ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ళతో ఒక్కటవుతున్నారు. ఇక సినీ రంగంలో ప్రేమ పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం అయింది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించిన పలువురు తారలు… నిజ జీవితంలో ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కొందరు నటులు.
సినీరంగంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న కొందరు నటులు వైవాహిక జీవితాన్ని ఎంజాయి చేస్తున్నారు. మరికొందరు విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు రియల్ లైఫ్‌లో ప్రేమించుకుని మూడు ముళ్ళ బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైన జంటలు ఏవో తెలుసుకుందాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ హీరోగా వచ్చిన వంశీ సినిమాలో నటించిన నమ్రతను 2005లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. మహేశ్ బాబు తండ్రి కృష్ణ ‘సాక్షి’ సినిమాలో నటిస్తుండగా విజయ నిర్మలను ప్రేమించారు. అనంతరం వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సమంత ఎంట్రీ ఇచ్చారు. సిల్వర్ స్క్రీన్‌లో రొమాన్స్ చేసిన నాగచైతన్య, సమంత.. రియల్ లైఫ్‌లోనూ కంటిన్యూ చేశారు. ఒకరికొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది అక్టోబర్ 2న నాగ్ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక హిరో నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
‘బద్రి’ మూవీలో తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించారు. అప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడి… కొన్నాళ్లు సహజీవనం చేశారు. వారికి అకీరానందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. అనంతరం అన్నా లెజ్‌నోవాను పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు.
తెలుగు, తమిళ సినిమాల్లో కలిసి నటించిన సూర్య, జ్యోతిక.. ఏడడుగులతో ఒక్కటయ్యారు.
హిరోయిన్‌గా నటించి అందరి మనస్సులో పదిలమైన స్నేహ.. ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించిన వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రేమ పెళ్లి తో ఒక్కటయ్యారు. వీరిద్దరు తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 3లో జంటగా ప్రేక్షకులను అలరించారు. హీరో ధనుష్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సినిమాల్లో నటించిన రాజశేఖర్, జీవిత.. ప్రేమలో పడి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాలో నటిస్తున్న సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన శ్రీకాంత్, ఊహా మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. హీరోయిన్ రోజా, దర్శకుడు సెల్వమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ రమ్యకృష్ణను డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నో తమిళ, హిందీ సినిమాల్లో కలిసి నటించిన కమల్ హాసన్, సారికలు.. నిజ జీవితంతో ఏడుడగులతో ఒక్కటయ్యారు.
ఇలా నిజమైన నిజ జీవితంలోనూ ఒక్కటైన జంటల్లో రాధిక – శరత్ కుమార్, సావిత్రి – జెమిని గణేషన్, సుహాసిని – మణిరత్నం ఉన్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన శరత్ బాబు – రమాప్రభ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు.
Read Our Special Article on Megastar Chiranjeevi Click here
Like our Insta Page Chudubabai
1,674 Total Views, 2 Total Views Today
- మేడారం జాతర వెనుక అసలు కథ - February 18, 2022
- కలెక్టర్ గారి ప్రేమ కథా చిత్రమ్ - February 17, 2022
- సినీ తారలు.. విడాకులు - February 17, 2022