వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారన్న వాదనలో నిజమెంత?

వ్యాక్సిన్

యావత్తు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా, ఒమిక్రాన్‌గా రూపుదిద్దుకుంటుంది. అయితే కరోనా వైరస్ నుంచి విముక్తి పొందేందుకు పలు దేశాలు వ్యాక్సిన్ లను అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలో చాలా దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ను పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే అంతం చేయగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కూడా వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే దేశంలో టీకాలపై అనుమానాలు, వదంతులు, పుకార్లు నెలకొన్నాయి.

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను చేపట్టింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొన్ని అనుమానాలు, వదంతులు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలా.. వద్దా అని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పలువురికి తలనొప్పి, ఒళ్ల నొప్పులు, అలసట వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కొవిడ్ టీకా వేసుకున్నందుకే వస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. కానీ, వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ముందే ఊహించడంతో మూడొంతుల సమస్యలు తలెత్తుతున్నాయని బోస్టన్‌లో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో అనుబంధం ఉన్న BIDMC సెంటర్ నిర్వహించిన ఒక ఆధ్యయనంలో తేలింది.

నిజానికి ఎలాంటి మందు తీసుకోకపోయినా.. సెకండరీ లక్షణాలు కనిపించడం, వ్యాధి తీవ్రత ముదరడం లాంటివి వస్తాయని ముందే అనుకోవడాన్ని ప్లేస్ బో ఎఫెక్ట్ అని అంటారు. నోస్ బో ఎఫెక్ట్ దీనికి మరొక కోణం. అసలు ‘నోస్‌బో ఎఫెక్ట్’ అంటే.. వ్యాధి చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయేమోనని… రోగి ఊహించుకోవడంతో జరిగే పరిణామాలను నోస్‌బో ఎఫెక్ట్ అంటారు. అయితే ఈ సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని BIDMC నిర్వహించిన ఆధ్యయనంలో వెల్లడైంది.

వ్యాక్సిన్ తీసుకోవడంతో పలు సమస్యలు వస్తాయని ముందుగా తెలియడంతో పలువురు కొన్ని లక్షణాలతో సతమతమవుతుంటారు. అయితే అన్ని సార్లు ఈ సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు పూర్తిగా ఊహించుకోవడం వల్ల మాత్రమే తలెత్తవని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత 76%, రెండవ డోసు తర్వాత 52% ప్రతికూల ప్రభావాలు నోస్‌బో ఎఫెక్ట్ వల్లే కలుగుతాయని కోవిడ్‌పై జరిగిన 12 క్లినికల్ ట్రయల్స్‌లో ఆధారాలు సేకరించారు.

అయితే కొవిడ్ టీకా తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆరోగ్య నిపుణులు తక్కువ సమాచారం ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో రోగి ఎక్కువగా ఏదో జరుగుతుందని ఊహించుకోవడం తగ్గుతుందని అంటున్నారు. అయితే మరోవైపు టీకా సైడ్ ఎఫెక్ట్స్ ముందుగానే తెలియజేయడం తప్పనిసరి అని భావిస్తున్నారు. నోస్‌బో ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ టీకాపై ఎలాంటి అపోహాలు నమ్మవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Our Special Article on Megastar Chiranjeevi Click here

Like our Insta Page Chudubabai

 899 Total Views,  1 Total Views Today

Comment Your Views