
చరిత్ర గురించి తెలుసుకోవాలంటే… పురాణాలు, ఇతిహాసాలు, శిలాశాసనాలు చూసి తెలుసుకోవచ్చు. ఇదంతా ఒకప్పటి మాట. పూర్వం రోజుల్లో ఒక చరిత్రను భావితరాలకు తెలియజేయాలి అనుకుంటే వాటిని శిలాశాసనాలుగా రాసే వారు లేదా… తాళపత్రాలపై రాసి భద్రపరిచేవారు. దానిని కొన్ని తరాల తర్వాత కూడా చదివే అవకాశం ఉంది..

కానీ ఇప్పుడు చరిత్రను భద్రపరచడానికి టైం క్యాప్సుల్స్ ని ఉపయోగిస్తున్నారు. అసలీ టైం క్యాప్సుల్ అంటే ఏంటి? ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది? టైం క్యాప్సుల్ అంటే ఎలా ఉంటుంది?
అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణానికి పనులు చకచకా కొనసాగుతున్నాయి. కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం సమసిపోయి.. ఇప్పుడు నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. ఆగష్టు 5 వ తేదీన దేశ ప్రధాని చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరగనుంది. ఆలయ నిర్మాణ సమయంలో 2వేల అడుగుల లోతున టైం క్యాప్సుల్ ని నిక్షిప్తం చేస్తున్నారు. ఆలయ చరిత్రను తెలిపేలా.. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా చరిత్ర అందరికీ తెలిసేలా ఈ టైం క్యాప్సుల్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
టైం క్యాప్సుల్ అంటే ఏంటి?
ప్రస్తుత చరిత్రను భావితరాలకు ఆధారాలతో సహా తెలియచేయడం కోసం ఉపయోగించేదే టైం క్యాప్సుల్.. ఆలయంపై భవిష్యత్ లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే టైం క్యాప్సుల్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ టైం క్యాప్సుల్ ద్వారా భవిష్యత్ లో ఇక్కడ ఏం జరిగింది.. ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు అనే విషయాలను తెలుసుకోవచ్చు.
టైం క్యాప్సుల్ ఎలా ఉంటుంది?
టైం క్యాప్సుల్ కు ఎలాంటి ఆకారం, రూపం లేదు. సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఒక పెట్టెలాంటి వస్తువునే టైం క్యాప్సుల్ అంటారు. అది స్థూపం కావొచ్చు, చతురస్రాకారం లాంటి పెట్టె కూడా కావొచ్చు.

టైం క్యాప్సుల్ పై ఇప్పటివరకు భారత దేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీనికి పెద్ద చరిత్ర కూడా లేదు. గతంలో భారత దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఎర్రకోటపై టైం క్యాప్సుల్ ఏర్పాటు చేశారు. దీనిపై పెద్ద వివాదాలు జరిగాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 25 ఏళ్లకు జరిగిన అభివృద్ధిపై టైం క్యాప్సుల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ఆ టైం క్యాప్సుల్ ని వెలికితీయించారు.
Like Our Facebook page ChuduBabai
The Untold Story of Farmer Raithanna – Read Here
![]()
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022
