Tholi Prema

Ram an IT employee who falls in love with Rabina when he saw her for the first time. Being an orphan he got his first love “tholi prema” from Rabina

Tholi Prema
Tholi Prema

Place: Hyderabad

Time: 2.42Pm

అప్పటికి ట్రాఫిక్ అంతగా లేదు. సిటీలోని ఒక పెద్ద బిల్డింగ్ లో 12th ఫ్లోర్‎లో నిలబడి ఉన్నాడు రామ్. అక్కడే ఉన్న కెఫెటేరియాకి గత మూడు రోజులుగా వస్తున్నాడు. అలానే ఆ రోజు కూడా వచ్చి కెఫెటేరియాలో కళ్లు తుడుచుకుంటూ ఒక టేబుల్ దగ్గరకి వెళ్లి కుర్చున్నాడు. చూడడానికి కొంచెం ఎదో కోల్పోయిన వాడిలా కనిపిస్తున్నాడు. రామ్ ఆర్డర్ చేసిన కాఫీ తన ముందుకు వచ్చింది. తన కళ్లలోంచి వచ్చే కన్నీటి బొట్లు ఆ వేడి కాఫీ కప్పు సాసర్ ని తాకే సరికి ఆవిరి అవుతున్నాయి. కాఫీ అంత వేడిగా ఉన్నా ఏదో ఆలోచిస్తూ అలా కాఫీ తాగుతూనే ఉన్నాడు.

కాఫీ తాగడం పూర్తయ్యాకా ఏమీ జరగనట్టు అక్కడే ఉన్న టిష్యూ పేపర్‎తో కంటిలో నలక పడినట్టు తుడుచుకుని, ఎర్రగా ఉన్న కళ్లు ఎవరికి కనిపించకుండా ఉండేందుకు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, బిల్లుతో పాటు 40% టిప్పుగా వదిలేవాడు. కెఫెటేరియా నుంచి వెళ్తూ 12వ అంతస్తు చిగురంచున నిలబడి ఏదో ఆలోచిస్తూ వెళ్లిపోయేవాడు. గడిచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది కానీ రామ్ ముఖంలో ఎలాంటి తేడా కనిపించడం లేదు.

తను బాధపడుతున్నట్టు కానీ ఆ బాధకి కారణం కానీ ఎవ్వరికి తెలియనివ్వడంలేదు. పైకి మాత్రం మామూలుగానే ఉంటున్నాడు. మగవాడు ఏడవటం ఏంటి అన్న అహమో లేదా ఎవరిముందైనా ఏడిస్తే బాగోదు అనుకున్నాడో ఎంటో మరి ఎవరికి ఏమీ చెప్పకుండా తానలో తానే బాధపడుతున్నాడు.  సహజంగానే ఎవరితోనూ అంత స్నేహంగా ఉండేవాడు కాదు రామ్. అలా అని అంత దూరంగానూ ఉండేవాడు కాదు.. అమ్మాయల విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువ. ఇంగ్లీష్ లో ఇంట్రోవెర్ట్ అంటారే అలా. అందరికి “రామ్” అంటే మంచివాడు, మంచి జీవితం అంతే.

ముందు రోజు రాత్రి ఇంట్లో వెక్కి వెక్కి ఏడ్చాడు.  మళ్ళీ  మామూలే  కళ్ళుతుడుచుకొని 4వ  రోజూ కెఫెటేరియా కి వచ్చాడు .కాఫీ తాగాడు,కళ్ళు తుడుచుకున్నాడు. కానీ ఈసారి ఏంటో 40% కాదు పర్సు అంతా ఖాళీ చేసి టిప్పుగా ఇచ్చాడు. ఎప్పటిలా చిగురుకి వెళ్ళాడు. కాని …….. బుర్రలో ఎం ఆలోచన వచ్చిందో ఈసారి తొం‎గిచూసి అలానే కిందకి దూకేశాడు.

ఒక్కసారిగా పెద్ద శబ్దం.. రోడ్డంతా రక్తం.. ఫాస్ట్‎గా కదులుతున్న ట్రాఫిక్ కూడా కాస్త నెమ్మదించింది. కార్లలో వెళ్లే వాళ్లందరూ అద్దాలను డౌన్ చేసుకుని ఏం జరిగిందా అని కిందకి తొంగి చూస్తున్నారు. కానీ అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. సిటీలో వెళ్తున్న పెట్రోలింగ్ వెహికల్ నుంచి పోలీసులు దిగారు. రామ్ చేతిలో ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నాడు అని పోలీసులు కన్ఫార్మ్ చేసుకున్నారు.

********************

DATE: 16-07-2018

TIME: 8:30 AM

రామ్ ఆఫీస్ కి తన బైక్ మీద బయల్దేరాడు. ఎప్పుడు రోడ్ ను చూస్తూ వెళ్లే తన కళ్లు ఈసారి చూపు తిప్పుకున్నాయి. మొదటిసారిగా ఆ కళ్లు ఎప్పుడూ చూడనటువంటి అందమైన కళ్లను చూసి ప్రేమలో పడ్డాయి. అప్పటి వరకు అమ్మాయిలను చూస్తేనే సిగ్గు పడే రామ్ మొదటిసారి తనని చూసి ప్రేమలో పడిపోయాడు. కానీ జరుగుతున్నది అంతా కొత్తగా అనిపిస్తోంది. ఆ ఫీలింగ్ కూడా రామ్‎కి చాలా కొత్తగా అనిపించింది. కానీ ఆఫీస్ కి వెళ్లే టైం అయిపోవడంతో అక్కడి నుంచి అన్యమనస్కంగానే బయల్దేరిపోయాడు.

DATE: 16-07-2019

PLACE: RESTAURANT

రామ్‎కి ఆకలిగా ఉండడంతో తన రూమ్‎కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‎కి వెళ్లాడు. అక్కడే మళ్లీ అవే అందమైన కళ్లవైపు తన కళ్లు చూపు తిప్పుకున్నాయి. ఇక ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏదో వర్ణించలేని ఒక ఫీలింగ్ చాలా గొప్పగా అనిపించింది. కనిపించడానికి రామ్ చాలా ప్రశాంతంగా ఉన్నా మనసు మాత్రం సముద్రపు అలలాగే ఎగురుతోంది. అప్పటిదాకా ఆమెను అలా చూస్తూ ఉన్న రామ్.. తను వెళ్లిపోతుంటే మాత్రం చాలా బాధపడ్డాడు. అప్పటిదాకా ఎగసిపడ్డ కెరటం ఒడ్డుకొచ్చినట్లుగా…

ఆ తర్వాత చాలా సార్లు ఆమె రామ్‎కి చాలా సార్లు తారసపడింది.

********************

అబ్బాయి చూస్తున్నాడు అంటే అమ్మాయికి ముందే తెలుస్తుంది అంటారు. అది నిజం చేసినట్టుగా రెస్టారెంట్‎లో రామ్ తనని చూస్తున్నప్పుడే తను కూడా ఐమూలగా చూసింది. అప్పటినుంచి ఆమె కనిపిస్తే చూడడం కాకుండా ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూసేవాడు రామ్. తన పేరు తెలుసుకోవడం కోసం కూడా చాలా కష్టపడ్డాడు.

దేవుడు ఉన్నాడు అనే సందర్భం తనకి ఎదురైంది అనుకున్నాడు రామ్. ఆకలి వేయడంతో రామ్ తను ఎప్పుడూ వెళ్లే రెస్టారెంట్‎కి వెళ్లాడు. అక్కడ ఆమెతో తన ఫ్రెండ్ సిధ్ మాట్లాడడం చూసి సంతోషంతో తన మనసు గాలిలో గంతులేసింది. అక్కడి వెళ్లి తన ఫ్రెండ్ తో మాటలు కలిపాడు తన పేరు తెలుస్తుందేమోనని. రామ్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మాటల సందర్భంలో ఆమె పేరేంటని తన ఫ్రెండ్‎ని అడిగినా తెలియదనడంతో మాట మార్చేశాడు. బయటకు వెళ్లాకా ఒకబ్బాయితో కలిసి వెళ్లడం చూసి కొంచెం ఈర్ష్య పడ్డాడు. ఫ్రెండ్ అయి ఉంటాడులే అని తనకి తను సర్దిచెప్పుకున్నాడు.

మొదటిసారి రామ్ ఒకమ్మాయి పేరు అడిగాడు అని షాక్ అయిన సిధ్ ఇక రామ్ ని ఏడిపించడం ఎందుకు అని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయాకా రబీనా అని పిలిచాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవర్ని పిలుస్తున్నావురా అడిగాడు రామ్. అదేరా నువ్వు అడిగిన అమ్మాయి పేరు అని చెప్పడంతో మనసులో సంతోషంగా ఉన్నా బయటకు మాత్రం నార్మల్‎గా ప్రవర్తించాడు సిధ్ ఏదైనా అనుకుంటాడేమోనని.

అప్పటినుంచి రామ్ రబీనాని తరచుగా చూసేవాడు. అలా అలా రబీనా గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. రబీనా పేరు తెలుసుకున్నప్పటి నుంచి రామ్ సిధ్‎కి చాలా కొత్తగా కనిపించాడు. అప్పటి నుంచి రబీనాని ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆఫీస్‎కి వెళ్తున్న రబీనాని కొంత మంది ఏడిపించడంతో వాళ్లని చితకబాదాడు. వాళ్లే వెళ్లి రబీనాకి సారీ చెప్పి అక్కడి నుంచి పరిగెత్తారు. కానీ ఏం జరిగిందో తెలియక రబీనా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఎన్ని రోజులు ఇలా ఫాలో అవడం అని రామ్ రబీనాతో మాట్లాడదాం అని ఫిక్స్ అయ్యాడు. రబీనా దగ్గరకి వెళ్లిన రామ్‎కి ఒకమ్మాయి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఏం మాట్లాడాలో అర్ధంకాక సారీ అండి నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఆ రోజ్‎ని ఆమెకి తిరిగి ఇచ్చేశాడు. ఆ మాటలు రబీనా వినడం చూసి రామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు రబీనాతో మాట్లాడదాం అని ఆమె ఉన్న ప్లేస్‎కి వెళ్లాడు. అప్పటికే రబీనా ఒకబ్బాయితో మాట్లాడుతోంది. రామ్ రావడం చూసి ఆ అబ్బాయితో క్లోజ్ గా భుజంపై చేయి వేసి మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసి రామ్ కోపడ్డాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి బాధగా అక్కడి నుంచి బయల్దేరాడు.

ఆమె గురించే ఆలోచిస్తూ తాను బైక్ మీద ఉన్నా అన్న విషయమే మర్చిపోయాడు. ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న రామ్ బైక్ స్కిడ్ అయింది. కిందపడిపోవడంతో దెబ్బలు కూడా తగిలాయి. రామ్ పడిపోవడం చూసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి హాస్పిటల్‎కు తీసుకెళ్లింది. అంత అందమైన కళ్లు తనకోసం కంగారుపడడం చూసి ఆనందపడ్డాడు. కానీ అప్పటికే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని గుర్తురావడంతో ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. సిధ్‎కి విషయం తెలియడంతో వెంటనే హాస్పిటల్‎కి వచ్చాడు. అక్కడే ఉన్న రబీనాని చూసి షాక్ అయ్యాడు.

డాక్టర్ రామ్‎ని ట్రీట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రామ్ రబీనాని చూసి ధ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ రబీనా అన్నాడు. దానికి ఆమె కొంచెం కన్ఫాజ్డ్ గా చూసి హా పర్లేదు ఇప్పుడు మీకు ఓకే కదా అని.. అవును ఇంతకీ రబీనా ఏంటి అని అడుగుతుండగా.. సిధ్ ఆమెను పక్కకి తీసుకెళ్లిపోయాడు. సిధ్ రబీనాని పక్కకి తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు రామ్‎కి.

హే నువ్వంటే వాడికి పిచ్చి. వాడు నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటి వరకు వాడు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ నువ్వంటే పడి చస్తున్నాడు. మొన్న నిన్ను ఎవరో ఏడిపించారు అని తెలిసి వాళ్లని చితకబాది వచ్చాడు అని చెప్పాడు సిధ్. అదేంటి తనకి ఆల్రేడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అడిగింది రబీనా. అదేం లేదు నాకు తెలిసి వాడి జీవితంలో మొదటి అమ్మాయివి నువ్వే అని చెప్పి రామ్ దగ్గరకి వచ్చేశాడు సిధ్. ఆ మాటలు ఎందుకో రబీనాకి చాలా సంతోషాన్ని కలిగించాయి.

అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? రబీనాని అడిగాడు రామ్. రబీనా నవ్వు ఆపుకుని మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది నీకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పావా అని అడిగింది. దానికి అయ్యో నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని రామ్ చెప్పగానే నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు అని సమాధానమిచ్చింది రబీనా. ఇందాకా నీతో మాట్లాడుతున్నది ఎవరు అని అడిగాడు రామ్. తను మా కజీన్ అటుగా వెళ్తూ నన్ను చూసి ఆగి మాట్లాడాడు అని చెప్పింది రబీనా. ఆ మాటలు విని చాలా సిగ్గు పడ్డాడు రామ్.రామ్ మాటల్లో రబీనాకి తనంటే ఎంత ఇష్టమో అర్ధమౌతుంది.

అలా మాట్లాడుతుండగా రామ్ కి నుదుటి పైన వేసిన కుట్లు విడిపోయి రక్తం రావటంతో రబీనా కంగారు పడింది. వెంటనే సిధ్ వెళ్లి డాక్టర్ని పిలవడానికి వెళ్లాడు. మళ్లీ కుట్లు వెయ్యాలి మత్తు ఇవ్వమని నర్స్ కి సజెస్ట్ చేశాడు. నర్స్ ఇంజెక్షన్ రెడీ చేయడాన్ని చూసి వద్దు నార్మల్‎గా కుట్లు వేయండి నాకేమీ పర్లేదు అని బలవంతపెట్టడంతో మత్తు ఇవ్వకుండానే డాక్టర్ కుట్లు వేసి వెళ్లిపోయాడు. డాక్టర్ వెళ్లగానే.. రామ్ రబీనా కళ్లలోకి చూసి I LOVE YOU నన్ను పెళ్లిచేసుకుంటావా? నేను ఎదో మత్తు లో ఉండి చెప్తున్న అనటానికి anesthesia కూడా లేదు” అని మెల్లగా నవ్వాడు.

ఆ మాటలు విని రబీనా కళ్లలోని నీళ్లు ఆపుకుంటూ హా చేసుకుంటా అని నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది. రామ్‎కి బ్లడ్ అవసరం కావడంతో రబీనాది కూడా సేమ్ బ్లడ్ కావడంతో ఇస్తానని టెస్ట్ చేయించుకుంది. కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండడంతో బ్లడ్ ఇవ్వడం కుదరలేదు. అప్పటికే డోనర్ దొరకడంతో బ్లడ్ ఎక్కించారు. రామ్‎ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకునేందుకు డాక్టర్ దగ్గరకి వెళ్లింది.

డాక్టర్ తో మాట్లాడి వచ్చి రామ్ దగ్గర కూర్చొని మాటలు కలిపింది రబీనా. ఈలోపు నర్స్ వచ్చి మీరు రేపు డిశ్చార్జ్ అవ్వొచ్చు అని చెప్పి వెళ్లిపోయింది. సెలైన్ పెట్టిన రామ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడింది రబీనా. నేను రేపు వస్తా సిధ్ జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సిధ్ రామ్ తో రబీనా ని పంపించి వస్తా అని చెప్పి బయటకి వెళ్లాడు. రూమ్ లోంచి బయటకి వచ్చాక సిధ్ ఆమెతో “అదేంటి నీ పేరు రబీనా కాదు అని వాడికి ఎందుకు చెప్పలేదు ?”అని అడిగాడు. నీ ఫ్రెండ్ వన్ సైడ్ లవర్ గా ఫీల్ అవుతున్నాడుగా అలానే బాగుంది.. పెళ్లయ్యాకా అప్పుడే నిజం తెలుసుకుంటాడు అని బై చెప్పి వెళ్లిపోయింది.

అలా కొన్ని రోజులు ఆనందంగా గడిచాయి. కొన్ని రోజులు తర్వాత రబీనా రామ్‎ని కలవడానికి రావడం లేదు. రబీనా ఎక్కువగా కనిపించే అన్ని ప్లేస్‎లు తిరిగి వెతికాడు కానీ ఎక్కడా తన జాడ కనిపించలేదు. సిధ్ ని అసలేం జరిగిందే కనుక్కోమని చెప్పి తాను వెతకడం ప్రారంభించాడు. ఆ తర్వాతి రోజు సాయంత్రం సిధ్ ఏడుస్తూ వచ్చి రబీనా పెళ్లిరా అని చెప్పి రామ్‎ని హగ్ చేసుకున్నాడు. అదేంటిరా నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చింది కదా అని బెడ్ మీద కూలిపోయాడు.

వాళ్ల పేరేంట్స్ కుదిర్చిన సంబంధం అంటరా అందుకే కాదనలేకపోయా అంటూ బాధపడింది అన్నాడు సిధ్. ఎవరినీ బాధ పెట్టకూడదు అనే మనస్తత్వం కలిగిన రామ్.. రబీనా పేరేంట్స్‎తో మాట్లాడేందుకు కూడా వెళ్లలేదు. రబీనాని మర్చిపోయే ప్రయత్నాలు చేస్తాడు కానీ తొలిప్రేమ కదా.. కుదరడం లేదు. ఎంతకి తన బాధ తగ్గకపోవడంతో రామ్ రబీనా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సిధ్‎ని అడ్రస్ అడిగి రబీనా ఇంటికి వెళ్లాడు రామ్. గుమ్మంలో ఉన్న రబీనా ఫాదర్ ని చూసి అంకుల్ నేను మీ అమ్మాయి ఫ్రెండ్‎ని తనకు పెళ్లి కుదిరింది అని విన్నాను, ఇంట్లోనే ఉందా అని అడిగాడు రామ్.

ఆ మాట నిజమైతే.. చాలా బాగుండేది బాబు. కానీ దానికి ఆ అదృష్టం లేదు అని రబీనా ఫాదర్ చెప్పగానే.. ఏమయ్యింది అంకుల్ ఎందుకు బాధపడుతున్నారు.. అదృష్టం లేకపోవడం ఏంటి అర్ధం అయ్యేలా చెప్పండి అంకుల్ అని అడిగాడు రామ్.  ఆయన రామ్ తో “అవును బాబు మా అమ్మాయికి ఎదో టెర్మినల్ డిసీస్ అట ఫైనల్ స్టేజి అని డాక్టర్స్ చెప్పారు”అని అనడంతో రామ్ కి ప్రాణం పోయినట్టు అనిపించి వెంటనే అక్కడి నుంచి లేచి కళ్లు తుడుచుకుని వెళ్లిపోయాడు. రూంకి వెళ్లి సిధ్ చెంపపై కొట్టి ఎందుకురా అబద్ధం చెప్పావ్ అంటూ సిధ్ ని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు.

సిధ్ రామ్ ని ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తూ “రబీనా నే అలా చెప్పమంది రా…  అలా అయినా నువ్వు తనని మర్చిపోతావు అని అన్నాడు సిధ్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రామ్ ఇక తన జీవితం అంతా రబీనానే అని కలలు కన్నాడు రామ్. రబీనా కోలుకోలేని జబ్బుతో బాధపడుతోంది అని తెలుసుకుని గుండె పగిలేలా ఏడుస్తున్నాడు రామ్. వెంటనే తన దగ్గరకి తీసుకెళ్లరా ప్లీజ్ అని చెప్పడంతో సిధ్, రామ్ హాస్పిటల్ కు బయల్దేరారు.

రబీనాను హాస్పిటల్ బెడ్‎పై ఆక్సిజన్ పైప్‎తో చూడగానే తాను ఊహించుకున్న కలల ప్రపంచం ఇప్పుడు తన ముందు చిమ్మచీకటిలా కనిపించింది. మాట్లాడడానికి తనకి ఓపిక లేకపోయినా.. రామ్ నువ్వు సంతోషంగా ఉండాలి.. ఎప్పటిలా నవ్వుతూ ఉండాలి నాకోసం ఒక్కసారి నవ్వవా ప్లీజ్ అడిగింది రబీనా. బాధని దిగమింగుకొని రామ్ నవ్వటానికి ప్రయత్నించాడు. కానీ కళ్ళలోంచి నీళ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అని మాట ఇవ్వు రామ్ అని చెయ్యి పైకి లేపింది. రామ్ మాట ఇవ్వలేక ఇద్దాం అనుకున్నపుడే పల్స్ మోనిటర్ బ్లింక్ అవ్వటం తో రామ్ కంగారుగా డాక్టర్ ని పిలిచాడు. డాక్టర్ వచ్చి రామ్ ని  బయట వెయిట్ చెయ్యమని చెప్పడంతో కంగారుగా బయటే ఉండిపోయారు రామ్, సిధ్. డాక్టర్ బయటకి వచ్చి ఆమె కోమా లోకి వెళ్ళిపోయింది ఆమె పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వెళ్లిపోయాడు. రామ్ ఆశగా చూస్తూ “కోమా లోంచి ఎప్పుడు బయటకి వస్తుంది డాక్టర్ “అని అడగ్గానే.. డాక్టర్ అడ్డంగా తలూపి అక్కడి నుంచి వెనక్కి చూడకుండా రూంలోకి వెళ్లిపోయాడు.

రబీనా పేరేంట్స్ అక్కడికి వచ్చి రామ్‎ని కలిసి డాక్టర్ దగ్గరకి వెళ్లారు. మ్యాక్జిమమ్ మరో 4 రోజులు వెంటిలేటర్ పై పెట్టగలం.. అంతే కానీ ఏ ప్రయోజనం లేదు అని చెప్పాడు డాక్టర్. దీంతో బయటకి వచ్చిన రామ్ నాలుగు రోజులకి బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్తుండగా నర్స్ వచ్చి.. సర్ ఇవి పేషెంట్ వస్తువులు అని చెప్పి ఓ బ్యాగ్ ఇచ్చింది. అందులో ఒక లెటర్ తీసి చదవడం స్టార్ట్ చేశాడు రామ్.

“జులై 16,2018 ఉదయం 9:40 నిమిషాలు నా కళ్ళు మొట్ట మొదటిసారి అంత అందమైన కళ్ళని చూశాయి– నీ రబీనా “

వెంటనే రామ్ పరుగు పరుగున వెళ్లి రబీనా కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు. అలా రామ్ మూడు రోజులు రబీనా పక్కనే ఉన్నాడు.. డాక్టర్ వచ్చి ఆక్సిజన్ పైప్ తీసే టైంకి మాత్రం తాను అక్కడ లేడు.

Like our Facebook Page Chudubabai

Meet the man behind India’s First ever Handloom Flag- Read Here

 3,437 Total Views,  1 Total Views Today

Comment Your Views