Election Process of US Prez – US Elections 2020

US Elections 2020

అమెరికా.. చదువుకున్న వారికి కలల స్వప్నం. మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది అంటూ మురిసిపోతుంటారు.  ప్రపంచంలో అగ్రదేశాలు ఎన్ని ఉన్నా అమెరికా మాత్రం అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది. అభివృద్ధి జరిగినా, ఆర్ధిక వ్యవస్థ పతనమైనా.. అన్ని దేశాలు కూడా అమెరికాతోనే పోల్చుకుంటాయి. ఇక కరెన్సీ కూడా డాలర్లతోనే పోటీ పడుతుంది.

అలాంటి అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దానికి కారణం లేకపోలేదు. అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తీసుకునే నిర్ణయం చాలా దేశాలపై పడుతుంది. ఆ విధానాలే అక్కడ అభ్యర్ధులను గెలిపిస్తాయి కూడా. మరి అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది.

అగ్రరాజ్యం అమెరికాకు త్వరలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మన దేశంలో జరిగినట్టు కాకుండా అక్కడ ఎన్నికలకు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. అమెరికా ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే జరుగుతాయి. ఈ రెండు పార్టీల్లోని ఏదొక పార్టీ నుంచి మాత్రమే అధ్యక్షుడు ఎన్నికవుతారు. ప్రతీ సారి అమెరికా ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం మొదలవుతాయి. ఈసారి ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ ఎన్నికల బరిలో ఉన్నారు.

US Elections 2020

అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ప్రత్యక్షంగా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోలేరు. 18 సంవత్సరాలు నిండి, అమెరికా పౌరుడైతే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. అమెరికా ఓటింగ్ విధానం ప్రకారం దేశంలో ఉన్న రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. ఆ విధంగా అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

ఈ 538 ఓట్లలో 270 ఓట్లను ఏ అభ్యర్థి గెలుచుకుంటాడో అతడిని దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలోని ప్రతీ ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేస్తారు. ఈ ప్రక్రియలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టోరల్ ఓట్లన్ని అతని ఖాతాలోకి చేరుకుంటాయి. ఈ విధంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అసలు ప్రక్రియ మొదలవుతుంది.

 ఈ విధంగా ఎన్నికైన అభ్యర్ధులు దేశ రాజధానిలో సమావేశమై, డిసెంబర్ రెండో బుధవారం, తర్వాత వచ్చే మొదటి సోమవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకు ఓటు వేస్తారు. ఇలా వీరు వేసిన ఓట్లను అమెరికా కాంగ్రెస్ కు పంపుతారు,. అలా వచ్చిన ఓట్లలో ఏ అభ్యర్థికి 270 కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో వారు దేశాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఒకవేళ ఎలక్టోరల్ ఓట్ల ద్వారా ఏ అభ్యర్ధికి నిర్ణయాత్మక మెజార్టీ రాని పక్షంలో దేశంలోని ప్రతీ రాష్ట్రం నుంచి తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేస్తారు. ఇలా వచ్చిన ఓట్లలో కనీసం ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అతడు దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే వెంటనే అధికార మార్పిడి జరగదు, దానికి కొంత సమయం పడుతుంది. ఆయన బాధ్యతలు స్వీకరించే లోపు తన క్యాబినెట్ ను సిద్ధం చేసుకోవడంతో పాటు పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్ధి జనవరి 20న వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం అధ్యక్షుడు వైట్ హౌస్ కు బయల్దేరతారు. అప్పటి నుంచి వారి నాలుగేళ్ల పదవి కాలం అధికారికంగా ప్రారంభమవుతుంది.

Like our Facebook Page Chudubabai

Li’l Conversation b/w Lord Ganesha and Mooshika- Read Here

 1,492 Total Views,  1 Total Views Today

Comment Your Views