Is There A Medical Mafia’s Hand on Remdesivir Injection?

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో సరైన వైద్య సౌకర్యాలు లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై దేశవ్యాప్తంగా కరోనా మరణాలు తగ్గించే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడినా.. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న టైమ్ లో సామాన్యులకు మాత్రం సరైన వైద్యం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ దందాపై chudubabai.com యొక్క ప్రత్యేక కథనం

2020 మార్చ్ నెలలో కరోనా వైరస్ భారత్ లో అప్పుడప్పుడే కోరలు చాస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆ సమయంలో కరోనాను అరికట్టేందుకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. కనీసం డాక్టర్లు వేసుకునేందుకు పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. అలాంటి సమయం నుంచి ఇతర దేశాలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, కోవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు అందించే ఎత్తుకు భారత్ ఎదిగింది.

కరోనా మరణ మృదంగాన్ని మోగిస్తుండడం ప్రైవేట్ హాస్పిటల్స్ వరంగా మారింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడంతో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ తప్పనిసరిగా వాడాలని డాక్టర్లు సజెస్ట్ చేయడంతో రోగుల బంధువులు ఇంజెక్షన్ కోసం పరుగులు పెడుతున్నారు. మరోవైపు రెమ్ డెసివిర్ కొరత ఉండడంతో వాటిని బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ప్రతీ రోజు తెలంగాణలో 3 వేలకు మించి కేసులు నమోదవుతుండడం.. అనధికారికంగా గ్రేటర్ పరిధిలో అనేక మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు హాస్పిటల్స్ లో బెడ్లు ఫుల్ అయ్యాయి. వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో లెక్కకు మించి.. సామర్ధ్యానికి మించి అనధికార వార్డులను ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి రోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. తాజా కరోనా భయాలు, బెడ్ల కొరత ప్రచారం నేపథ్యంలో కొందరు అడ్వాన్స్‌లు చెల్లించి బెడ్లను బ్లాక్‌ చేస్తుండగా.. మరికొందరు బ్లాక్‌ మార్కెట్‌ తరహాలో రూ.3 నుండి రూ.5 లక్షల వరకు అడ్వాన్స్‌ చెల్లిస్తే బెడ్‌ ఇప్పి స్తామంటూ ప్రాణాపాయం ఉన్న స్థితిలో ప్రజల ఆరోగ్యంతో బేరసారాలు ఆడుతున్నారు.

కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో అనధికారికంగా బెడ్లు ఏర్పాటు చేసి కోవిడ్ రోగులను చేర్చుకుంటున్నారు. ఇవన్నీ లెక్కల్లోకి రాకపోవడం.. మరణించిన వారి సంఖ్య కూడా అధికార లెక్కల్లోకి రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం బెడ్లు ఫుల్ అవ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం 80 శాతం బెడ్లు ఫుల్ అయ్యాయని చెబుతున్నాయి.

గతంలో కోవిడ్ సోకితే ఏం వైద్యం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. సైంటిస్టుల కృషితో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ను రోగులకు ఇచ్చేవారు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో దందా మొదలైంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలించి వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం సీరియస్ కండీషన్ లో ఉన్నవారికి మాత్రమే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని ఆదేశిస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ప్రభుత్వాదేశాలు బేఖాతర్ చేస్తున్నాయి. దీంతో ఇంజెక్షన్ కు డిమాండ్ పెరిగింది.

మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. సీరియస్ కండీషన్ లో ఉన్న పేషెంట్లకు లైఫ్ సపోర్ట్ కోసం ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో రోగులకు చికిత్స అందించలేమని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దేశంలోని 9 పరిశ్రమలకు మినహా అన్నిటికీ ఆక్సిజన్ సప్లై ను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వచ్చాయి. ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు ఇప్పటికే రైల్వే శాఖ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ను నడుపుతోంది.

ఆక్సిజన్ కొరత కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ల వైద్యానికి ధరలు నిర్ణయించినా.. ప్రైవేట్ హాస్పిటల్స్ దందా సాగిస్తున్నాయి. సాధారణ చికిత్సకు వేలల్లో వసూలు చేస్తూ.. వెంటిలేటర్ పై ఉన్న వారి దగ్గర నుంచి లక్షల్లో దోచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Be a responsible Citizen. Wear A Mask

That’s the article about Medical Mafia on Remdesivir Injection, Comment on the situation of Corona in your area

Read a sneakpeak of our upcoming Ebook for free here Nuvvu Nenu Coffee

Follow us on facebook at Chudubabai

If you like our article about Medical Mafia on Remdesivir Injection, give us a like.

If you’re read till here, I applaud your commitment and we pray for your family and friends to stay safe ❤

 731 Total Views,  2 Total Views Today

Comment Your Views
Spread the love