Play Back
వన్ నేనొక్కడినే చిత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ మూవీ గా చెప్పొచ్చు. అయితే ఈ కథ రాసింది సుకుమార్ ఫ్రెండ్ జక్కా హరి ప్రసాద్ అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి కథ రాసిన జక్క హరి ప్రసాద్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో తెలుగు ప్రేక్షకుల దగ్గరకు రాబోతున్నారు.
ఏ సినిమాకైనా కథే హీరో, కథ బాగుంటే యునానిమస్ గా సినిమా హిట్ అయిపోతుంది. ఇప్పుడు హరి ప్రసాద్ తెరకెక్కించిన చిత్రంలో కూడా అలాంటి డిఫరెంట్ కథనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ ను తెలుగు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలోనే తొలి క్రాస్ టైం కనెక్షన్ కథతో ప్లే బ్యాక్ చిత్రాన్ని రూపొందించారు హరి ప్రసాద్. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది.
హుషారు ఫేం దినేష్ తేజ, మల్లేశం ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 5న విడుదలకు సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా మూర్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో మూర్తి తన రియల్ లైఫ్ క్యారెక్టర్ పోషించారు. ప్లే బ్యాక్ చిత్రంలో కూడా మూర్తి జర్నలిస్ట్ గానే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో టీఎన్ఆర్, అర్జున్ కళ్యాణ్, స్పందన, కార్తికేయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి నమ్మకంతో ఉంది. మార్చి 5న సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
Follow our Facebook Page Chudubabai
Read our thriller story series Aakanksha
Follow TV5 Murthy on Facebook
2,287 Total Views, 2 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022