మీ స్నేహితుడు మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు గడువు పూర్తైనా కూడా చెల్లించడం లేదు ఒకసారి మీరు చెప్పండి.. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా.. ఈ మధ్య ఇలాంటి కాల్స్ చాలా మందికి తరచుగా వస్తునే ఉన్నాయి. ఎవరో అప్పు తీసుకుంటే మీ నెంబర్ కి కాల్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే వెంటనే చదవాల్సిందే.
లాక్ డౌన్ లో చాలా మందికి డబ్బులు సరిగా సమకూరడం లేదు. ఎక్కడా జాబ్స్ దొరకకపోవడం, అప్పు పుట్టకపోవడంతో యువత ఇప్పుడు ఆన్ లైన్ లో అప్పులు ఇచ్చే యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఆకర్షణీయమైన యాడ్స్, తో యువతను బుట్టలోకి దించుతున్నారు. మీకు డబ్బు అవసరమా.. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా క్షణాల్లో అప్పు పొందండి అంటూ యువతను మాయ చేస్తున్నారు. దీంతో అవసరమైన వెంటనే డబ్బులు దొరుకుతుండడంతో ఇప్పుడు యువత మొత్తం ఈ యాప్స్ వెంట పడుతున్నారు. చెప్పినట్టుగానే క్షణాల్లో డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి.
బ్యాంకులలో లౌన్ అప్లై చేసినా రుణగ్రహితలు తిరిగి చెల్లిస్తారో లేదా అనే అంశాలను బట్టి మాత్రమే లోన్ మంజూరు చేస్తారు. అయితే ఇలాంటి పేపర్ వర్క్ లేకుండానే స్టూడెంట్ లోన్ యాప్స్ అడిగిన వెంటనే లోన్ ఇచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. వడ్డీ చెల్లింపులో ఆలస్యమైతే బెదిరింపులకు పాల్పడుతున్నారు.
అడిగిన వెంటనే అఫ్పులు ఇచ్చేస్తున్న ఈ సంస్థలు వడ్డీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలో అప్పు తీసుకునే వ్యక్తి డిటైల్స్ తో పాటు స్టూడెంట్ ఐడీ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్ ద్వారా 500 నుంచి 10 వేల రూపాయల వరకు అప్పు తీసుకునే వీలు కల్పిస్తున్నాయి. దీంతో అడిగిన మొత్తాన్ని క్షణాల్లోనే అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాయి. అప్పు చేసిన డబ్బు తిరిగి కట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
అప్పు చెల్లించడంలో ఆలస్యమైతే యాప్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలోనే కాంటాక్ట్స్, లోకేషన్ తదితర వివరాల కోసం యాప్ అనుమతులు కోరుతుంది. ఇవేమి పట్టించుకోకుండా పర్మిషన్ ఇచ్చేస్తుండడంతో మన ఫోన్ లోని కాంటాక్ట్స్ డిటైల్స్ దోచేస్తున్నారు. రుణం చెల్లించాల్సిన గడువు తేదీకి ఒక వారం ముందు మెసేజ్ పెడుతున్నారు. గడువు తేదీలోపు అప్పు చెల్లించకున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకున్నా మీ కాంటాక్ట్ లిస్ట్ మా దగ్గర ఉంది గంటలోపు చెల్లించకపోతే మీ కాంటాక్ట్స్ కు ఫోన్ చేసి మీ బండారం మొత్తం బయటపెడదాం అంటూ బెదిరిస్తున్నారు.
వాళ్లు చెప్పినట్టుగానే వారి కాల్ డేటా ఆధారంగా ఎవరితో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యారో తెలుసుకుని వారికి కాల్ చేసి చెబుతున్నారు. దీంతో స్నేహితులు, బంధువులు దగ్గర పరువు పోతుందని భయపడుతున్న యువత తీసుకున్న అప్పు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొంత మంది యువత తప్పుదారి పడుతున్నారు. అప్పు విషయం ఇంట్లో చెప్పలేక దొంగతనాలు, సైబర్ క్రైంలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి,
Like us at Facebook Chudubabai
Read our another article on Palakollu Dibba Rotti
1,819 Total Views, 1 Total Views Today
- Vennello Kalisina Aadapilla Episode – 2 - July 29, 2022
- Vennello Kalisina Aadapilla - July 22, 2022
- Think Before Using Money Lending Apps - November 15, 2020