భారత్ చైనా సరిహద్దు వివాదంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దు దగ్గర సైన్యాన్ని మోహరింపచేశాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెందిన 59 యాప్ లు భారత్ లో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టిక్ టాక్, షేర్ ఇట్ సహా 59 యాప్ లు నిషేధింపబడ్డాయి. భారత్ లో అధికంగా ఉపయోగించే టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి పబ్ జీ పై పడింది. ప్రస్తుతం యువత మొత్తం పబ్ జీ గేమ్ లో మునిగి తేలుతున్నారు. టిక్ టాక్ లో సైతం పబ్ జీ వీడియోలు దర్శనమిచ్చేవి.
అసలింతకి పబ్ జీ ని బ్యాన్ చేస్తారా? పబ్ జీ చైనాకు చెందిందా? ఇప్పుడు చూద్దాం
యువతలో పబ్ జీ ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఉన్న ఖాళీ దొరికితే చాలు సెల్ ఫోన్ లో పబ్ జీ ఆడుతూ కనిపిస్తున్నారు. కేంద్రం చైనా యాప్ లను బహిష్కరించడంతో ఇప్పుడు పబ్ జీ పై చర్చ నడుస్తోంది. పబ్ జీ యాప్ చైనాదేనా ఇప్పుడు దీనిని అన్ ఇస్టాల్ చేయాల్సిందేనా అని చాలా మంది కంగారు పడ్డారు. కానీ అలాంటి కంగారు అవసరం లేదు. ఎందుకంటే పబ్ జీ పూర్తిగా చైనాకు చెందిన యాప్ కాదు.
ఐర్లాండ్ కు చెందిన బ్రదర్ గ్రీన్ అనే వ్యక్తి ఈ గేమ్ ను డెవలప్ చేశాడు. దక్షిణా కొరియాకు చెందిన బ్లూహోల్ కంపెనీ డెస్క్ టాప్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ మొబైల్ వెర్షన్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చి 10 శాతం వాటా తీసుకుంది. అంతకుమించి పబ్ జీ కి చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఈ గేమ్ లో హింస అధికంగా ఉందంటూ విడుదలకు ముందే చైనాలో ఈ యాప్ ను బహిష్కరించారు.
Follow us on Facebook at chudubabai
Read our horror story series Lakshmi
Show your views via comments about this article “Is Pubg a Chinese Game”
2,533 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022