలిచిపోయింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి..

రైలు

ఈ దేశాలతో పాటు.. ప్రపంచంలో వివిధ దేశాలలోనూ రైలు ప్రయాణం జరగడం లేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు. ఆయా దేశాలు ఆర్ధిక పరిస్థితుల కారణంగా అక్కడి ప్రజలకు రైలు ప్రయాణం అందడం లేదు. వాటిలో మాల్టా, మార్షల్ దీవులు, సోలమన్ దీవులు,  మైక్రోనేషియా, సురినామ్, నైజర్, మకావు, ఒమన్, ఖతార్, వనాటు, శాన్ మారినో, మారిషస్, రువాండా, సోమాలియా, ట్రినిడాడ్, టొబాగో, తువాలు, టోంగా మరియు యెమెన్‌లలో కూడా రైలు నెట్ వర్క్ లేదు. 

గాల్లో రైలు ప్రయాణం చేయాలనుందా అయితే కశ్మీర్‌ వెళ్లాల్సిందే.. కశ్మీర్‌లో భూతల స్వర్గం

Like Our Facebook Page ChuduBabai

 1,512 Total Views,  1 Total Views Today

Comment Your Views