Corona’s Massive Comeback in 2021

అవును మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. జస్ట్ టైమ్ లేట్ అయ్యుండొచ్చు అంతే కానీ అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎక్కడా చిన్న మార్పులు కూడా లేకుండా మళ్లీ అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. 2020 జనవరి ఫిబ్రవరి.. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో చైనాలో ఏదో వైరస్ పుట్టుకొచ్చింది అనే వార్తలే తప్ప అంత భయాందోళనలు కానీ పరిస్థితి.

corona 2021
Lockdown Vachesindhi Fraands


2020 మార్చి ప్రారంభంలో భారత్ లోనూ కేసులు మొదలవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. వైరస్ సోకితే చచ్చిపోవడం ఒకటే దారి అంటూ పుకార్లు పుట్టుకురావడంతో.. ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. కరోనాకు చికిత్స కూడా మొదట్లో లేకపోవడంతో.. ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. ఇక రాను రాను కేసులు పెరగడం.. కరోనా సోకిన కొంత మందికి చిన్న చిన్న చికిత్సలతో నయం కావడంతో కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇదంతా జరగడానికి డిసెంబర్ వరకు టైమ్ పట్టింది.

ఇక ఏముంది వ్యాక్సిన్ వచ్చేసింది.. 2021 రచ్చ రచ్చే.. 2020 భయంకరమైన సంవత్సరం ఇప్పుడేముంది వ్యాక్సిన్ వచ్చింది అంటూ న్యూ ఇయర్ ను భయం లేకుండా ప్రారంభించేశారు. ఇక 2021 జనవరి ఫిబ్రవరిలో సేమ్ సిట్యూయేషన్. ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవవ్ మళ్లీ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లోను కేసులు నమోదవుతున్నా.. తక్కువ మొత్తంలోనే ఉండడంతో మనకేం భయం లేదు.. వ్యాక్సిన్లు ఉన్నాయంటూ ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాయి.
ఇక ఏముంది మళ్లీ మార్చ్ రానే వచ్చింది. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు కరోనా ఎంటర్ అయినట్టే.. ఇప్పుడు కొత్త వేరియంట్లు ఎంటర్ అయ్యాయి. రోజుకు పదుల్లో ఉన్న కేసులు వందలయ్యాయి, వందల నుంచి వేలు.. ఇదిగో ఏప్రిల్ లో లక్షల్లో నమోదవుతున్నాయి. పాపం గతేడాది వైరస్సే కొంచెం నయం.. అంత వేగంగా విస్తరించలేదు. కేసులు లక్ష దాటడానికి కొంచెం టైమ్ తీసుకుంది. కానీ ఈ ఏడాది ఎంటర్ అయిన కొత్త వేరియంట్లు మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. గుంపులో కలిస్తే చాలు.. అందరినీ అంటుకుపోతోంది. ఇక నీకు మాస్కు లేదా.. దా నీ ప్రతాపమో నా ప్రతాపమో చూద్దాం అంటూ రెచ్చిపోతోంది.

గతేడాది కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కు వాడకం తప్పనిసరి అని చెప్పడం కన్నా.. కషాయం తాగడం మిన్న అనే సెంటిమెంట్ ను సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేశారు. అబ్బో ఇక ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా సరే.. కషాయం తయారు చేసే విధానం అంటూ కొత్త కొత్త యూట్యూబ్ ఛానళ్లు కూడా పుట్టుకొచ్చేశాయి. తర్వాత ప్రజల్లో అవగాహన రావడం మాస్కు విధిగా ధరించడంతో దేశంలో కేసులు తగ్గాయి. ఇక కరోనాకు చికిత్సగా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు కూడా రావడంతో అతి తీవ్రంగా ఉన్నవారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదుగా.. అంతా చాప చుట్టేయడమే. ఇక వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వస్తోంది, వ్యాక్సిన్లు పని చేయడం లేదంటూ మళ్లీ పుకార్లు మొదలుపెట్టారు. వ్యాక్సిన్లు మనిషిని శరీరాన్ని బట్టి పని చేస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్న చాలా మందికి కరోనా సోకలేదు, ఒకవేళ వారికి సోకినా.. చాలా భద్రంగా బయటపడ్డారు. ఆ ఏముందిలో అప్పుడు కరోనాతో ఎంత మంది బయటపడలేదు.. మనది ఉక్కు బాడీ లాస్ట్ ఇయర్ సర్వైవ్ అయ్యాం.. ఇప్పుడు అవ్వలేమా అనే అజ్ఞాన ప్రదర్శనలు ఇవ్వకండి. ఈ కొత్త కరోనా తొక్కి పెట్టి నార తీసేస్తోంది. మాస్క్ లేకుండా రోడ్డుపైకి వచ్చావా.. నీకు కరోనా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతోంది. శానిటైజర్ వాడను అంటావా.. నీతోనే ఉంటాను అంటుంది. అంతలా మారిపోయాయి సిట్యుయేషన్స్.

సో బీ కేర్ ఫుల్.. కరోనా ఏం చేస్తుందా అంటే కాటేసి పడుకోబెట్టేస్తుంది. నువ్వనుకున్నట్టు నీది ఉక్కు బాడీ అయినా.. నీలా అందరికీ ఉక్కు బాడీలు ఉండవ్.. నువ్వు తీసుకొచ్చిన వైరస్ నీ ఇంట్లో వాళ్లకి కూడా సోకచ్చు.

Be a responsible Citizen. Wear A Mask

That’s the article about Corona Massive Comeback in 2021, Comment on the situation of Corona in your areas in 2021

Read a sneakpeak of our upcoming Ebook for free here Nuvvu Nenu Coffee

Follow us on facebook at Chudubabai

 743 Total Views,  3 Total Views Today

Comment Your Views
Spread the love