పెళ్లి సందD.. రిలీజై 100 రోజులు దాటినా ఓటీటీ రిలీజ్ ఎందుకు కాలేదు?
ఈ మధ్య కాలంలో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అవుతున్నాయి. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. వీటిలో కొన్ని హిట్ అయితే చాలా వరకు ఫట్ అనిపించాయి. థియేటర్లు ఓపెన్ అయ్యాకా కూడా చాలా సినిమాలపై నమ్మకం లేక.. ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అదే విధంగా థియేటర్ కాకుండా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను కూడా ప్రొడ్యూసర్స్ నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలు సైతం తెలుగు సినిమాలకు ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. ఇక వీలైనంత త్వరగానే వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా 50 నుంచి 60 రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు సైతం నాలుగు వారాల్లో ఓటీటీ బాట పట్టాయి. కోవిడ్ తర్వాత తెలుగు చిత్రసీమకు సూపర్ హిట్ ద్వారా దారి చూపిన అఖండ సైతం 50 రోజులు పూర్తి కాగానే డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ అయ్యింది. ఈ మధ్య కాలంలో రిలీజైన ఓ సినిమా మాత్రం ఓటీటీలో 100 దాటినా రిలీజ్ కావడం లేదు..
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD.. దసరా సీజన్‌లో రిలీజైంది. కానీ ఇప్పటి వరకు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీనంతటకీ కారణం ప్రొడ్యూసర్లు ఎక్కువ రేట్ చెప్తున్నట్టు సమాచారం. . రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి హీరోయిన్‌గా పరిచయమైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ పెళ్లిసందD. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజైన శర్వానంద్ మహా సముద్రం డిజాస్టర్ కావడం పెళ్లిసందDకి ప్లస్ అయ్యింది.
అక్టోబర్ 15న రిలీజైన పెళ్లసందD.. ఇప్పటి వరకు ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవ్వలేదు. ఇప్పటివరకు ఏ సంస్థ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయలేదు. దానికి కారణం నిర్మాతలు భారీ రేటు చెబుతున్నట్టు తెలుస్తోంది. కొత్త హీరో సినిమాకు అంత పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఎవరూ తీసుకోనట్టు తెలుస్తోంది. మరి ప్రొడ్యూసర్స్ తగ్గి.. సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారా.. లేక వారి దగ్గర పెట్టుకుంటారా అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read Our Article on AP Airports Issue Click Here
Like Our Facebook Page ChuduBabai
1,417 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022