Aakanksha Episode 6

Aakanksha Episode

Aakanksha  Episode 6

కొన్ని రోజుల తర్వాత…

ఎప్పటిలాగే వినీత ఆఫీస్ వెళ్లడం కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ.. ఆకాష్ రాకపోవడంతో పైకి వెళ్లి ఈ రోజు ఏమైంది ఆఫీస్ కి రావడం లేదు అని అడిగింది. లేదు వినీత ఈ రోజు పని ఉంది అందుకే రావడం లేదు అని చెప్పాడు ఆకాష్.. ఆఫీస్ మానేసే అంత పనేంటో సార్ కి అని అడిగింది వినీత.. నీకు ఆల్రేడీ చెప్పా కదా.. సాధువు కనిపిస్తాడు అని మొన్న బీచ్ కి వెళ్లినప్పుడు చెప్పాడు.. ఇక్కడికి 10 మైళ్ల దూరంలో తంతడి సముద్రం దగ్గర ఈ రోజు సాయంత్రం నేను ఓ పని పూర్తి చేయాలని చెప్పాడు అని వినీతతో అన్నాడు ఆకాష్.. ఏమైంది ఆకాష్ మళ్లీ నీకు.. ఇంతకీ ఏ పని చేయాలి నువ్వు అక్కడ.. అడిగింది వినీత. ఏమో వినీత నేను అక్కడికి వెళ్తే ఓ అమ్మాయి వచ్చి ఏ పని చేయాలో చెప్తుంది అన్నాడు అందుకోసమే ఈ రోజు లీవ్ పెట్టా… రాత్రి అక్కడికి వెళ్లాలి.. నీ కార్ ఇస్తావా అడిగాడు ఆకాష్ సరే ఇస్తాలే అని కిందకి వెళ్లిపోయింది వినీత.

కిందకి వెళ్లి వినీత కంగారుగా డాక్టర్ నీరజకు ఫోన్ చేసింది. నీరజ మళ్లీ ఆకాష్ కి సాధువు కనిపించాడు.. ఈ రోజు ఏదో పని ఉంది అంటున్నాడు అని చెప్పింది. ఓకే నో ప్రాబ్లమ్ నువ్వేం కంగారు పడకు ఎక్కడికి వెళ్లాలో చెప్పాడా అడిగింది నీరజ. హా చెప్పాడు ఇక్కడి నుంచి 10 మైళ్ల దూరంలో ఉన్న తంతడి సముద్రం దగ్గర ఒక అమ్మాయిని కలవాలి అని చెప్పాడు అంది వినీత. ఇంకేమైనా చెప్పాడా అడిగింది ఆత్రుతగా నీరజ. ఇంకేం చెప్పలేదు కానీ అక్కడికి వెళ్లడానికి నా కార్ మాత్రం అడిగాడు అంది వినీత. హే నీరజ నాదొక ప్లాన్.. ఆ కార్ కి సీక్రెట్ కెమెరా, జీపీఎస్ ఎరేంజ్ చేద్దామనుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నాడో మనకి తెలుస్తుంది కదా అంది వినీత. ఓకే అక్కడ ఆకాష్ కి ఏదైనా ప్రాబ్లెం అవ్వొచ్చు సో అక్కడికి నువ్వు ముందే వెళ్లు… ఆ లైవ్ టెలికాస్టింగ్ క్రెడెన్షియల్స్ నాకు ఇవ్వు అని అడగడంతో హా సరే అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ కి లీవ్ పెట్టింది వినీత. మధ్యాహ్నం కిందకి వెళ్లిన ఆకాష్ అంకుల్ అని పిలవవగగానే వినీత బయటకి వచ్చింది. అదేంటి నువ్వు ఆఫీస్ కి వెళ్లలేదా అడిగాడు ఆకాష్. లేదు సాయంత్రం చిన్న పని ఉంది అందుకే లీవ్ పెట్టేసా ఇదిగో కార్ కీస్ అని ఇచ్చింది.

కీస్ తీసుకుని పైకి వెళ్లిన ఆకాష్ కి నీరజ కాల్ చేసింది. ఆకాష్ వినీతని కార్ అడిగావా అంది నీరజ.. అవును అన్నాడు ఆకాష్. ఓకే వినీతని అక్కడికి నీకంటే ముందే వెళ్లమని చెప్పగానే ఓకే చెప్పింది. ఇంకో విషయం కార్ లో సీక్రెట్ కెమెరా పెట్టింది జాగ్రత్త ఆ డిటెయిల్స్ నాకు పంపింది.. అవి నీకు పంపాను చూడు, ఏం చేసినా చాలా జాగ్రత్త బై అని ఫోన్ పెట్టేసింది వినీత. ఓకే అని వెంటనే లాగిన్ డిటెయిల్స్ మార్చేశాడు ఆకాష్. సాయంత్రం ఆరు కాగానే వినీత బయటకి వెళ్లింది. వాళ్ల నాన్న ఎక్కడికి అమ్మా అని అడిగితే పార్టీ ఉంది నాన్న అందుకే ఆఫీస్ కి లీవ్ పెట్టా అంది. వాళ్ల నాన్నకి అర్ధం కాక మరి ఆకాష్ రావడం లేదా అని అడిగాడు వినీత వాళ్ల నాన్న. లేదు నాన్న ఇది మా కాలేజ్ ఫ్రెండ్స్ పార్టీ, నా క్లాస్ మేట్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని పార్టీ ఇస్తోంది అని చెప్పి బండి తీసుకుని వెళ్లిపోయింది.

రాత్రి 8 ఆ టైంకి తంతడి బీచ్ కి చేరుకున్న వినీత బండి ఎవరికీ కనిపించకుండా దాచి ఓ చోట బీచ్ లో కూర్చుని ఉంది. ఎంతసేపటికీ ఆకాష్ రాకపోవడంతో వినీతకు భయం వేసింది. అదేంటి ఇక్కడికే కదా రావాలి ఇంకా రాకపోవడం ఏంటి అని. రాత్రి 11 అవుతోంది.. చుట్టూ చిమ్మ చీకటి… మరోవైపు సముద్రం హోరు దీంతో వినీతకు భయం ఎక్కువైంది. ఇంత సేపు ఉన్నా ఎవరూ రాకపోవడంతో వినీత వెళ్లిపోదాం అని డిసైడ్ అయింది. అయినా ఆకాష్ టైం చెప్పలేదు కదా.. ఓకే ఇంకో 30 నిమిషాలు ఉండి వెళ్లిపోదాం అని వెయిట్ చేస్తూ ఉంది. ఈ లోపు ఓ కార్ రావడం చూసి ఆకాష్ వచ్చాడేమో అని అక్కడ నుంచి లేచి దూరంగా వెళ్లి నుంచుంది. టైం 12 అవుతోంది కానీ ఆకాష్ దగ్గరకు ఎవరూ రాకపోవడంతో వినీతకి కంగారు పెరిగింది ఏం జరగబోతోంది అని.. ఇంకా ఆత్రుత ఆపుకోలేక.. ఆకాష్ దగ్గరకి వెళ్లి.. ఏంటి సార్ ఇంకా ఎవరూ రాలేదా అని అడిగింది వినీత.. వినీత గొంతు విని నేను అదే వెయిట్ చేస్తున్నా ఇప్పటిదాకా ఇంకా రాలేదేంటని.. టైం అయ్యిందిగా వచ్చింది అని.. అన్నాడు ఆకాష్. ఏం చెప్తున్నాడో అర్ధం కాక ఏమంటున్నావ్ ఆకాష్ అని వినీత అడగ్గానే వెంటనే వెనక నుంచి వినీత రెండు చేతులు కట్టేసి కార్ ముందు కూర్చోబెట్టాడు ఆకాష్. వినీతకి ఏం జరుగుతుందో అర్ధం అవ్వక గట్టిగా కేకలు పెడుతుంది. దీంతో కోపం వచ్చి ఆకాష్ వినీతని చెంప మీద కొట్టడంతో వినీత కేకలు వేయడం ఆపేసి.. ఏడవడం మొదలు పెట్టింది. అసలు ఏం చేస్తున్నావ్ ఆకాష్ అని గట్టిగా అడిగింది.

నీ బర్త్ డే రోజు నేను నీ వైపు చూశా ఆ చూపు గుర్తుందా వినీత అని అడిగాడు ఆకాష్. హా ఏమైంది అంటే ఏం లేదు అన్నావ్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ఆకాష్ అంటూ ఏడుస్తూ అడిగింది వినీత. చనిపోయేటప్పుడు కంగారు ఉండకూడదు అని ఆకాష్ చెప్పడంతో నేనేం చేశా ఆకాష్ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావ్ ఆకాష్ అని అడిగింది వినీత. అయ్యో పాపం నువ్వేం చేయలేదు.. అంతా మీ బావే చేశాడు అన్నాడు ఆకాష్. మా బావ నీకేలా తెలుసు వాడు మొన్నే ఇండియా వచ్చాడు.. ఇంకా వాడిని నువ్వు చూడనే లేదు కదా.. అయినా నేనంటే నీకు ఇష్టం లేదుగా ఇంకేంటి నీకు ప్రాబ్లం అడిగింది వినీత.

వినీత జాగ్రత్తగా విను.. మీ బావ మీరు అనుకుంటున్నట్టు అంత మంచివాడు కాదు.. వాడొక క్రిమినల్, హంతకుడు.. వాడికి నువ్వు అసలు సెట్ అవ్వవు అని అన్నాడు ఆకాష్. ఏం మాట్లాడుతున్నావ్ ఆకాష్ నువ్వు.. వాడు నీకెలా తెలుసు అని ఏడుపు తగ్గించి ఆత్రుతతో అడిగింది వినీత. వినీత నేనొక అనాథని.. చిన్నప్పటి నుంచి నాకంటూ ఎవరూ లేరు. నేనుంటున్న అనాథాశ్రమంలో ఆకాంక్ష అనే అమ్మాయి పరిచయం అయింది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. లైఫ్ లో సెటిల్ అయ్యాకా పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం కూడా. అదే టైంలో వచ్చాడు విలన్… సరదాగా సాగుతున్న మా జీవితంలోకి మీ బావ. ఏం మాట్లాడుతున్నావ్ ఆకాష్ మా బావ నీకు ముందే తెలుసా.. ఎలగా అడిగింది వినీత. ఆకాంక్షకు ఒక రోజు ఆఫీస్ లో లేట్ అయింది దాంతో తను నా కోసం బీచ్ దగ్గర వెయిట్ చేస్తోంది. నేను అక్కడికి వెళ్లే లోపు మీ బావ ఆకాంక్షను చంపేశాడు. వాడు ఆకాంక్ష దగ్గరకు వచ్చే టైంలో అదంతా ఆకాంక్ష ఫోన్ లో రికార్డ్ అయ్యింది అన్నాడ ఆకాష్.

సాయంత్రం వెళ్లిన వినీత ఇంకా రాకపోవడంతో వాళ్ల నాన్న కంగారు పడ్డాడు. వినీత ఫ్రెండ్స్ కు ఫోన్ చేసినా తెలియదు అని చెప్పడంతో కంగారు పడిన వినీత వాళ్ల నాన్న విశాల్ కు కాల్ చేయడంతో ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు.

అయితే నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావ్ అడిగింది వినీత. సారీ టూ సే దిస్ వినీత… నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీ బావ అదే విశాల్ గాడు చంపేశాడు… ఇప్పుడు వాడు చేసుకోబోయే అమ్మాయిని వాడు ఎలా చంపాడో నేను అలానే చంపేద్దాం అనుకుంటున్నా అన్నాడు ఆకాష్.. ప్లీజ్ ఆకాష్ నన్ను ఏం చేయకు ప్లీజ్ అంటూ గట్టిగా ఏడుస్తూ ఆకాష్ ను బ్రతిమాలుతోంది వినీత. సారీ వినీత అన్న ఆకాష్ ని చూసిన వినీత ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ఏమైంది ఎలాగా చనిపోవుతున్నావని తెలిసి ఏం చేయాలో తెలియక నవ్వుతున్నావా అడిగాడు ఆకాష్. నువ్వు ఇంత ప్లాన్ చేసి ఇక్కడికి నన్ను తీసుకొచ్చి చంపితే ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా.. కార్ లోపల ఒక కెమెరా.. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కెమెరాలు పెట్టా.. ఇక్కడ జరిగేది అంతా అక్కడ నీరజ చూస్తుంది అంది వినీత. అయ్యో పిచ్చిదానా.. ఆ నీరజ ఎవరనుకుంటున్నావ్… ఆకాంక్ష చెల్లి.. నీ దగ్గర సాధువు డ్రామా ఆడుతున్నప్పుడు నీరజని కలిస్తే తెలిసింది. ఇంకోటి ఆకాంక్ష, నీరజ ఇద్దరూ ట్విన్స్ కావడం వల్ల నీరజను గుర్తుపట్టా. జరిగింది అంతా నీరజకి చెప్తే తనే నాకు హెల్ప్ చేసింది. ఇంకోటి ఆ లాగిన్ డిటెయిల్స్ నేను ఎప్పుడో మార్చేశా అన్నాడు ఆకాష్. ఇక ఏం చేయాలో తెలియక ఏడుస్తున్న వినీత దగ్గరకి వెళ్లిన ఆకాష్ కట్లు విప్పుతుండగా ధ్యాంక్స్ ఆకాష్ అన్న వినీతని చూసి సారి అని చెప్పి వినీత చేయి కట్ చేశాడు ఆకాష్..

Follow our Facebook Page ChuduBabai

Read our New story Series Aakanksha Episode 5

 

 1,671 Total Views,  2 Total Views Today

Comment Your Views