Why yanamadurru shiva temple is famous and what it’s specialty
శివుడు ఎక్కడైనా లింగ రూపం లోనే దర్శనమిస్తాడు…కానీ ఈ ఆలయంలో మాత్రం విగ్రహ రూపంలో అది కూడా తలకిందులుగా కనిపిస్తాడు… ఈ ఆలయం ఎక్కడుంది… ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా???? మరి ఆ ఆలయ విసేశాలేంతో ఇప్పుడు చూద్దాం so let’s see what’s specality in yanamadurru shiva temple…..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని యనమదుర్రు గ్రామంలో శక్తీస్వరాలయం ఉంది. ఇక్కడ ఉన్నా శివుడు స్వయంభువుగా వెలిసాడని చెబుతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే శివుడు లింగ రూపంలో కాకుండా తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తాడు. అంతే కాకుండా పక్కనే పార్వతి దేవి ఒడిలో కుమారస్వామి దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఇలా శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో దర్సనమిచ్చే ఏకైక ఆలయం ఇదొక్కటే అని చెబుతారు. ఈ ఆలయంలో శివ పార్వతులు ఒకే శిల పై వెలిసారు.. పైగా ఆ శిల భూఒమి లోంచి చొచ్చుకురావడం మరో విశేషం. ఇక్కడ శివుని విగ్రహానికి జటా ఝూటం , నొసట విభూతి రేఖలు, నగభారణము స్పష్టంగా కనిపిస్తాయి.
ఇక ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం…. శంబరుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వచ్చిన వచ్చిన యముడికి శక్తి చాలక శివుడిని ప్రార్దిస్తాడు. అయితే ఆ సమయంలో శివుడు యోగముద్రలో ఉండగా పార్వతి దేవి తన శక్తిని యముడికి అందిస్తుంది. ఆ శక్తి తో యముడు శంబరుడిని సంహరిస్తాడు. యముడి కోరిక మేరకు శీర్శసనంలో ఉన్న శివుడు పార్వతి దేవితో కలిసి స్వయంభువుగా వెలిసాడు. ఆలయం దగ్గరున్న శక్తి గుండంలో కాశి లోని గంగ అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడ కలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శక్తి గుండం తవ్వుతుండగా సర్పం ఆకారంలో ఉన్నా ఆరు అడుగుల శిల బయటపడడంతో సుబ్రహ్మణ్య స్వామిగా భావించి పూజిస్తున్నారు.
ఇక్కడ శక్తీశ్వరున్ని పూజిస్తే అన్ని రకాల రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.
Also read our special article about Father’s Day
Follow us on Facebook at Chudubabai
3,062 Total Views, 3 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022