Happy Birthday Guruji

Guruji Chudubabai
Guruji

27 సెప్టెంబర్, 2014.. ఆ రోజు ఒక మనిషి నా మనసు కి కనెక్ట్ అయిపోయాడు. అప్పటి వరకు సినిమాల్ని చూసే వాడ్ని, అప్పటి నుంచి సినిమా గురించి తెలుసుకుంటున్నా.

“ఎక్కడ నెగ్గాలో కాదు రా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప”, “బాగుండడం అంటె బాగా ఉండడం కాధు అత్తా, నలుగురుతో ఉండడం, నవ్వుతూ ఉండడం”, డైలాగ్స్ చిన్న గానే ఉంటాయ్, కాని ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది.

అప్పుడే మా నాన్న కొట్టిన దెబ్బల వల్ల తెలుగు స్పష్టం గా నేర్చుకున్న నాకు, ఈ మాటలు చెవిలో అమృతం పోసినట్టు అనిపించాయి. థియేటర్లో సీట్లోనే కూర్చుని ఉన్నా. కానీ లోపల ఉన్నోడు మాత్రం ఆయనతో మాట్లాడేస్తున్నాడు.

Also, read our most lovable article about Raithanna

ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా..
ఆయన సినిమాలు, స్పీచ్లు చూడడం అలవాటు అయిపోయింది. ఎప్పటికీ వదులుకోలేని అలవాటైపోయింది.

జులాయి సినిమా చూస్తున్నప్పుడు ఆయన మేజిక్కి ఫిదా అయిపోయా. ఖలేజా,జల్సా చూసాక ఇంక ఆయనకి భక్తుడ్ని అయిపోయా. అప్పుడే నాకు ఇంకో విషయం తెలిసింది.

ఆయన డైరెక్టర్ కాక ముందు రైటర్గా పని చేసాడు అని.
ఇంక నేను గూగుల్ కి పని చెప్పా,అన్ని సినిమాలు చుసా. ఒక్కొక్క మాట ఒక్కొక్క నిజంలా అనిపించింది. ఇప్పుదు కూడా ఎవరికైనా మంచి చెప్పాలంటే నాలోకి ఆయన వచ్చేస్తాడు. నన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేశాడు ఆయన.
అందరు థియేటర్లో హీరో కనిపిస్తే, ఫైట్స్ వస్తేనో అరుస్తారు.
కానీ ఆయన్ని ఆరదించే మాకు “Written & Directed By” అని ఆయన పేరు చూస్తే చాలు, పూనకాలె…

ఆ మొమెంట్ భూఆకర్షణ శక్తి 10,50,100 రెట్లు పెరిగినా కానీ, మేము మాత్రం సీట్లో ఉండం… ఆయన వేరు, ఆ స్థానం వేరు…. ఆయన మాకు ఒక శాస్త్రం, ఎంత చదివినా ఇంకా లోతు ఉండే అద్బుతమైన శాస్త్రం..

ఆయన సినిమాలతో మా ఆలోచనలను మార్చిన మా “మాటల మాంత్రికుడి”కి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటికైనా ఆయన్ని అందుకోవాలనే తపనతో పడిలేస్తున్న కెరటాన్నీ…..
సాయి కిరణ్.

That’s our special article about Guruji, hope you like it. Comment your favorite Guruji

Follow us on Facebook at Chudubabai

 2,181 Total Views,  1 Total Views Today

Comment Your Views
Manoj Ayyagari
Follow me
Latest posts by Manoj Ayyagari (see all)