హైదరాబాద్‌ లో ఇల్లు కొంటున్నారా.. అయితే కోటి పైమాటే

హైదరాబాద్

హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల ధరలు ఇప్పుడు కోటికి పైనే పలుకుతున్నాయి. బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లోనే కాక శివారు ప్రాంతాల్లో ఇప్పుడు అపార్ట్‌మెంట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కరోనా మహమ్మారి ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. కరోనా విజృంభించిన ఏడాది నుంచి ఇప్పటి వరకు పలు కంపెనీలు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలు అయితే ఉద్యోగులను ఇంటికే పరిమితం చేశారు. అయితే ఇంటిని కొనుగోలు చేసే వారి అభిరుచి మారింది. అయితే కొన్ని రంగాలు అభివృద్ధి చెందాయి.

కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ.. రియల్ ఎస్టేట్ రంగం విపరీతమైన వృద్ధి సాధిస్తుంది. ఇంటి కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా రియల్టర్లు గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అపార్ట్‌మెంట్స్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్ ఉండడంతో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో డెవలపర్లు కూడా విస్తీర్ణమైన ఇళ్లను నిర్మిస్తున్నారు.

స్క్వేర్ యార్డ్స్ నివేదిక ప్రకారం.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ.. 2021 చివరినాటికి రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంది. రెసిడెన్షియల్ హోమ్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్య పట్టణాలైన ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌‌లో అపార్ట్‌మెంట్స్‌, ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నగరాల్లో దాదాపు 70% అద్దె ఇంటి శోధనలు, 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇళ్లలో అద్దెకు ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతేడాది ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు పెట్టి 45% అద్దె ఇళ్లలో ఉన్నారు. అయితే కొనుగోలు దారులు పెద్ద ఇళ్ల కోసం వెతికినప్పటికీ.. వారి ఆర్థిక స్థోమతను బట్టి కొనలేకపోతున్నారు.

ఇంటిని కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది 3 BHK గృహాలను కోరుతున్నారు. నివేదిక ప్రకారం గృహాల కొనుగోలు దారులు వెతికిన వాటిలో 43% ఈ యూనిట్లకు సంబంధించినవి ఉన్నాయి. కరోనా కారణంగా జీవనశైలి, అభిరుచులు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులతో అదనపు గది, పెద్ద బాల్కనీలు, ఫ్లెక్సీ గదులతో మరింత స్థలం కోసం డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంటే… సప్లయి మాత్రం ఆదే స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికం (క్యూ4)లో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ఇళ్లకు 28% ఉంది. సప్లయి మాత్రం కేవలం 8% ఉందని స్క్వేర్‌ యార్డ్స్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. రూ.30 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు 15% శాతం డిమాండ్‌ ఉండగా.. సరాఫరా మాత్రం 47%గా ఉంది. ఇక రూ.30 నుంచి 60 లక్షల ప్రాపర్టీలకు 32% శాతం ఉండగా.. సరఫరా 28% శాతం ఉంది. అలాగే రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధర ఉన్న గృహాలకు 24% డిమాండ్ ఉండగా.. సప్లయి 17%గా ఉందని స్క్వేర్ యార్డ్స్ రిపోర్టులో పేర్కొంది.

గత మూడు క్వాటర్స్‌ నుంచి రియల్టీ మార్కెట్‌లో న్యూ ప్రాజెక్ట్స్‌ లాంచింగ్స్‌ చేయగా.. వెస్ట్ హైదరాబాద్‌ లో 57% జరిగాయి. నార్త్‌లో 18%, ఈస్ట్‌లో 15%, సెంట్రల్‌లో 8%, సౌత్‌ హైదరాబాద్‌ లో 2% లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్‌ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఒపెన్‌ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు.. చాలా మంది కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Read Our Special Article on Megastar Chiranjeevi Click here

Like our Insta Page Chudubabai

 2,222 Total Views,  1 Total Views Today

Comment Your Views