
కరోనా వైరస్ 2020 సంవత్సరంలో అటాక్ అవ్వకపోయినా.. ఈ పేరు చెప్తే చాలు ప్రపంచం గడగడలాడిపోయింది. ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో.. ఎవరు ఎలా చనిపోతారో తెలియని మాయరోగం. ఎక్కడో చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. ప్యాండమిక్ అని తేల్చేసింది. అప్రమత్తంగా లేకపోతే వినాశనం తప్పదని హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి.
లాక్ డౌన్ సమయంలోనూ కోవిడ్ విజృంభించింది. అప్పటి వరకు నగరాల్లో ఉన్న కోవిడ్ పల్లెలకు వ్యాపించింది. గ్రామాల్లోనూ మరణమృదంగం మోగించింది. అంతటి ఆగక.. ప్రతీ ఇంటినీ పలకరించింది. కరోనా వస్తే.. చావే అని ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు. ఇక వైద్యులు సైతం కరోనా పేషెంట్లకు ఎలాంటి వైద్యం అందించాలో తెలియక సతమతమయ్యారు. డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలతో వైద్యం అందించారు.
దీంతో కొంత మంది ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తే.. కొంత మంది కడచూపు కూడా లేకుండా వెళ్లిపోయారు. అంతటి మహమ్మారి కరోనా రెండేళ్ల తర్వాత సాధారణ ఫ్లూగా మారిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2021లో కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా.. అందరికీ అది అందించేలోపే.. కోవిడ్ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. ఫస్ట్ వేవ్ లానే సెకండ్ వేవ్‌లోనూ కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాయి. తమ దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకున్నాయి. అప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభణ మొదలైపోయింది. థర్డ్ వేవ్‌లోనూ ప్రపంచ దేశాలు అల్లల్లాడాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోయారు.
కానీ థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌లో అంతలా కనిపించలేదు. కరోనా కేసులు భారత్‌లో భారీగా పెరిగినా.. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోలేదు. అప్పటికే చాలా మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తవడంతో చాలా మంది సీరియస్ కండీషన్‌లోకి వెళ్లలేదు. ఇక ఒమిక్రాన్ సోకిన వారు సైతం చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు.
మరోవైపు ఇండియాలో కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలు తమకు తెలిసిన వైద్యం చేసేసుకున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే.. టెస్ట్ చేయించుకుంటే ఎక్కడ పాజిటివ్ వస్తుందోనని.. ఇంట్లోనే వైద్యం తీసుకున్నారు. డోలో 650 టాబ్లెట్ల సేల్స్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడం ఇందుకు నిదర్శనంగా తీసుకోవచ్చు. జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలు కనిపించగానే డోలో టాబ్లెట్ వేసుకుని నయం చేసుకునేవారు.
సాధారణ లక్షణాలు ఉంటే భయం అవసరంలేదని కొంత మంది వైద్యులు చెబుతుండడంతో ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకున్నారు. దీంతో థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌లో అధికంగా చూపించలేదు.
Read our another article on Fish Attack on Fisherman
Like Our Facebook Page ChuduBabai
![]()
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022
