
TRP Ratings
న్యూస్ ఛానెళ్లకు డబ్బులు ఎలా వస్తాయి? అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఆ ఎలా వస్తాయి యాడ్స్ ద్వారా వస్తాయి ఆ మాత్రం మాకు తెలీదా!.. మరి అన్ని ఛానెళ్లకు అన్ని యాడ్స్ ఎందుకు రావు? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. టీవీ ఛానెళ్లకు వచ్చే రేటింగ్స్ బట్టి ఆయా సంస్థలు యాడ్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ టీఆర్పీ రేటింగ్స్ పై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.
బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్). న్యూస్ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ లు ఇచ్చే సంస్థ. టీవీ ఛానెళ్లకు ఎంత ప్రజాదరణ ఉందో కనిపెట్టేందుకు బార్క్ సంస్థ పని చేస్తుంది. టీవీ ఛానెళ్లకు రేటింగ్స్ ఇచ్చేందుకు ఈ సంస్థ ఓ పద్దతిని పాటిస్తుంది. ఎంపిక చేసిన నగరాల్లోని కొన్ని ఇళ్లలో ప్రత్యేకమైన మీటర్లను ఏర్పాటు చేస్తుంది. ఆ మీటర్ల ఆధారంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంతసేపు ఏ ఛానెల్ చూశారు అన్న దాన్ని బట్టి రేటింగ్స్ ఇస్తుంది.
ఈ పద్ధతి తెలుసుకున్న కొన్ని టీవీ ఛానెళ్లు బార్క్ సంస్థలోని కొంత మంది ఉద్యోగులతో మాట్లాడుకుని ఆ మీటర్లు ఎక్కడెక్కడ పెట్టారు అనే విషయాన్ని తెలుసుకున్నాయి. ఆ ఇంట్లో వాళ్లకి ఎదురు డబ్బులు ఇచ్చి తమ ఛానెల్ చూసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇలా చేయడంతో కొన్ని టీవీ ఛానెళ్ల రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. దీంతో తమదే నెం.1 ఛానెల్ అంటూ ఫ్రీ పబ్లిసిటీ చేసేసుకున్నాయి. అయితే ఈ స్కాం ఇటీవల బయటపడడంతో రిపబ్లిక్ టీవీ, ఇండియా టూడే ఛానెళ్ల పై ముంబై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలోనూ పలు ఛానెళ్లు ఇలాంటి స్కాంలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. తెలుగులోనూ పలు ఛానెళ్లు ఇలాంటి స్కాంలకు పాల్పడ్డాయని తెలుస్తోంది.
ఈ స్కాం బయటపడడంతో బార్క్ సంస్ధ కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది. లోపాలు సరిదిద్దుకునేందుకు తగు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రతీ వారం టీవీ ఛానెళ్లకు రేటింగ్స్ ఇచ్చే ఈ సంస్ధ ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుంది. తమ సంస్థను గాడిలో పెట్టేందుకు మూడు నెలల సమయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మూడు నెలల పాటు టీవీ ఛానెళ్లకు రేటింగ్స్ ఇవ్వడం నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీన్ని బట్టి ఈ మూడు నెలల పాటు మేమే నెంబర్ వన్ అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం జాతీయ ఛానెళ్లకే కాక రిజనల్ ఛానెల్స్ కు రేటింగ్ నిలిపివేస్తున్నట్టు బార్క్ ప్రకటించింది.
Election Process of US Prez – Read Here
Like our Facebook Page ChuduBabai
1,554 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022